iDreamPost

RRR Promotions : పరుగులు పెడుతున్న చరణ్ తారక్

RRR Promotions : పరుగులు పెడుతున్న చరణ్ తారక్

పాన్ ఇండియా లెవెల్ లో ప్రమోషన్ చేయడం అంటే ఏమిటో రాజమౌళి ప్రత్యక్షంగా నిరూపిస్తున్నారు. గత నాలుగైదు రోజులుగా రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లతో సహా ముంబైలోనే మకాం వేసిన జక్కన్న బృందం ఒక్క క్షణం తీరిక లేకుండా పబ్లిసిటీ కార్యక్రమాలు చేస్తూనే ఉంది. పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు, చిట్ చాట్ లు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న ఇద్దరు హీరోలను ఏకంగా ప్రో కబడ్డీకి యాంకర్లను చేయడం వేరే లెవెల్ తెలివిగా చెప్పుకోవచ్చు. హిందీ కన్నడ తమిళ మలయాళం భాషల్లో మాట్లాడుతూ చరణ్ తారక్ లు ఆకట్టుకుంటున్న తీరు మాములుగా లేదు. సోషల్ మీడియాలో వీటి తాలూకు క్లిప్పులు వైరల్ అవుతున్నాయి.

ముంబై ఈవెంట్ ఇంకా టీవీ టెలికాస్ట్ జరగలేదు. న్యూ ఇయర్ గిఫ్ట్ గా ప్రసారం చేస్తారు. కేరళలో మరో భారీ వేడుకకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. చెన్నైలో చేశాక ఫైనల్ గా హైదరాబాద్ లో నెవెర్ బిఫోర్ తరహాలో మరో ఈవెంట్ ని ప్లాన్ చేసుకున్నారు. దీనికి చిరంజీవి బాలకృష్ణ అతిథులుగా వస్తారనే ప్రచారం ఉంది కానీ నిజామా కాదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. వాళ్ళు కాకపోయినా భారీ సెలబ్రిటీలను తీసుకురావడం మాత్రం ఖాయమే. వేదిక ఎక్కడనేది బయటికి చెప్పడం లేదు. జనవరి 7కి ఇంకా పధ్నాలుగు రోజులు మాత్రమే ఉన్న తరుణంలో రాజమౌళి టీమ్ కాళ్లకు చక్రాలు పెట్టుకుని పరుగులు పెడుతున్నారు. ఇది ఆగేది కాదు.

చరణ్ తారక్ ఇద్దరి మధ్య బాండింగ్ ఏ స్థాయిలో ఉందో చూపించేందుకు కూడా ఈ ప్రోగ్రాంస్ ని వాడుకుంటున్నారు. రాధే శ్యామ్ తో పోటీ ఉన్న నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ ఏ చిన్న అవకాశాన్ని వదలడం లేదు. తెలుగు రాష్ట్రాల వరకు ఎలాంటి ఇబ్బందీ లేదు కానీ నార్త్ లో భారీ ఓపెనింగ్స్ తో పాటు లాంగ్ రన్ రావాలంటే మాత్రం జనంలోకి సినిమాను బలంగా తీసుకెళ్లాలి. అందుకు జక్కన్న ఎంత చేయాలో అంతకన్నా ఎక్కువే చేస్తున్నారు. మొదటి రోజు పాజిటివ్ టాక్ వస్తే చాలు వసూళ్లకు ఆకాశమే హద్దవుతుంది. ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ పోషిస్తున్న భీమ్ క్యారెక్టర్ తాలూకు అప్ డేట్ ని ఇవాళ ఇస్తున్నారు. ఒకవైపు ఓమిక్రాన్ కేసులు మెల్లగా పెరుగుతున్న తరుణంలో సంక్రాంతి వరకు ఎలాంటి ముప్పు రాకూడదని మూవీ లవర్స్ కోరుకుంటున్నారు.లేదంటే ఆర్ఆర్ఆర్ కే కాదు ఇండస్ట్రీకే దెబ్బ

Also Read : Mahesh Babu In Unstoppable Finale : దీనికీ మహేష్ బాబుతోనే శుభం కార్డు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి