iDreamPost

జగన్ అడ్డా పులివెందులలో TDP మరో భారీ షాక్!

TDP: ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది టీడీపీ షాకుల మీద షాకులు తగలుతున్నాయి. ఇప్పటికే ఎంపీ కేశినేని నాని, స్వామిదాస్, గొల్లపల్లి సూర్యారావు వంటి మాజీ టీడీపీ నేతలు పార్టీకి వీడారు. తాజాగా జగన్ అడ్డా పులివెందులలో కూడా టీడీపీకి గట్టి షాక్ తగిలింది.

TDP: ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది టీడీపీ షాకుల మీద షాకులు తగలుతున్నాయి. ఇప్పటికే ఎంపీ కేశినేని నాని, స్వామిదాస్, గొల్లపల్లి సూర్యారావు వంటి మాజీ టీడీపీ నేతలు పార్టీకి వీడారు. తాజాగా జగన్ అడ్డా పులివెందులలో కూడా టీడీపీకి గట్టి షాక్ తగిలింది.

జగన్ అడ్డా పులివెందులలో TDP మరో భారీ షాక్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా మండే అగ్నిగోళంకి ఏ మాత్రం తీసిపోని స్థాయిలో ఉన్నాయి. ముఖ్యంగా అధికగార వైఎస్సార్ సీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య జరుగుతున్న పొలిటికల్ వార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష టీడీపీ వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక ఎన్నికల దగ్గర పడుతున్న కొద్ది అన్ని పార్టీల్లో కూడికలు, తీసివేతలు జరుగుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ విషయంలో తీసివేతలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఆ పార్టీకి పలువురు కీలక నేతలు రాజీనామాలు చేస్తూ.. టీడీపీకి షాకిస్తున్నారు. తాజాగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అడ్డా అయినా పులివెందుల గడ్డపై కూడా టీడీపీ గట్టి దెబ్బ తగిలింది.

వైఎస్సార్ కుటుంబానికి అడ్డ పులివెందుల గడ్డ. ఇది అందరికి తెలిసిన విషయమే. అలానే ఇక్కడ వైఎస్ కుటుంబంపై ప్రత్యర్థిగా పోటీ చేసే ఎవరైనా కేవలం నామ మాత్రమే. అందుకే దశాబ్దాలుగా పులివెందుల, కడప లోక్ సభలో వైఎస్ కుటుంబమే విజయం సాధిస్తుంది. ప్రత్యర్థులు మారిన కూడా, టీడీపీ ఎంతో మంది బలమైన నేతలను దింపినా కూడా వైఎస్ ఫ్యామిలీ విజయాన్ని ఆపలేకపోయారు. ఇంకా చెప్పాలంటే.. వైఎస్ ఫ్యామిలీ పొందే మెజార్టీని తగ్గించడం కోసం మాత్రమే ప్రత్యర్థులు ప్రయత్నిస్తుంటారు. అలా వైఎస్ ఫ్యామిలీ మీద పోటీ చేసిన వారిలో ఎస్. సతీష్ రెడ్డి ఒకరు. ఈయన పులివెందుల టీడీపీలో బలమైన నేత. అలానే వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై, ఆయన తనయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. తండ్రీకొడుకులపై పోటీ చేసిన ఘనత ఆయనకే దక్కింది.

2004 నాలుగు నుంచి వైఎస్ కుటుంబం పై సతీష్ రెడ్డి పోటీ చేస్తూ వచ్చారు. ఆ ఎన్నికల్లో 33 వేల పై చిలుకు ఓట్లను మాత్రమే సాధించారు. అనంతరం 2009 ఎన్నికల్లో 34 వేల ఓట్లు మాత్రమే సాధించారు. ఇక 2014లో కూడా 39 వేల ఓట్లు సాధించారు. ఇలా ప్రతి ఎన్నికల్లో తన ఓట్లును స్వల్పంగా పెంచారే కానీ..వైఎస్ కుటుంబ మోజార్టీని మాత్రం ఏ మాత్రం తగ్గించలేకపోయారు. ప్రతి ఎన్నికల్లో వైఎస్ కుటుంబం మోజార్టీ పెరుగుతూనే వచ్చింది. 2019 ఎన్నికల్లో ఏకంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రికార్డు సృష్టించారు. రాష్ట్రంలోనే అత్యధిక మోజార్టీ సాధించిన ఎమ్మెల్యేగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రికార్డు సృష్టించారు.

ఎన్ని సార్లు ఓటమి ఎదురైనా కూడా ఆ కుటుంబంపైనే సతీష్ రెడ్డి పోటి చేస్తూ వచ్చారు. అలా 30 ఏళ్లుగా టీడీపీ ఉంటూ వైఎస్ కుటుంబంతో సతీష్ రెడ్డి పోరాడిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే మారుతున్న రాజకీయ పరిణామాలు, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నిర్ణయాలపై సతీష్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. ఇదే సమయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలకు సతీష్ రెడ్డి ఆకర్షితులయ్యారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి సతీష్ రెడ్డికి చంద్రబాబు టికెట్ ఇవ్వలేదు. పులివెందుల టికెట్‌ను మరో సీనియర్ నాయకుడు బీటెక్ రవికి కేటాయించారు.

ఈ అంశం పక్కన పెడితే.. జగన్ అందిస్తున్న సంక్షేమ పాలనపై సతీష్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే టీడీపీని వీడాలని సతీష్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఆ మేరకే సతీష్ రెడ్డి..  తెలుగు దేశం పార్టీకి గుడ్‌బై చెప్పారు. సీఎం జగన్ సమక్షంలో త్వరలో వైఎస్సార్ సీపీ కండువాను కప్పుకోనున్నారు. ఇలా టీడీపీ సీనియర్ నాయుకుడు, పులివెందుల్లో టీడీపీకి బలమైన నేత పార్టీని వీడటంతో ఆ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. అంతేకాక బలమైన నేతగా ఉన్న సతీష్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడే సీఎం జగన్ దాదాపు లక్ష మోజార్టీ సాధించారు. తాజాగా ఆయన వైసీపీ చేరుతుడటంతో వచ్చే ఎన్నికల్లో జగన్ మోజార్టీ భారీగా పెరగనుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి