iDreamPost

బాధలో ఉన్న ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్! రోహిత్, కోహ్లీకి మరో ఛాన్స్!

  • Author pasha Published - 01:03 PM, Thu - 23 November 23

వన్డే వరల్డ్ కప్-2023 పోయిందనే బాధలో ఉన్న టీమిండియా ఫ్యాన్స్​కు ఓ గుడ్ న్యూస్. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి మరో ఛాన్స్ ఉంది.

వన్డే వరల్డ్ కప్-2023 పోయిందనే బాధలో ఉన్న టీమిండియా ఫ్యాన్స్​కు ఓ గుడ్ న్యూస్. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి మరో ఛాన్స్ ఉంది.

  • Author pasha Published - 01:03 PM, Thu - 23 November 23
బాధలో ఉన్న ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్! రోహిత్, కోహ్లీకి మరో ఛాన్స్!

వన్డే వరల్డ్‌ కప్‌ 2023 ఫైనల్స్‌ లో ఓటమి బాధ నుంచి టీమిండియా ఆటగాళ్లు, అలాగే భారత క్రికెట్‌ అభిమానులు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. వరుసగా 10 మ్యాచ్‌ లు గెలిచి.. ఫైనల్‌ కు దూసుకెళ్లిన రోహిత్‌ సేన, ఫైనల్లో ఆస్ట్రేలియాను మట్టి కరిపించి ప్రపంచ కప్పును ముద్దాడుతారు అనుకుంటే అది జరగలేదు. భారీ అంచనాల మధ్య జరిగిన ఫైనల్‌లో టీమిండియా చెత్త ప్రదర్శనతో ఓటమి పాలైంది. టాస్‌, పిచ్‌ పరిస్థితులు కూడా మనకు ప్రతికూలంగా మారడంతో వరల్డ్‌ కప్‌ గెలిచే సువర్ణ అవకాశాన్ని రోహిత్‌ సేన కోల్పోయింది. అయినా కూడా భారత క్రికెట్‌ అభిమానుల నుంచి జట్టుకు గట్టి మద్దతు లభిస్తుంది. ఎందుకంటే.. టోర్నీ ఆసాంతం టీమ్‌ అంత అద్భుతంగా ఆడింది కాబట్టి. గతంలో టీమిండియా వరల్డ్‌ కప్‌ లో ఓడిన సమయాల్లో క్రికెటర్లను దూషించడం, వారి ఇళ్లపై దాడులు చేయడం లాంటివి చూశాం.. కానీ, ఈ సారి అలాంటి పరిస్థితి లేదు. అంతా టీమ్‌ ను వెనకేసుకొస్తున్నారు. కష్ట సమయంలో అండగా నిలుస్తూ మళ్లీ గెలుస్తాం అనే ధైర్యం ఇస్తున్నారు. ఈ క్రమంలో క్రికెట్‌ అభిమానులను ఉత్సాహపరిచే ఓ విషయం వెలుగులోకి వచ్చింది.

తాజాగా ముగిసిన వన్డే వరల్డ్‌ కప్‌ లో టీమిండియా ఫైనల్‌ వరకు చేరడంలో జట్టులోని అందరి ఆటగాళ్ల కృషి, పట్టుదల, కష్టం ఉన్నా.. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ జట్టును ముందుండి నడిపించారు. సీనియర్‌ ప్రోస్‌ గా బ్యాటింగ్‌ లో పరుగులు చేస్తూ మంచి నిర్ణయాలు తీసుకుంటూ.. ముందుకు సాగారు. కానీ, దేశానికి మూడో వరల్డ్‌ కప్‌ అందించాలనే వారి కల చెదిరిపోయింది. అయినా కూడా వారికి మరో అవకాశం ఉంది. ఎస్‌.. మీరు విన్నది నిజమే. ఈ ఇద్దరు కలిసి వరల్డ్‌ కప్‌ ఎత్తుతుంటే చూడాలని ప్రతి భారత క్రికెట్‌ అభిమాని కలలు కన్నాడు. ఆ ఆశ వన్డే వరల్డ్‌ కప్‌ 2023తోనే తీరుతుందని అనుకున్నారు. కానీ, అది జరగలేదు. అయితే.. ఈ కల తీరేందుకు ఎంతో కాలం పట్టేలా లేదు. అదెలాగంటే?

వచ్చే ఏడాది అంటే 2024లో టీ20 వరల్డ్‌ కప్‌ జరగనున్న విషయం తెలిసిందే. 2024 జూన్‌ లో వెస్టిండీస్‌-అమెరికా సంయుక్తంగా ఈ పొట్టి వరల్డ్‌ కప్‌ టోర్నీని నిర్వహించనున్నాయి. ప్రస్తుతం రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ అద్భుత ఫామ్‌ లో ఉండటంతో ఎంత మంది యువ క్రికెటర్లు ఉన్నా.. ఈ సీనియర్‌ స్టార్‌ జోడీని కదిలించే ప్రయత్నం బహుషా బీసీసీఐ చేయకపోచ్చు. ఎందుకంటే.. ఎంతమంది యువ క్రికెటర్లు ఉన్నా.. రోహిత్‌-కోహ్లీ టీమ్‌ లో ఉంటే ఆ ధైర్యం వేరే ఉంటుంది. పైగా ఇద్దరూ పీక్‌ ఫామ్‌ లో ఉన్నారు. పైగా కెప్టెన్‌ గా రోహిత్‌ శర్మ సూపర్‌ సక్సెస్‌ అవుతున్నాడు. టీ20 ఫార్మాట్‌ లోనూ కెప్టెన్‌ గా రోహిత్‌ శర్మకు మంచి రికార్డ్‌ ఉంది. ఐపీఎల్‌లో 5 ట్రోఫీలు గెలిచిన రికార్డు కూడా రోహిత్‌ పేరిట ఉంది. అందుకే.. వచ్చే టీ20 వరల్డ్‌ కప్‌ లో రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ ఆడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే.. 2027 వన్డే వరల్డ్‌ కప్‌ వరకు ఈ ఇద్దరూ కెరీర్‌ కొనసాగిస్తారా? లేదా? అనేది తెలియదు. సో ఒక వేళ వాళ్లిద్దరూ వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌ కప్‌ ఆడితే.. మరోసారి ఇద్దరు కలిసి వరల్డ్‌ కప్‌ టోర్నీ ఆడి, గెలిచి, కప్పును ఎత్తే అవకాశం దొరికినట్టే. ఇప్పుడు చేసిన తప్పులు అప్పుడు చేయకుండా.. టీ20 వరల్డ్‌ కప్‌ ను సాధిస్తారని ఆశిద్దాం. మరి రోహిత్‌-కోహ్లీ కలిసి టీ20 వరల్డ్‌ కప్‌ 2024 ఆడాలని మీరూ భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: క్రికెట్ మ్యాచ్​ను రికార్డు చేయడానికి ఎన్ని కెమెరాలు వాడతారో తెలుసా?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి