iDreamPost

RRR వాయిదా – ఎందరికో వరం

RRR వాయిదా – ఎందరికో వరం

నారప్పతో నేరుగా ఇంటికే వచ్చి పలకరించిన వెంకటేష్ తర్వాతి సినిమా దృశ్యం 2 కూడా ఓటిటిలోనే వచ్చేలా గతంలో డీల్ జరిగిందన్న మాట వాస్తవం. చర్చలైతే సీరియస్ గా జరిగాయి కానీ నిజంగా ఒప్పందం జరిగిందా లేదా అనేది బయటికి రాలేదు. కేవలం 45 రోజుల్లో చాలా తక్కువ బడ్జెట్ లో ఒరిజినల్ వెర్షన్ తీసిన జీతూ జోసెఫ్ దర్శకుడిగా రూపొందిన ఈ ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్ ఫస్ట్ కాపీ ఎప్పుడో సిద్ధమయ్యింది. విక్టరీ ఫ్యాన్స్ రెండు నెలల నుంచి వెయిట్ చేస్తున్నారు కానీ రిలీజ్ కు సంబంధించి ఎలాంటి అప్ డేట్ నిర్మాణ భాగస్వామి అయిన సురేష్ బాబు నుంచి రావడం లేదు. ఎట్టకేలకు ఒక నిర్ణయానికి వచ్చినట్టు ఇన్ సైడ్ టాక్.

ఇప్పుడు దృశ్యం 2ని థియేటర్లలోనే తీసుకువచ్చేలా ప్లానింగ్ మారిందని లేటెస్ట్ అప్ డేట్. అక్టోబర్ 13కి విడుదల చేసేలా ఆలోచిస్తున్నారట. ఇప్పటికి సినిమా హాళ్ల పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ వచ్చే దసరాకంతా నార్మల్ అవుతుందనే అంచనాలో పరిశ్రమ ఉంది. ఆ టైంకంతా ఏపిలోనూ వంద శాతం ఆక్యుపెన్సీతో పాటు సెకండ్ షో పర్మిషన్లు వచ్చేసి ఉంటాయి కాబట్టి కలెక్షన్ల పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చనే అంచనాలో ఉన్నారు. అదే సమయంలో మహా సముద్రం ఉన్నప్పటికి అది పూర్తిగా విభిన్నమైన జానర్ కావడంతో పోటీ ఉండదని భావించి ఈ రకంగా పెద్దతెరపై సినిమా చూపించాలనుకుంటున్నారట.

దృశ్యం 2 ఇప్పటికే సబ్ టైటిల్స్ సహాయంతో మన ప్రేక్షకులు బాగానే చూశారు. కాకపోతే సాధారణ జనానికి ఈ ఓటిటి వ్యవహారాలు, సబ్ టైటిల్స్ చదువుకుంటూ మళయాలం సినిమాలు చూసే అలవాటు ఉండదు కాబట్టి అంచనాలు బాగానే ఉంటాయి. అయితే ఎప్పుడో ఏడేళ్ల క్రితం వచ్చిన దృశ్యంకి కొనసాగింపు అంటే జనంలో అంత ఎగ్జైట్మెంట్ ఉంటుందా అంటే ఏమో చెప్పలేం. ప్రమోషన్లను సరిగ్గా చేసుకోగలిగితే ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసి థియేటర్లకు రప్పించవచ్చు. మరి ఓటిటిని కొన్న హాట్ స్టార్ డీల్ ని క్యాన్సిల్ చేసుకుందా లేక ఇంకేమైనా మార్పులు జరిగాయా అనేది ఇంకొద్దిరోజులు ఆగితే క్లారిటీ వస్తుంది

Also Read : మాస్ట్రో ఆ నమ్మకాన్ని నిలబెడుతుందా

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి