iDreamPost

జైస్వాల్ సూపర్ సెంచరీ వెనుక రోహిత్ శర్మ! ఇది కదా దేశం కోసం ఆలోచించడం అంటే!

  • Published Apr 23, 2024 | 7:44 AMUpdated Apr 23, 2024 | 7:44 AM

Rohit Sharma, Yashasvi Jaiswal: ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ సెంచరీతో కదం తొక్కాడు. అయితే.. జైస్వాల్‌ సెంచరీ వెనుక రోహిత్‌ శర్మ ఉన్నట్లు తెలుస్తోంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

Rohit Sharma, Yashasvi Jaiswal: ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ సెంచరీతో కదం తొక్కాడు. అయితే.. జైస్వాల్‌ సెంచరీ వెనుక రోహిత్‌ శర్మ ఉన్నట్లు తెలుస్తోంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

  • Published Apr 23, 2024 | 7:44 AMUpdated Apr 23, 2024 | 7:44 AM
జైస్వాల్ సూపర్ సెంచరీ వెనుక రోహిత్ శర్మ! ఇది కదా దేశం కోసం ఆలోచించడం అంటే!

రోహిత్‌ శర్మ ప్రస్తుతం ఐపీఎల్‌తో బిజీగా ఉన్నా.. అతని ఫోకస్‌ మొత్తం రాబోయే టీ20 వరల్డ్‌ కప్‌ 2024పైనే ఉన్నట్లు తెలుస్తోంది. ఎలాగో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్సీ భారం లేకపోవడంతో.. ముంబైలో ఉన్నా కూడా దేశం కోసం ఆలోచిస్తున్నాడు రోహిత్‌ శర్మ. టీ20 వరల్డ్ కప్‌ సాధించడమే లక్ష్యంగా ఎలాంటి టీమ్‌తో వెళ్లాలి, టీమ్‌లోకి ఎవర్ని తీసుకోవాలి, టీమ్‌లో ఉండాల్సిన ఆటగాళ్లు ఫామ్‌లో లేకపోతే.. వారిని ఎలా ఫామ్‌లోకి తీసుకురావాలి.. ఇవే ప్రస్తుతం రోహిత్‌ మైండ్‌లో మెదులుతున్నాయి. ఈ క్రమంలోనే టీమిండియా టీ20 టీమ్‌లో ఎంతో కీలకమైన ఆటగాడు యశస్వి జైస్వాల్‌ కొన్ని మ్యాచ్‌ల్లో బాగా ఆడలేక.. ఇబ్బంది పడుతున్నాడు. అలాంటి ప్లేయర్‌ను కూడా ఇప్పుడు రోహిత్‌ శర్మ.. ఫామ్‌లో తెప్పించి ఏకంగా సెంచరీ కొట్టించాడు. అందుకే దటీజ్‌ రోహిత్‌ శర్మ అంటూ క్రికెట్‌ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకీ జైస్వాల్‌ కోసం రోహిత్‌ శర్మ ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం..

జైపూర్‌లోని సవాయ్‌ మాన్‌సింగ్‌ క్రికెట్‌ స్టేడియం వేదికగా సోమవారం రాజస్థాన్‌ రాయల్స్‌, ముంబై ఇండియన్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆర్‌ఆర్‌ యువ ఓపెనర్‌ జైస్వాల్‌ ఏకంగా సెంచరీతో విరుచుకుపడి.. రాజస్థాన్‌కు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. అయితే.. ఈ మ్యాచ్‌ కంటే ముందు జైస్వాల్‌ పెద్దగా ఫామ్‌లో లేడు. పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డాడు. అయితే.. మ్యాచ్‌ ముంబై ఇండియన్స్‌తో కావడంతో.. మ్యాచ్‌ ప్రారంభానికి కంటే ముందు.. ముంబై ఇండియన్స్‌ మాజీ కెప్టెన్‌, టీమిండియా కెప్టెన్‌ అయిన రోహిత్‌ శర్మతో కలిసి జైస్వాల్‌ కాస్త టైమ్‌ స్పెండ్‌ చేశాడు. టీమిండియా తరఫున రోహిత్‌ శర్మతో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించే జైస్వాల్‌.. తన ఫామ్‌ గురించి, పరుగులు చేయడానికి పడుతున్న ఇబ్బంది, మైండ్‌లో ఏం రన్‌ అవుతుంది లాంటి విషయాలను రోహిత్‌తో పంచుకున్నట్లు సమాచారం.

టీమిండియాకు ఎంతో కీలకమైన యువ క్రికెటర్‌ కావడం, టీ20 వరల్డ్‌ కప్‌ ముంచుకొస్తుండటంతో జైస్వాల్‌తో రోహిత్‌ కూడా ప్రత్యేకంగా మాట్లాడినట్లు తెలుస్తుంది. ఎలాంటి ఒత్తిడి తీసుకోకుండా బ్యాటింగ్‌ చేయాలని, ఐపీఎల్‌ ప్రదర్శన టీమిండియాలో నీ చోటు డిసైడ్‌ చేయలేదని, ఫ్రీగా ఆడాలని రోహిత్‌ జైస్వాల్‌తో చెప్పినట్లు సమాచారం. కెప్టెన్‌ ఇచ్చిన భరోసాతో జైస్వాల్‌ మైండ్‌ అంతా రిలాక్స్‌ అయిపోయి.. తనలోని సహజమైన ఎటాకింగ్‌ ప్లేతో సెంచరీ సాధించాడు. 180 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన రాజస్థాన్‌కు భారీ విజయాన్ని అందించాడు. 60 బంతుల్లోనే 9 ఫోర్లు, 7 సిక్సులతో 104 పరుగులతో నాటౌట్‌గా నిలిచి మ్యాచ్‌ ముగించాడు. అయితే.. జైస్వాల్‌ పరుగులు చేయడాన్ని రోహిత్‌ శర్మ బాగా ఎంజాయ్‌ చేశాడు. హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత చప్పట్లతో అభినందించిన రోహిత్‌.. సెంచరీతో మ్యాచ్‌ ముగించిన తర్వాత.. ఆప్యాయంగా హగ్‌ చేసుకుని.. తన అభినందనలు తెలియజేశాడు. ఈ మ్యాచ్‌లో ముంబై ఓడిపోయినా.. రాబోయే టీ20 వరల్డ్‌ కప్‌లో ఎంతో కీలకమైన జైస్వాల్‌ ఫామ్‌లోకి రావడంతో రోహిత్‌ ఫుల్‌ హ్యాపీగా ఉన్నాడు. ఇదే కదా ఒక ఆటగాడిగా దేశం కోసం ఆలోచించడం అంటే అని ఫ్యాన్స్‌ అంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి