iDreamPost

డెక్కన్ ఛార్జర్స్‌పై ఇంకా ప్రేమ వదులుకొని రోహిత్! MIలో ఉంటూ కూడా మగాడి స్టేట్మెంట్!

  • Published Apr 18, 2024 | 3:58 PMUpdated Apr 18, 2024 | 3:58 PM

Rohit Sharma, Adam Gilchrist: ఐపీఎల్‌లో బిజీబిజీగా ఉన్న రోహిత్‌ శర్మ.. తాజాగా ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌తో ముచ్చటించాడు. వీరి టాక్‌ షోలో.. రోహిత్‌ శర్మ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Rohit Sharma, Adam Gilchrist: ఐపీఎల్‌లో బిజీబిజీగా ఉన్న రోహిత్‌ శర్మ.. తాజాగా ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌తో ముచ్చటించాడు. వీరి టాక్‌ షోలో.. రోహిత్‌ శర్మ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Apr 18, 2024 | 3:58 PMUpdated Apr 18, 2024 | 3:58 PM
డెక్కన్ ఛార్జర్స్‌పై ఇంకా ప్రేమ వదులుకొని రోహిత్! MIలో ఉంటూ కూడా మగాడి స్టేట్మెంట్!

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటికే ఓ సెంచరీ కూడా బాదేశాడు. చాలా కాలం పాటు ముంబై ఇండియన్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన రోహిత్‌ శర్మను ఆ జట్టు యాజమాన్యం ఐపీఎల్‌ 2024 సీజన్‌కి ముందు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించింది. అతని స్థానంలో హార్ధిక్‌ పాండ్యాను కెప్టెన్‌గా నియమించింది. అయినా కూడా రోహిత్‌.. ముంబై జట్టును గెలిపించేందుకు తన శక్తి మేర రాణిస్తున్నాడు. రోహిత్‌ బ్యాటింగ్‌ గురించి కొద్దిసేపు పక్కనపెడితే.. తాజాగా రోహిత్‌ శర్మ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఇంతకీ రోహిత్‌ శర్మ ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం..

రోహిత్‌ శర్మ ముంబై ఇండియన్స్‌కు ఆడకముందు.. ఐపీఎల్‌ తొలి సీజన్స్‌లో అప్పటి డెక్కన్‌ ఛార్జర్స్‌ టీమ్‌కు ఆడిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌ ప్రారంభ సీజన్‌ 2008లో డెక్కన్‌ ఛార్జర్స్‌కు వీవీఎస్‌ లక్ష్మణ్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ తర్వాతి సీజన్‌లో ఆస్ట్రేలియా స్టార్‌ ప్లేయర్‌ ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ డీసీకి కెప్టెన్‌ అయ్యాడు. ఆ రెండు సీజన్స్‌ కూడా రోహిత్‌ శర్మ డెక్కన్‌ ఛార్జర్స్‌కు ఆడాడు. అప్పటి నుంచి గిల్‌క్రిస్ట్‌, రోహిత్‌ శర్మ మధ్య మంచి బాండింగ్‌ ఉంది. అయితే.. తాజాగా వీరిద్దరు వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. ఒకప్పటి డెక్కన్‌ ఛార్జర్స్‌ థీమ్‌ సాంగ్‌ను గుర్తు చేసుకున్నారు. ఆ సాంగ్‌ను తన ఫోన్‌లో ప్లే చేసి మరీ గిల్‌క్రిస్ట్‌, రోహిత్‌కు వినిపించాడు.

Rohith sharma

ఆ సాంగ్‌ విన్న రోహిత్‌ శర్మ.. ఇలాంటి థీమ్‌ సాంగ్‌ మరే టీమ్‌కి లేదని, ఏ టీమ్‌ థీమ్‌సాంగ్ కూడా డెక్కన్ ఛార్జర్స్‌ థీమ్‌సాంగ్‌పైకి రాదని అన్నాడు. అయితే.. ఎప్పుడు 15 ఏళ్ల క్రితం ఆడిన టీమ్‌ సాంగ్‌ను ఇంకా రోహిత్‌ శర్మ గుర్తు పెట్టుకోవడంతో తెలుగు క్రికెట్‌ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పైగా రోహిత్‌ శర్మ అమ్మమ్మ వాళ్లు తెలుగు వారే కావడంతో ఆ సెంటిమెంట్‌తో అయినా.. రోహిత్‌ శర్మ వచ్చే సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టీమ్‌కు ఆడాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే.. ముంబై ఇండియన్స్‌కు రోహిత్‌ శర్మ భవిష్యత్తులో ఆడే సూచనలు ఎలాగో కనిపించడం లేదు. ముంబై ఇండియన్స్‌లో ఉండి కూడా.. తన పాత టీమ్‌ గురంచి రోహిత్‌ స్పందించిన తీరు చూసి.. ఇది మగాడి స్టేట్‌మెంట్‌ అంటూ కామెంట్‌ చేస్తున్నారు. అలాగే రోహిత్‌ను ఎస్‌ఆర్‌హెచ్‌ జెర్సీలో చూడాలని తెలుగు ఫ్యాన్స్‌ బలంగా కోరుకుంటున్నారు. మరి రోహిత్‌ ఇంకా డెక్కన్‌ ఛార్జర్స్‌ థీమ్‌ సాంగ్‌ను గుర్తుపెట్టుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి