iDreamPost

అదృష్టం అంటే ఇతడిదే.. రూ.49తో డెలివరీ బాయ్‌ రూ.కోటిన్నర గెలిచాడు!

ఓ డెలివరీ బాయ్ కోటీశ్వరుడయ్యాడు. చాలీ చాలని జీతంతో జీవితాన్ని నెట్టుకొస్తున్న అతడికి జాక్ పాట్ తగిలింది. ఏకంగా రూ. కోటిన్నర గెలుచుకున్నాడు. ఇంతకీ ఎలా గెలిచాడు అంటే?

ఓ డెలివరీ బాయ్ కోటీశ్వరుడయ్యాడు. చాలీ చాలని జీతంతో జీవితాన్ని నెట్టుకొస్తున్న అతడికి జాక్ పాట్ తగిలింది. ఏకంగా రూ. కోటిన్నర గెలుచుకున్నాడు. ఇంతకీ ఎలా గెలిచాడు అంటే?

అదృష్టం అంటే ఇతడిదే.. రూ.49తో డెలివరీ బాయ్‌ రూ.కోటిన్నర గెలిచాడు!

అదృష్టం ఎప్పుడు ఎవరినీ ఎలా వరిస్తుందో చెప్పలేము. అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో కూడా చెప్పడం కష్టమే. అప్పటిదాక పేదరికంలో మగ్గిన వారు రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోతారు. ఇప్పటి వరకు ఇలాంటి ఘటనలు చాలానే చూశాము. తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు లాటరీ టికెట్లు కొనుక్కొని కోట్లు గెలుచుకున్నవారు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు ఇదే రీతిలో ఓ డెలివరీ బాయ్ కోటీశ్వరుడయ్యాడు. చాలీ చాలని జీతంతో జీవితాన్ని నెట్టుకొస్తున్న అతడికి జాక్ పాట్ తగిలింది. ఓ బెట్టింగ్ యాప్ ద్వారా ఏకంగా రూ. కోటిన్నర గెలుచుకున్నాడు. ఇది తెలిసిన వారు అదృష్టం అంటే ఇతడిదే పో అంటూ ప్రశంసిస్తున్నారు.

బిహార్‌లోని అరారియా జిల్లా పటేగనా గ్రామానికి చెందిన సాదిఖ్‌ స్థానికంగా ఓ గ్యాస్ ఏజన్సీలో డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. ప్రతిరోజు ఇంటింటికి తిరిగి గ్యాస్ సిలిండర్స్ సరఫరా చేస్తుంటాడు. అయితే ఇతడికి అందరి లాగానే క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. క్రికెట్ పై ఉన్న ఆ ఆసక్తే ఇవ్వాలా సాదిఖ్ ను కోటీశ్వరుడిని చేసింది. సాదిఖ్ ఫాంటసీ క్రికెట్‌ గేమ్‌లో జాక్‌పాట్‌ కొట్టాడు. డ్రీమ్‌-11 యాప్‌లో గేమ్‌ ఆడిన అతడు ఏకంగా రూ.కోటిన్నర సొంతం చేసుకున్నాడు. దీంతో సాదిఖ్ వార్తల్లో నిలిచాడు.

క్రికెట్ అంటే ఎంటర్ టైన్ మెంట్ మాత్రమే కాదు అదొక ఎమోషన్. అది క్రికెట్ ను ప్రేమించే వారికి మాత్రమే అర్థమవుతుంది. అంతగా ఇష్టమైన క్రికెట్ బిహార్ యువకుడు సాదిఖ్ ను కోటీశ్వరుడిని చేసింది. అదేలా అంటారా? ఈ నెల 14న భారత్‌-అఫ్గానిస్థాన్‌ మధ్య టీ20 మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్ సందర్భంగా సాదిఖ్ రూ.49 పెట్టి డ్రీమ్‌-11లో గేమ్‌ ఆడాడు. డ్రీమ్ 11 అనేది ఓ బెట్టింగ్ యాప్. కాగా ఈ మ్యాచ్‌లో 974.5 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచాడు సాదిఖ్. దీంతో అతడు ఫాంటసీ క్రికెట్ గేమ్ లో రూ.కోటిన్నర గెలుచుకున్నాడు. ఇక ఈ విషయం తెలిసిన అతడి కుటుంబంలో సంతోషం నెలకొంది. మరి గ్యాస్ డెలివరీ బాయ్ రూ. కోటిన్నర గెలుచుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి