iDreamPost

ఒక్క సినిమా తెచ్చిన క్రేజ్! రెమ్యూనరేషన్ ఆ రేంజ్ లో పెంచేసిందా..?

  • Author ajaykrishna Published - 05:05 PM, Sat - 8 July 23
  • Author ajaykrishna Published - 05:05 PM, Sat - 8 July 23
ఒక్క సినిమా తెచ్చిన క్రేజ్! రెమ్యూనరేషన్ ఆ రేంజ్ లో పెంచేసిందా..?

గతేడాది బ్లాక్ బస్టర్ ‘సీతారామం’ మూవీ రిలీజ్ అయ్యేదాకా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. సినిమా వచ్చాక సీత క్యారెక్టర్ అంటే.. ఒకప్పటి కమలిని ముఖర్జీ కాదు.. మృణాలే అంటున్నారు. అంటే.. ఆ రేంజ్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఈ బాలీవుడ్ చిన్నది. ఒక్క దెబ్బతో కుంభస్థలం బద్దలు కొట్టినట్లు.. సీతారామం మూవీ పుణ్యమా అని మృణాల్ కి ఊహించని రేంజ్ లో అవకాశాలు తలుపు తట్టాయి. ఇంకేముంది.. వరుసగా బాలీవుడ్ తో పాటు తెలుగులో కూడా లైనప్ గట్టిగానే చేస్తోంది. డెబ్యూ మూవీతోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారి.. తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ కూడా సొంతం చేసుకుంది.

సీతారామం తర్వాత తెలుగులో నాని సరసన ఓ మూవీ చేస్తోంది. ప్రెజెంట్ ఆ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఇంకా మరికొన్ని సినిమాలను లైనప్ చేయడానికి కథలు వింటోందట. ఈ క్రమంలో మృణాల్ ని తాజాగా హీరో రానా మూవీ కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే.. అవకాశాలు వస్తుండటంతో దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే విధంగా మృణాల్ ఆలోచన చేస్తోందట. అందుకే.. ఇప్పుడున్న క్రేజ్ ని క్యాష్ చేసుకుంటూ.. రెమ్యూనరేషన్ విషయంలో కూడా మార్పులు చేసినట్లు టాక్. అవును.. మృణాల్ ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ బ్యూటీ కాబట్టి.. రెమ్యూనరేషన్ పెంచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా ఎంతనో కాదు.. సుమారు రూ. 2 కోట్లు అంట.

మృణాల్ రెమ్యూనరేషన్ ఆ రేంజ్ లో తీసుకుంటుందని కథనాలు అయితే వినిపిస్తున్నాయి. కానీ.. ప్రస్తుతం క్రేజ్ లో ఉంది కాబట్టి ఆ రేట్ అని కొందరు.. ఒక్క సినిమాకే ఇంత తీసుకోవడం మరీ ఎక్కువ అన్నట్లుగా కొన్ని కామెంట్స్ వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయం తెలిసి మృణాల్ ఫ్యాన్స్ హ్యాపీ. అదీగాక ఆమెకు అంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి ప్రొడ్యూసర్లకు అభ్యంతరం లేకపోతే ఖచ్చితంగా చాలా సినిమాలు ఓకే చేసే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే.. సీతారామం చూసాక స్టార్ హీరోలు సైతం మృణాల్ ని తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారని వినికిడి. ఇదిలా ఉండగా.. సీతారామం తర్వాత మృణాల్.. రీసెంట్ గా లస్ట్ స్టోరీస్ 2లో మెరిసింది. ఇక నానితో పాటు విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేస్తోంది మృణాల్. మరి మృణాల్ రెమ్యూనరేషన్ గురించి వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి