iDreamPost

Sachin Tendulkar: బౌలింగ్ లోనూ సచిన్ మెరుపులు.. ఇన్నాళ్ళైనా ఆ జోష్ తగ్గలేదు!

వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ కప్ 2024లో సచిన్ టెండుల్కర్ మరోసారి సత్తా చాటాడు. బ్యాటింగ్ తోనే కాకుండా.. బౌలింగ్ తో కూడా ఆకట్టుకున్నాడు.

వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ కప్ 2024లో సచిన్ టెండుల్కర్ మరోసారి సత్తా చాటాడు. బ్యాటింగ్ తోనే కాకుండా.. బౌలింగ్ తో కూడా ఆకట్టుకున్నాడు.

Sachin Tendulkar: బౌలింగ్ లోనూ సచిన్ మెరుపులు.. ఇన్నాళ్ళైనా ఆ జోష్ తగ్గలేదు!

వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ కప్ 2024’ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. కొన్నేళ్లపాటు తమ ఆటతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను అలరించారు. అలాంటి వాళ్లంతా క్రికెట్ కు వీడ్కోలు పలికిన తర్వాత ఒక టోర్నీతో మరోసారి అభిమానుల్లో జోష్ నింపారు. అయితే ఈ మ్యాచ్ ద్వారా ఇప్పటికీ తమలో ఆ జోరు, జోషు తగ్గలేదని ఈ మ్యాచ్ తో నిరూపించారు. ముఖ్యంగా సచిన్ టెండుల్కర్ అటు బ్యాటుతోనే కాకుండా.. ఇటు బాల్ తో కూడా తనలో ఇంకా ఆ పదును అలాగే ఉందని నిరూపించుకున్నాడు. బాలింగ్ వేయడం మాత్రమే కాకుండా వికెట్ అదరగొట్టాడు.

వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ కప్ 2024లో జరిగిన ఈ మ్యాచ్ లో సచిన్ టెండుల్కర్ అద్భుతంగా రాణించాడు. వ్యక్తిగత ప్రదర్శన మాత్రమే కాకుండా.. కెప్టెన్ గా కూడా సచిన్ టెండుల్కర్ బెస్ట్ అని మరోసారి నిరూపించుకున్నాడు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సచిన్ టెండుల్కర్ జట్టు.. ప్రత్యర్థులను 180 పరుగులకే కట్టడి చేసింది. ఈ టీ20 మ్యాచ్ లో యువీ జట్టు కూడా అద్భుతంగానే రాణించింది. కానీ, చివరకు ఓటమి మాత్రం తప్పలేదు. ముందుగా బ్యాటింగ్ చేసిన యువరాజ్ సారథ్యంలో ఉన్న వన్ ఫ్యామిలీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.

ఈ ఇన్నింగ్స్ లో సచిన్ బాలింగ్ తో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్ లో తనదైన బ్యాటింగ్ తో డారెన్ మ్యాడీ రాణిస్తున్నాడు. అప్పటికే అర్ధ శతకం చేసుకుని మంచి ఫామ్ లో ఉన్నాడు. అలాంటి మ్యాడీని సచిన్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ కు చేర్చాడు. ఫుల్ టైమ్ బౌలర్లనే ఆ విధంగా బాదేస్తున్న మ్యాడీకి సచిన్ వచ్చి బ్రేకులు వేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత బ్యాటింగ్ లో కూడా సచిన్ తన సత్తా చాటాడు. కేవలం 16 బంతుల్లోనే 3 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 27 పరుగులు చేశాడు. ముత్తయ్య బౌలింగ్ లో భారీ షాటుకు ప్రయత్నిస్తూ బౌండరీ మీద కైఫ్ కు దొరికిపోయాడు.

ఇంక ఈ మ్యాచ్ సమురీ చూస్తే.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వన్ వరల్డ్ జట్టు.. యువీ టీమ్ అయిన వన్ ఫ్యామిలీని 180 పరుగులకు కట్టడి చేసింది. డారెన్ మ్యాడీ(51), కలువితరాణా(22), కైఫ్(9), పార్దివ్ పటేల్(19), యూసుఫ్ పఠాన్(38), యువరాజ్ సింగ్(23), జేసన్ క్రేజా(2 నాటౌట్), అలోక్ కపిల్(1 నాటౌట్) పరుగులు రాబట్టారు. వన్ వరల్డ్ బౌలింగ్ చూస్తే హర్భజన్ కు 2 వికెట్లు, సచిన్, మోంటీ పనేసార్, అశోక్ డిండా, ఆర్పీ సింగ్ లకు తలో వికెట్ దక్కింది. 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వన్ వరల్డ్ జట్టు మొదటి నుంచి అటాక్ మోడ్ లోకి వచ్చేసింది. నామన్ ఓజా(25), సచిన్ టెండుల్కర్(27), అల్విరో పీటర్సన్(74), ఉపుల్ తరంగా(29), సుబ్రమణ్యం బద్రీనాథ్(4), ఇర్ఫాన్ పఠాన్(12), హర్భజన్ సింగ్(4) పరుగులు చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసి మ్యాచ్ లో అద్భుతమైన విజయాన్ని నమోదు చేశారు. మరి.. ఇప్పటికీ బ్యాటింగ్, బౌలింగ్ లో అదే తరహా ప్రదర్శనతో సత్తా చాటుతున్న సచిన్ టెడుల్కర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి