iDreamPost
android-app
ios-app

స్టార్ క్రికెటర్‌తో పూజా హెగ్డే పెళ్ళి అంటూ వార్తలు..!

  • Published Sep 24, 2023 | 12:51 PM Updated Updated Sep 24, 2023 | 5:20 PM
  • Published Sep 24, 2023 | 12:51 PMUpdated Sep 24, 2023 | 5:20 PM
స్టార్ క్రికెటర్‌తో పూజా హెగ్డే పెళ్ళి అంటూ వార్తలు..!

అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన ఒక లైలా కోసం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యింది బుట్టబొమ్మ పూజాహెగ్డే. ఆ తర్వాత వరుణ్ తేజ్ సరసన ముకుంద సినిమాలో నటించింది. ఆ వెంటనే బాలీవుడ్‌కి వెళ్లింది. కానీ అక్కడ భారీ డిజాస్టర్‌ ఆమె ఖాతాలో చేరింది. ఆ తర్వాత తిరిగి టాలీవుడ్‌ బాట పట్టింది. వరుస హిట్లు తన ఖాతాలో వేసుకుని.. టాలీవుడ్‌లోనే కాక సౌత్‌లోనే నంబర్‌ 1 హీరోయిన్‌గా నిలిచింది. కొన్నాళ్ల పాటు వరుస హిట్లు తన ఖాతాలో వేసుకున్న పూజా హెగ్డేకు ప్రస్తుతం కాలం కలిసి రావడం లేదు. బీస్ట్, రాధేశ్యామ్, కిసీకా భాయ్ కిసీకీ జాన్ వంటి సినిమాలు వరుసగా డిజాస్టర్లయ్యాయి. గుంటూరు కారం సినిమా నుంచి కూడా ఆమె తప్పుకుంది.

అయితే హిట్టు, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా పూజా హెగ్డే క్రేజ్‌ మాత్రం రోజు రోజుకి పెరుగుతోంది. ఇక సోషల్‌ మీడియాలో కూడా అమ్మడి రచ్చ మాములూగా ఉండదు. ఇదిలా ఉండగా.. తాజాగా పూజా హెగ్డేకు సంబంధించి ఒక ఆసక్తికర వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. అది ఏంటంటే.. త్వరలోనే బుట్టబొమ్మ.. పెళ్లి పీటలు ఎక్కబోతుంది అంట. ఓ స్టార్‌ క్రికెటర్‌తో పూజా హెగ్డే వివాహం జరగబోతుందని జోరుగా ప్రచారం సాగుతోంది.

వీరిద్దరూ చాలా రోజుల నుంచి ప్రేమలో ఉన్నారంటూ గాసిప్స్‌ వస్తున్నాయి. ఇక పూజా హెగ్డే, సదరు స్టార్‌ క్రికెటర్‌ ఇద్దరూ.. తరచుగా సోషల్ మీడియా వేదికగా ఒకరిపై మరొకరు కామెంట్స్ చేసుకుంటూ ఉంటారు. అంతేకాదు గతంలో వీరిద్దరూ ముంబయిలోని ఓ ప్రయివేటు పార్టీకి కలిసి రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

ఇక వీరిద్దరూ ఎప్పటి న ఉంచో లవ్‌లో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతుంది. మరి ఇంతకు ఆ స్టార్‌క్రికెటర్‌ ఎవరు.. నిజంగానే బుట్ట బొమ్మ పెళ్లి పీటలు ఎక్కబోతుందా లేదా అన్నది తెలియాంటే.. ఈ వార్తలపై ఆమె స్పందించాలి.. లేదంటే అధికారిక ప్రకటన అయినా వెలువడాలి.

Jojobet GirişbetparkGrandpashabetgrandpashabetHoliganbetCasibomHoliganbetHoliganbetcasibomjojobet günceldeneme bonusu veren sitelerMadridbetMadridbetMadridbetJojobetjojobetJojobetjojobetjojobetgrandpashabetcasibomcasibomcasibomcasibomcasibom girişholiganbetjojobetbetciojojobetcasibomJojobetbetcio