iDreamPost

Rohit Sharma: ముంబై కెప్టెన్సీ కాంట్రవర్సీపై డివిలియర్స్ షాకింగ్ కామెంట్స్.. తప్పు కాదంటూ..?

  • Published Dec 17, 2023 | 12:29 PMUpdated Dec 17, 2023 | 12:29 PM

ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పుపై అన్ని వైపుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో దీని మీద సీనియర్ క్రికెటర్లు స్పందిస్తున్నారు. తాజాగా ఈ కాంట్రవర్సీపై సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ రియాక్ట్ అయ్యాడు.

ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పుపై అన్ని వైపుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో దీని మీద సీనియర్ క్రికెటర్లు స్పందిస్తున్నారు. తాజాగా ఈ కాంట్రవర్సీపై సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ రియాక్ట్ అయ్యాడు.

  • Published Dec 17, 2023 | 12:29 PMUpdated Dec 17, 2023 | 12:29 PM
Rohit Sharma: ముంబై కెప్టెన్సీ కాంట్రవర్సీపై డివిలియర్స్ షాకింగ్ కామెంట్స్.. తప్పు కాదంటూ..?

ఐపీఎల్​-2024 ఆక్షన్​కు ముందు ముంబై ఇండియన్స్ బాంబు పేల్చింది. తమ జట్టు కెప్టెన్సీ విషయంలో మార్పులు చేస్తున్నామని తెలిపింది. గత కెప్టెప్ రోహిత్ శర్మ నుంచి సారథ్య బాధ్యతలను హార్దిక్ పాండ్యాకు బదిలీ చేస్తున్నామని చెప్పింది. అయితే ముంబై ప్రకటనపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అటు అభిమానులతో పాటు ఇటు మాజీ క్రికెటర్లు, క్రికెట్ అనలిస్టులు కూడా రోహిత్ విషయంలో ఎంఐ వ్యవహరించిన తీరును తప్పుబడుతున్నారు. ఈ కాంట్రవర్సీ కారణంగా సోషల్ మీడియాలో ముంబై తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. లక్షలాది మంది ఫాలోవర్లు ఆ టీమ్​ను అన్​ఫాలో చేస్తున్నారు. సొంత ఆటగాళ్లైన జస్​ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ కూడా ఈ డెసిజన్​పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ కాంట్రవర్సీ మీద సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

ముంబై ఇండియన్స్ తీసుకున్న నిర్ణయం తప్పేమీ కాదన్నాడు డివిలియర్స్. ఆ ఫ్రాంచైజీకి ఇదో కొత్త ఆరంభమని అన్నాడు. అయితే చాలా మంది ఈ డెసిజన్​ను పర్సనల్​గా తీసుకుంటుండటం, హార్దిక్ ప్యాండ్యా మీద నెగిటివ్ రియాక్షన్ రావడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందన్నాడు. గత కొన్నేళ్లలో కెప్టెన్​గా రోహిత్ శర్మ చాలా సక్సెస్ చూశాడని.. టీమ్​కు ఎన్నో ట్రోఫీలను అందించాడని మెచ్చుకున్నాడు డివిలియర్స్. ఇదే టైమ్​లో టీమిండియాకూ కెప్టెన్​గా వ్యవహరించడంతో అతడి మీద తీవ్ర ఒత్తిడి పడిందన్నాడు. ఇప్పుడు ఆ భారం పోయింది కాబట్టి రిలాక్స్ అయి ఎంజాయ్ చేస్తూ తన న్యాచురల్ గేమ్​ను ఆడేందుకు ఛాన్స్ దొరికిందన్నాడు ఏబీడీ. కెప్టెన్సీ ఇస్తేనే టీమ్​లోకి వస్తానని ముంబైకి హార్దిక్ కండీషన్ పెట్టాడని తాను అనుకోవడం లేదన్నాడు.

మరింత స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసేందుకు, ఫ్రెష్​గా ఉండేందుకు, ప్రెజర్ తగ్గించుకునేందుకే కెప్టెన్సీ నుంచి రోహిత్ తప్పుకొని ఉండొచ్చన్నాడు డివిలియర్స్. కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా మీద వస్తున్న వ్యతిరేకతను అతడు తప్పుబట్టాడు. ఫస్ట్ నుంచి పాండ్యా ముంబైకి చెందినవాడని గుర్తుచేశాడు. కెరీర్ మొదటి నుంచి అదే ఫ్రాంచైజీకి ఆడుతూ వచ్చాడని చెప్పుకొచ్చాడు ఏబీడీ. ఇక, రోహిత్​ను కెప్టెన్సీ నుంచి తప్పించిన ముంబై ఇంకా నిరసనలు ఎదుర్కొంటూనే ఉంది. హిట్​మ్యాన్​ అభిమానులు తమ కోపాన్ని, బాధను, అసంతృప్తిని సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో చూపిస్తున్నారు. కొందరు ఫ్యాన్స్ ముంబై జెర్సీలు, క్యాప్​లు తగలబెడుతున్న ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో డివిలియర్స్ చేసిన వ్యాఖ్యలు ఇంట్రెస్టింగ్​గా మారాయి. అటు ముంబై, హార్దిక్​కు మద్దుతుగా ఉంటూనే.. ఇటు రోహిత్​కూ సపోర్ట్​గా నిలబడ్డాడు ఏబీడీ. మరి.. ముంబై కెప్టెన్సీ కాంట్రవర్సీపై డివిలియర్స్​ రియాక్షన్ మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Rahul Dravid: టీమిండియా హెడ్ కోచ్ గా ద్రవిడ్ కి రెస్ట్.. కొత్త కోచ్ ఎవరంటే?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి