iDreamPost

11 ఏళ్ల తర్వాత.. సచిన్ మాటను నిజం చేసిన విరాట్-రోహిత్!

  • Author singhj Published - 12:39 PM, Wed - 13 September 23
  • Author singhj Published - 12:39 PM, Wed - 13 September 23
11 ఏళ్ల తర్వాత.. సచిన్ మాటను నిజం చేసిన విరాట్-రోహిత్!

ఆసియా కప్-2023కు ముందు టీమిండియాపై ఎన్నో అనుమానాలు, సందేహాలు తలెత్తాయి. ఈ టీమ్​ను సెలెక్ట్ చేశారేంటి? ఫలానా ప్లేయర్​ను ఎందుకు పక్కన పెట్టారు? పాకిస్థాన్​ లాంటి జట్టును మన టీమ్ ఎదుర్కోగలదా? అంటూ రకరకాలు ప్రశ్నలు వచ్చాయి. కానీ వీటన్నింటికీ భారత జట్టు వరుస విజయాలతో దిమ్మతిరిగే రీతిలో సమాధానం చెప్పింది. సూపర్​-4లో ఆడిన రెండు మ్యాచుల్లోనూ గెలుపుతో ఫైనల్​కు దూసుకెళ్లింది. సూపర్-4 దశలో తొలి మ్యాచ్​లో పాక్​ను చిత్తు చేసిన భారత్.. రెండో మ్యాచ్​లో మాత్రం శ్రీలంకపై చెమటోడ్చి విజయం సాధించింది. ఇప్పటికే ఫైనల్​కు చేరుకున్న భారత్​కు తదుపరి బంగ్లాదేశ్​తో ఆడే​ మ్యాచ్ నామమాత్రం కానుంది.

ఇక, పాకిస్థాన్​తో మ్యాచ్​లో అదరగొట్టిన భారత సారథి రోహిత్ శర్మ లంక మీదా చెలరేగాడు. ఈ క్రమంలో మరో మైలురాయిని అందుకున్నాడు. వన్డేల్లో 10 వేల పరుగుల క్లబ్​లో హిట్​మ్యాన్​ చేరాడు. ఈ ఘనత సాధించిన ఆరో ఇండియన్ బ్యాటర్​గా, పదిహేనో ఇంటర్నేషనల్ ప్లేయర్​గా నిలిచాడు. ఈ ఘనతను అందుకోవడానికి రోహిత్​కు 214 ఇన్నింగ్స్​లు అవసరం పడ్డాయి. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ (205 ఇన్నింగ్స్​లు) ఫస్ట్ ప్లేసులో ఉన్నాడు. టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ (259 ఇన్నింగ్స్​లు), సౌరవ్ గంగూలీ (263 ఇన్నింగ్స్​లు) కూడా ఈ లిస్టులో ఉన్నారు.

50 ఓవర్ల ఫార్మాట్​లో రోహిత్​ శర్మ పదివేల పరుగుల క్లబ్​లో చేరడంతో ఇప్పుడో ఇంట్రెస్టింగ్ ఓల్డ్ న్యూస్ వైర​ల్ అవుతోంది. 11 ఏళ్ల కింద ఒక ఫంక్షన్​లో సచిన్ టెండూల్కర్ మాట్లాడిన మాటలు ఇప్పుడు ఇంటర్​నెట్​ను షేక్ చేస్తున్నాయి. అప్పట్లో సచిన్ మాట్లాడుతూ.. తన రికార్డులను విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు మాత్రమే బ్రేక్ చేయగలరని అన్నాడు. సరిగ్గా పదకొండేళ్ల తర్వాత చూసుకుంటే పదివేల పరుగుల క్లబ్​లో సచిన్​ను రోహిత్, కోహ్లీలు వెనక్కి నెట్టేశారు. మాస్టర్ బ్లాస్టర్ కంటే ఈ ఇద్దరు ప్లేయర్లు తక్కువ ఇన్నింగ్స్​ల్లోనే అరుదైన మైలురాయిని చేరుకున్నారు. దీంతో అప్పుడు సచిన్ చెప్పిన మాటల్ని రోహిత్, విరాట్ ఇప్పుడు నిజం చేశారని ఫ్యాన్స్ అంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి