iDreamPost

RRR 2nd Day Collections : రెండో రోజూ అదే జోరు కొనసాగించిన ట్రిపులార్

RRR 2nd Day Collections : రెండో రోజూ అదే జోరు కొనసాగించిన ట్రిపులార్

ఊహించిన దానికన్నా ఆర్ఆర్ఆర్ కలెక్షన్లు మతులు పోగొట్టే ఫిగర్స్ తో బాక్సాఫీస్ వద్ద సంచలనాలు నమోదు చేస్తున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో మొదటి రోజు డల్ గా ఉన్న నార్త్ మార్కెట్లు అనూహ్యంగా పుంజుకున్నాయి. తమిళనాడు, కేరళలో హౌస్ ఫుల్స్ స్టార్ట్ అయ్యాయి. పరిమిత విడుదల కారణంగా కర్ణాటకలో మాత్రమే ట్రిపులార్ కొంత ఇబ్బందులు పడుతోంది. కన్నడ వెర్షన్ కు చాలా తక్కువ స్క్రీన్లు ఇవ్వడం ప్రభావం చూపిస్తోంది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 223 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ విజువల్ గ్రాండియర్ రెండో రోజు కూడా దీనికి ఏ మాత్రం తీసిపోని రీతిలో మరో సెంచరీని క్రాస్ చేసినట్టు టాక్. అఫీషియల్ ఫిగర్స్ ఇంకా రావాలి.

ప్రాధమికంగా అందుతున్న సమాచారం మేరకు ఉత్తరాది రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ పికప్ వేగంగా ఉంది. భువనేశ్వర్ లాంటి నగరాల్లో తెల్లవారుఝామునే టికెట్ల కోసం ఆడియన్స్ బారులు తీరుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. నేపాల్ లోనూ అనూహ్యంగా రద్దీ పెరిగింది. ఇక ఏపి తెలంగాణ సరేసరి. రెండు రోజులకే ఆల వైకుంఠపురములో స్మాష్ అయిపోయింది. వారం దాటేలోగా బాహుబలి 2 కంప్లీట్ గా ఓవర్ టేక్ చేసేస్తుంది. అంచనాలకు మించి ఆర్ఆర్ఆర్ పరుగులు పెడుతోంది. రివ్యూస్, టాక్ ఎలా ఉన్నా వాటితో నిమిత్తం లేకుండా తారక్ చరణ్ ల కోసం జనం థియేటర్లకు వెళ్తున్నారు. హైదరాబాద్ లో టికెట్ రేట్ల పెంపు ఎలాంటి ప్రభావం చూపించలేదు.

నైజామ్ లో రెండో రోజు 15 కోట్లకు పైగా రావడం కొత్త రికార్డు. హిందీ వెర్షన్ ఒకటే చూసుకుంటే ఇండియా వైడ్ ఫస్ట్ డే 20 కోట్లు రాగా నిన్న 25 కోట్ల దాకా వచ్చి ఉండొచ్చని అంటున్నారు. ఇక దగ్గర్లో ఈ ఫిగర్స్ ని అందుకోవడం అంత సులభంగా ఉండదు. విపరీతంగా పెంచేసిన టికెట్ రేట్లు ఈ ఫిగర్స్ రావడానికి కారణమే కానీ అంత ఖర్చు పెట్టడం ఈ విజువల్ గ్రాండియర్ కి కరెక్టేనని అభిమానులు ఫీల్ కావడం ప్లస్ అవుతోంది. 500 కోట్లకు పైగా షేర్ ని బ్రేక్ ఈవెన్ గా పెట్టుకున్న ఆర్ఆర్ఆర్ కి మళ్ళీ కెజిఎఫ్ 2 వచ్చేదాకా చెప్పుకునే పోటీ ఏదీ లేదు. పైగా పది రోజుల తర్వాత టికెట్ రేట్లు తగ్గుతాయి కానీ సామాన్య ప్రేక్షకులు పెరిగే ఛాన్స్ ఉంది

Also Read : RRR : రాజమౌళి 6 ప్యాక్ సక్సెస్ ఫార్ములా ఇదే

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి