iDreamPost

రూ. కోటి 11 లక్షలు పలికిన పానకం.. తొలిసారి రికార్డ్ బ్రేక్!

రూ. కోటి 11 లక్షలు పలికిన పానకం.. తొలిసారి రికార్డ్ బ్రేక్!

చాలా మంది పానకాన్ని ఇష్ట పడతారు. అందుకే శ్రీరామ నవమి వంటి పండగల సమయాల్లో పానకాన్ని భక్తులకు అందిస్తుంటారు. అంతేకాక మరికొన్ని ప్రాంతాల్లో పానకాన్నే స్వామివారి ప్రసాదం భక్తులకు అందిస్తుంటారు. అయితే చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే పానకాన్ని వేలం వేస్తుంటారు. తాజాగా ఓ పానకం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. వేలంలో ఆ పానకం ఏకంగా రికార్డు స్థాయిలో రూ.కోటి 11 లక్షలు పలికింది. ఈ అరుదైన రికార్డుకు గుంటూరు జిల్లా మంగళగిరి లక్ష్మీ నరసింహాస్వామి దేవాయలం వేదికైంది. మరి.. అసలు పానకం రూ.కోటి 11 లక్షలు కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

గుంటూరు జిల్లా మంగళగిరిలో శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి కొలువై ఉన్నారు. ఈ స్వామిని పానకాల స్వామిగా కూడా పిలుస్తుంటారు. ఇక్కడ స్వామి వారిని దర్శించుకునేందుకు దూర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ దేవాలయంలో నరసింహస్వామి మంగళాద్రిగా, లక్ష్మీ నరసింహ స్వామిగా, పానకాల స్వామిగా కొలువై ఉన్నారు. అందుకే ఈ ప్రాంతాన్నికి మంగళగిరి అని పేరు వచ్చింది. భక్తులు ఇక్కడ స్వామివారి దగ్గర కోరికలు కోరుకుని.. పానకాన్ని మొక్కులుగా చెల్లిస్తుంటారు. అందుకే లక్ష్మీ నరసింహా స్వామిని పానకాల స్వామిగా కూడా పిలుస్తుంటారు.

ఇక్కడ ఎంత పానకం  సమర్పిస్తే అందులో సగం వెనక్కు వస్తుందని భక్తుల బలంగా నమ్ముతున్నారు.  అందుకే ఇక్కడ పానకం సమర్పించడం అనవాయితీగా వస్తోంది. అందుకే ఆలయంలో ప్రతి ఏటా ఆలయంలో పానకం తయారు చేసి విక్రయించేందుకు ఏటా వేలం పాట నిర్వహిస్తారు. వేలంలో అవకాశం దక్కించుకున్న వాళ్లు ఏడాది పాటూ ఆలయంలో పానకం విక్రయించాలి. ఇటీవల కాలంలో ఈ దేవాలయంలో భక్తుల రద్దీ బాగా పెరిగింది. దీంతో ఆలయంలో పానక తయారీకి సంబంధించిన వేలం పాటకు కూడా డిమాండ్ పెరిగింది. పానకం వేలంపాట దక్కించుకునేందుకు పెద్ద సంఖ్యలో పోటీ పడుతుంటారు.

ఈ ఏడాది కూడా పానకానికి సంబంధించిన వేలం నిర్వహించగా.. రూ.కోటి 11 లక్షల 69 వేలకు పాలడుగు నాగలక్ష్మి దక్కించుకున్నారు. మొదట బహిరంగ వేలం నిర్వహించగా మహేష్ అనే పాటదారుడు 99.70 లక్షలు పాడాడు. ఆ తర్వాత సీల్డ్ కవర్ టెండర్స్ ఓపెన్ చేయగా శ్యామ్ అనే వ్యక్తి కోటి 10 లక్షలు కోట్ చేశాడు. మరో టెండర్స్ ఓపెన్ చేయగా నాగలక్ష్మి రూ. కోటి 11 లక్షల 69 వేలకు కోట్ చేశారు. దీంతో ఆమెకే పానకం పాటను అధికారులు ఫైనల్ చేసినట్లు ప్రకటించారు. ఇది ఆలయ చరిత్రలోనే రికార్డు ధర అంటూ భక్తులు అంటున్నారు. మరి.. వేలంలో పానకం భారీ ధర పలకడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి