iDreamPost

RRR Overseas : ఓవర్సీస్ లో ట్రిపులార్ సందడి షురూ

RRR Overseas : ఓవర్సీస్ లో ట్రిపులార్ సందడి షురూ

సరిగ్గా ఇరవై రోజుల్లో ఆర్ఆర్ఆర్ విడుదల కానుంది. ఈసారి ఎలాంటి వాయిదాలకు ఛాన్స్ లేదు. కరోనా పూర్తిగా తగ్గిపోయినట్టే. మాస్కులు లేకపోయినా ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. మాల్స్, థియేటర్స్, షాపింగ్స్ ఎక్కడ చూసినా  జనం రద్దీతో కిటకిటలాడుతున్నాయి. భీమ్లా నాయక్ కు 90 కోట్లు ఊరికే రాలేదు. ఆడియన్స్ పోటెత్తారు  కాబట్టే ఆ వసూళ్లు సాధ్యమయ్యాయి. నెక్స్ట్ రాధే శ్యామ్ కు వచ్చే స్పందన ఎలా ఉంటుందోనని ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. యుఎస్ అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా జరుగుతున్నాయి. ప్రీ సేల్స్ ఎన్ని మిలియన్లు టచ్ అవుతుందోనని అభిమానులు ఎగ్జైటిమెంట్ తో వెయిట్ చేస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ కు విదేశాల్లో నెల ముందు గానే ఓపెన్ చేసిన టికెట్ల అమ్మకాలు మంచి ఫలితాన్ని ఇస్తున్నాయి. చాలా చోట్ల జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఫ్యాన్స్ బల్క్ గా బుక్ చేసుకుని వాటి ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. యుకె, యూరోప్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో కూడా ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. రిలీజ్ దగ్గర పడే కొద్దీ హైప్ ఎలాగూ పెరిగిపోతుంది కాబట్టి అప్పుడు ఫిగర్స్ ఇంకా భారీగా ఉంటాయని విశ్లేషకుల అంచనా. మూడేళ్ళ తర్వాత గ్యాప్ తీసుకుని వచ్చిన తారక్ చరణ్ సినిమా కావడంతో ఆన్లైన్ లోనే ఈ స్థాయిలో కలెక్షన్ల ప్రవాహమే మొదలయ్యింది. పాన్ ఇండియా కనక హిందీ తమిళ వెర్షన్లు కూడా త్వరలో యాడ్ చేయబోతున్నారు.

ఎక్కడో పరిస్థితి అలా ఉంటే ఇక తెలుగు రాష్ట్రాల్లో చెప్పదేముంది. 11న వచ్చే రాధే శ్యామ్ సందడి అయ్యాక రాజమౌళి భారీ ఎత్తున ప్రమోషన్లు ప్లాన్ చేస్తున్నారు. దుబాయ్ ఈవెంట్ ఉండే అవకాశం లేకపోలేదు. డిస్ట్రిబ్యూటర్లు స్క్రీన్ల పంపకాల్లో బిజీగా ఉన్నారు. టికెట్ రేట్లు, అదనపు షోల వ్యవహారం ఏపిలో ఇంకా తేలనప్పటికీ దాదాపుగా అన్ని చోట్లా అన్ని స్క్రీన్లలో ఆర్ఆర్ఆర్ వేసేలా ప్లానింగ్ జరుగుతోంది. టికెట్ల కోసం ఒత్తిడి అప్పుడే మొదలయ్యిందట. అభిమాన సంఘాలు ముందస్తుగా థియేటర్ల యజమానులుతో మంతనాలు జరుపుతున్నారు. టికెట్ల కోసం ఏకంగా రాజకీయ ఒత్తిడులు వచ్చినా ఆశ్చర్యం లేదు

Also Read : Bheemla Nayak OTT : స్మార్ట్ స్క్రీన్ వచ్చేందుకు నాయక్ రెడీ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి