iDreamPost

ఎన్నికల వేళ.. తెలంగాణలో రూ.11 కోట్లు పట్టివేత!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు భారీగా డబ్బు సరఫరా చేస్తున్నారు. పోలీసుల తనిఖీలులో నోట్ల కట్టలు బయట పడుతున్నాయి. తాజాగా రూ.11 కోట్లు పోలీస్ అధికారులకు పట్టుబడ్డాయి.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు భారీగా డబ్బు సరఫరా చేస్తున్నారు. పోలీసుల తనిఖీలులో నోట్ల కట్టలు బయట పడుతున్నాయి. తాజాగా రూ.11 కోట్లు పోలీస్ అధికారులకు పట్టుబడ్డాయి.

ఎన్నికల వేళ.. తెలంగాణలో రూ.11 కోట్లు పట్టివేత!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు క్లైమాక్స్ కు చేరింది. మరో మూడు రోజుల్లోనే పోలింగ్ జరగనుంది. అంతేకాక రేపటితో ఎన్నికల ప్రచారాన్నికి గడువు ముగియనుండటంతో అన్నీ పార్టీల నేతలు సభలు, రోడ్ షోలతో స్పీడ్ పెంచారు. కాలంతో పరుగెడుతూ ఎన్నికల రణరంగంలో కుస్తీ పడుతున్నారు. బిజీ షెడ్యూల్ తో అభ్యర్థులకు  గత నెల రోజుల నుంచి కంటినిండ నిద్ర కరువైంది. గెలుపే లక్ష్యంగా నేతలు డబ్బులను భారీగా  ఖర్చు చేస్తున్నారు. అంతేకాక భారీ స్థాయిలో సమకూర్చుతున్నారు. పోలీసులు తనిఖీల్లో భారీగా నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. ఇప్పటికే పెద్ద మొత్తం డబ్బులు పట్టుబడగా.. తాజాగా ఖమ్మం, పెద్దపల్లి జిల్లాలో రూ.11 కోట్లు పోలీసులకు దొరికాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

తెలంగాణలో పోలింగ్  సమయం దగ్గర పడుతుంది. దీంతో కొందరు నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు సిద్ధమవుతున్నారు. బహుమతులు, నగదు ఇచ్చేందుకు భారీ సొమ్మును రవాణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలు చోట్ల పోలీసుల తనిఖీల్లో పట్టుబడుతున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లాలో రెండు చోట్ల భారీగా డబ్బులు పట్టుబడ్డాయి.  జిల్లా ముత్తగూడెంలో రూ.6 కోట్ల నగదును అధికారులు పట్టుకున్నారు. పాలేరులో  చేపట్టిన తనిఖీల్లో రూ.3.5 కోట్ల డబ్బులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐటీ, ఈసీ  ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పలు చోట్ల తనిఖీలు చేపట్టి నగదను స్వాధీనం చేసుకుంటున్నారు.

అలానే పెద్దపల్లి జిల్లా రామగుండంలో రూ.2.18 కోట్లను ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్టీపీసీ కృష్ణానగర్ లో ఓ పార్టీకి సంబంధిత ప్రచార కార్యాలయంలోనిల్వ ఉంచిన ఈ నగదును ఎస్ఎస్టీ, ఎలక్షన్స్ స్క్వాడ్ సీజ్ చేసింది. పట్టుబడిన నగదు రామగుండం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి చెందిన నగదుగా అనుమానిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు వాహనాల తనిఖీ ముమ్మరం చేస్తున్నారు. ఎన్నికల్లో డబ్బులు పంపిణఈ కాకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించడంతో పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి.. తనిఖీలు చేస్తున్నారు.

అనుమానం కలిగిన ప్రతి వాహనాన్ని పోలీసులు క్షుణంగా పరిశీలిస్తున్నారు. బైక్ లను కూడా వదలకుండా పోలీసులు ఇరవై నాలుగు గంటలు తనిఖీలు చేస్తూ.. నగదను సీజ్ చేస్తున్నారు. ఇప్పటికే కోట్లాది రూపాయలను వివిధ వాహనాల నుంచి పోలీసులు స్వాధీనం చేస్తుకున్నారు. పోలింగ్ మూడు రోజులే ఉండటంతో నగదు భారీగా రవాణ జరగొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తనిఖీలను మరింత ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే ఖమ్మం, పెద్దపల్లి జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది. మరి.. ఎన్నికల వేళ ఇలా భారీగా డబ్బులు దొరుకుతుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి