iDreamPost

Ram Charan on NTR in RRR బాలీవుడ్ మీడియాకు రామ్ చ‌ర‌ణ్ భలే జవాబు

Ram Charan on NTR in RRR బాలీవుడ్ మీడియాకు రామ్ చ‌ర‌ణ్ భలే జవాబు

RRR Rs 1000 Crore Success Bash నిన్న ముంబై వేదికగా జరిగిన ఆర్ఆర్ఆర్ 1000 కోట్ల వసూళ్ల సక్సెస్ మీట్ గ్రాండ్ గా ముగిసింది. అమీర్ ఖాన్, జావేద్ అఖ్తర్, కరన్ జోహార్ లాంటి ప్రముఖులు ముఖ్య అతిథులుగా విచ్చేయగా పెన్ స్టూడియోస్ అధినేత జయంతి లాల్ గడ్డా దేశవ్యాప్తంగా మీడియాని ఆహ్వానించి తన ఆనందాన్ని పంచుకున్నారు. ప్రమోషన్లలో విస్తృతంగా కలిసి తిరిగిన Jr.NTR, Ram charanలు సుమారు నెల రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ ఒకే స్టేజి మీద కనిపించారు. తెలుగులో ఇలాంటి వేడుకలు చేసే సూచనలు కనిపించడం లేదు కానీ నార్త్ లో ఆర్ఆర్ఆర్ దూసుకుపోతున్న తరుణంలో కలెక్షన్లు డ్రాప్ కాకుండా కంటిన్యూగా ఇలాంటి ప్రోగ్రాంస్ చేస్తూనే ఉన్నారు.

ఇందులో భాగంగా జరిగిన మీడియా ఇంటరాక్షన్ లో ఓ బాలీవుడ్ జర్నలిస్ట్ చరణ్ ని ఉద్దేశించి అడుగుతూ సినిమా క్రెడిట్స్ లో అధిక శాతం మీకే దక్కడం పట్ల మీ స్పందన ఏంటని ఇరకాటంలో పెట్టేసింది. నిజానికిది ఇబ్బందికరమైన ప్రశ్న. అసలే సోషల్ మీడియాలో తారక్ ఫ్యాన్స్ తమ హీరో పాత్రకు సెకండ్ హాఫ్ లో దక్కిన ప్రాధాన్యం పట్ల కొంత అసంతృప్తిగా ఉన్నారు. ఇంటర్వెల్ బ్లాక్, కొమరం భీముడో పాట మొత్తం యంగ్ టైగర్ డామినేషనే అయినప్పటికీ హిందీ వెర్షన్ లో చరణ్ వేసిన అల్లూరి గెటప్ శ్రీరాముడిలా కనిపించి అక్కడి వాళ్లకు విపరీతంగా కనెక్ట్ అయిపోవడంతో ఇబ్బంది వచ్చి పడింది. అందుకే క్వశ్చనే రాంగనే తరహాలో కామెంట్స్ వచ్చాయి.

అయితే చరణ్ మెచ్యూర్డ్ గా బదులు చెబుతూ ఆర్ఆర్ఆర్ చేయడం వల్ల ఈ కలెక్షన్లు పేర్ల కన్నా ఎక్కువగా తారక్ తో మరింత బలమైన స్నేహం దొరికిందని అంతకంటే రాజమౌళికి థాంక్స్ చెప్పడానికి మరో కారణం అక్కర్లేదని క్లారిటీ ఇచ్చేశాడు. అనవసరమైన చర్చకు తావివ్వకుండా ఇద్దరం ఎంత కష్టపడ్డామో హైలైట్ చేసే ప్రయత్నం చేశాడు. సదరు ఛానల్ ప్రతినిధి ఉద్దేశపూర్వకంగా అడిగినా లేక సహజంగా అడిగినా సోషల్ మీడియాలో మాత్రం ఈ వీడియో వైరల్ అయ్యింది. ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ఏవేవో అనేసుకుంటున్నారు కానీ చరణ్ తారక్ ల బాండింగ్ ఏ స్థాయిలో ఉందో మరోసారి ఈ ఘటన ద్వారా ఋజువయ్యింది

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి