iDreamPost

రుతురాజ్ మెరుపు సెంచరీ.. కేవలం 51 బంతుల్లోనే..

  • Author Soma Sekhar Published - 07:17 PM, Wed - 25 October 23

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023లో టీమిండియా యువ ఆటగాళ్లు చెలరేగుతున్నారు. మరీ ముఖ్యంగా టీమిండియా ఓపెనర్, మహారాష్ట్ర ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ తన జోరును కొనసాగిస్తున్నాడు.

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023లో టీమిండియా యువ ఆటగాళ్లు చెలరేగుతున్నారు. మరీ ముఖ్యంగా టీమిండియా ఓపెనర్, మహారాష్ట్ర ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ తన జోరును కొనసాగిస్తున్నాడు.

  • Author Soma Sekhar Published - 07:17 PM, Wed - 25 October 23
రుతురాజ్ మెరుపు సెంచరీ.. కేవలం 51 బంతుల్లోనే..

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023లో టీమిండియా యువ ఆటగాళ్లు చెలరేగుతున్నారు. మరీ ముఖ్యంగా టీమిండియా ఓపెనర్, మహారాష్ట్ర ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ తన జోరును కొనసాగిస్తున్నాడు. ఇటీవల బెంగాల్ తో జరిగిన మ్యాచ్ లో 82 పరుగులతో దుమ్మురేపిన గైక్వాడ్.. తాజాగా విదర్భతో జరిగిన మ్యాచ్ లో సెంచరీతో చెలరేగాడు ఈ యువ బ్యాటర్. తన జోరును కొనసాగిస్తూ.. జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. రుతురాజ్ విధ్వంసకర శతకంతో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది మహారాష్ట్ర టీమ్.

రుతురాజ్ గైక్వాడ్.. ప్రస్తుతం ఈ పేరు క్రికెట్ లో మారుమ్రోగిపోతోంది. దానికి కారణం అతడి విధ్వంసకర ఆటతీరే. ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పెను తుపాన్ సృష్టిస్తున్నాడు ఈ చిచ్చరపిడుగు. తాజాగా విదర్భతో జరిగిన మ్యాచ్ లో సెంచరీతో చెలరేగాడు. కేవలం 51 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 6 సిక్సులతో 102 పరుగులు చేశాడు రుతురాజ్. అతడి థండర్ ఇన్నింగ్స్ కారణంగా 178 పరుగుల టార్గెన్ ను కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 16.1 ఓవర్లలోనే దంచికొట్టింది మహారాష్ట్ర జట్టు. రుతురాజ్ కు అండగా.. కెప్టెన్ కేదార్ జాదవ్(42) పరుగులతో రాణించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన విదర్భ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. జట్టులో ధ్రువ్ షోరే(62) పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. మరి ఈ ట్రోఫీలో చిచ్చర పిడుగులా రెచ్చిపోతున్న రుతురాజ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి