iDreamPost

RRR 3 Days Collections : బాక్సాఫీస్ వద్ద రామ్ భీమ్ వసూళ్ల ప్రభంజనం

నార్త్ లో మొదటి రోజు అడ్వాన్ బుకింగ్స్ కొంత వీక్ గా ఉన్నప్పటికీ అనూహ్యంగా రెండో రోజు నుంచే పుంజుకుని అక్కడా రికార్డుల వేట మొదలయ్యింది. నిన్న ఒక్క రోజే ఉత్తరాది రాష్ట్రాల్లో 30 కోట్లు వసూలు చేయడమంటే మాటలు కాదు.

నార్త్ లో మొదటి రోజు అడ్వాన్ బుకింగ్స్ కొంత వీక్ గా ఉన్నప్పటికీ అనూహ్యంగా రెండో రోజు నుంచే పుంజుకుని అక్కడా రికార్డుల వేట మొదలయ్యింది. నిన్న ఒక్క రోజే ఉత్తరాది రాష్ట్రాల్లో 30 కోట్లు వసూలు చేయడమంటే మాటలు కాదు.

RRR 3 Days Collections : బాక్సాఫీస్ వద్ద రామ్ భీమ్ వసూళ్ల ప్రభంజనం

తన పన్నెండో సినిమాను బ్లాక్ బస్టర్ చేయడం ద్వారా రాజమౌళి నాలుగో హ్యాట్రిక్ ని విజయవంతంగా పూర్తి చేశారు. దేశవ్యాప్తంగా భారీ వసూళ్లతో థియేటర్లు కళకళలాడుతున్నాయి. నార్త్ లో మొదటి రోజు అడ్వాన్ బుకింగ్స్ కొంత వీక్ గా ఉన్నప్పటికీ అనూహ్యంగా రెండో రోజు నుంచే పుంజుకుని అక్కడా రికార్డుల వేట మొదలయ్యింది. నిన్న ఒక్క రోజే ఉత్తరాది రాష్ట్రాల్లో 30 కోట్లు వసూలు చేయడమంటే మాటలు కాదు. కర్ణాటకలో ఉన్న ప్రతికూల పరిస్థితులను తట్టుకుని మరీ ఆర్ఆర్ఆర్ అక్కడ 19 కోట్లకు పైగా రాబట్టడం మరో సంచలనం. తమిళనాడులో ప్రధాన కేంద్రాల్లో విపరీతమైన రద్దీలు నమోదవుతున్నాయి. 16 కోట్ల దాకా వచ్చింది.

ఇక తెలుగు రాష్ట్రాల వరకు చూస్తే కేవలం మూడు రోజులకే 80 కోట్ల షేర్ కొల్లగొట్టడం డిస్ట్రిబ్యూటర్లకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. పెరిగిన టికెట్ రేట్ల పట్ల ఆందోళన వ్యక్తమైనా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. తెలంగాణలో మరో ఏడు రోజుల పాటు పెంచిన ధరల మీద 50 రూపాయలు తగ్గించి అమ్ముతున్నారు. పదకొండో రోజు నుంచి నార్మల్ రేట్స్ ఉంటాయి. సో మేజిక్ ఫిగర్ అసాధ్యమేమీ కాదు. మల్టీ ప్లెక్సులు జనంతో నిండుగా కనిపిస్తున్నాయి. దగ్గరలో పోటీ సినిమా ఏదీ లేకపోవడం ఆర్ఆర్ఆర్ కు కలిసొచ్చే అంశం. ఏప్రిల్ మొదటివారంలో తెలుగు మిషన్ ఇంపాజిబుల్, హిందీ ఎటాక్ లు రేస్ లో ఉన్నాయి. ముందు ఏరియాల వారీగా లెక్కలు చూద్దాం

నైజామ్ – 53 కోట్ల 44 లక్షలు
సీడెడ్ – 28 కోట్ల 90 లక్షలు
ఉత్తరాంధ్ర – 15 కోట్ల 50 లక్షలు
ఈస్ట్ గోదావరి – 8 కోట్ల 65 లక్షలు
వెస్ట్ గోదావరి – 7 కోట్ల 97 లక్షలు
గుంటూరు – 11 కోట్ల 47 లక్షలు
కృష్ణా – 8 కోట్లు
నెల్లూరు – 4 కోట్ల 81 లక్షలు

ఏపి/తెలంగాణ మూడు రోజుల షేర్ – 138 కోట్ల 74 లక్షలు

తమిళనాడు – 16 కోట్ల 17 లక్షలు
కేరళ – 5 కోట్ల 7 లక్షలు
కర్ణాటక – 18 కోట్ల 47 లక్షలు
హిందీ – 36 కోట్ల 50 లక్షలు
ఓవర్సీస్ – 56 కోట్ల 20 లక్షలు
ఇతర దేశాలు – 4 కోట్ల 65 లక్షలు

ప్రపంచవ్యాప్తంగా మొత్తం 3 రోజుల షేర్ – 275 కోట్ల 80 లక్షలు

ఇవాళ సోమవారం నుంచి అసలైన వీకెండ్ టెస్ట్ మొదలువుతుంది. దానికి రాజమౌళి బృందం టెన్షన్ పడటం లేదు. ఎందుకంటే బుకింగ్స్ తాకిడి ఏ మాత్రం తగ్గలేదు. నూన్ షోల నుంచే మంచి ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. తెల్లవారుఝామున వేసిన 6 నుంచి 7 గంటల మధ్య షోలకు మాత్రమే రెస్పాన్స్ తక్కువగా ఉంది. మధ్యాన్నంతో మొదలుపెట్టి సెకండ్ షోల దాకా ట్రెండ్ అయితే జోరుగా సాగుతోంది. బ్రేక్ ఈవెన్ చేరుకోవాలంటే 500 కోట్లు దాటాల్సిన ఆర్ఆర్ఆర్ ఇప్పుడు 60 శాతానికి దగ్గరగా రికవరీ చేసుకుంది. ఏప్రిల్ 14న కెజిఎఫ్ 2 వచ్చేదాకా ఏ అడ్డు లేదు. పైగా మధ్యలో ఉగాది పండగ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి పూర్తిగా వాడేసుకుంటుంది

Also Read : KGF Chapter 2 : కెజిఎఫ్ 2కు ఎదురవుతున్న సవాళ్లు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి