iDreamPost

బాధ్యతలు చేపట్టిన మరికొంత మంది మంత్రులు

బాధ్యతలు చేపట్టిన మరికొంత మంది మంత్రులు

మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ తర్వాత నూతనంగా మంత్రి పదవులు దక్కిన నేతలు..తమ బాధ్యతలను స్వీకరిస్తున్నారు.సోమవారం మంత్రులుగా 25 మంది ప్రమాణ స్వీకారం చేయగా.. అందులో ముగ్గురు మంగళవారం బాధ్యతలు చేపట్టారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, పినిపే విశ్వరూప్‌లు మంగళవారం బాధ్యతలు చేపట్టగా.. ఈ రోజు బుధవారం మరికొంత మంది మంత్రులు బాధ్యతలు స్వీకరించారు.

పర్యాటకశాఖ మంత్రిగా నియమితులైన ఆర్‌కే రోజా.. ఈ రోజు తన బాధ్యతలను చేపట్టారు. తన ఛాంబర్‌లో శాస్త్రో క్తంగా పూజలు నిర్వహించిన ఆర్‌కే రోజా.. బాధ్యతలను లాంఛనంగా స్వీకరించారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా మేరుగ నాగార్జున, రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంలు తమ బాధ్యతలు చేపట్టారు.

మంచిరోజు చూసుకున్న తర్వాత కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రులు బాధ్యతలు చేపడుతున్నారు. రాబోయే రెండు, మూడు రోజుల్లో మంత్రులు అందరూ తమ తమ శాఖల బాధ్యతలను చేపట్టబోతున్నారు. మొత్తం 25 మంది మంత్రుల్లో 11 మంది పాత వారు కాగా.. 14 మంది కొత్తగా మంత్రి పదవులు దక్కాయి. చెప్పినట్లుగానే రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గాన్ని పునర్‌వ్యవస్థీకరించిన సీఎం వైఎస్‌ జగన్‌ మరికొంత మంది ఎమ్మెల్యేలకు మంత్రులుగా అవకాశం కల్పించారు.

నూతన మంత్రులు.. వారి శాఖలు..

1. ధర్మాన ప్రసాదరావు– రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖలు

2. సీదిరి అప్పలరాజు – పశుసంవర్థక, మత్స్యశాఖలు

3. బొత్స సత్యనారాయణ – విద్యా శాఖ

4. పీడిక రాజన్నదొర (ఉప ముఖ్యమంత్రి –ఎస్టీ) – గిరిజన సంక్షేమశాఖ

5. గుడివాడ అమర్‌నాథ్‌ – పరిశ్రమలు, వాణిజ్యం, పెట్టుబడుల శాఖ

6. బూడి ముత్యాలనాయుడు ( ఉప ముఖ్యమంత్రి –బీసీ) – పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు.

7. దాడిశెట్టి రాజా – రోడ్లు, భవనాల శాఖ

8. చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ – బీసీ సంక్షేమ, సమాచార, సినిమాటోగ్రఫి శాఖలు.

9. పినిపే విశ్వరూప్‌ – రవాణా శాఖ

10. తానేటి వనిత – హోం శాఖ

11. కారుమూరి నాగేశ్వరరావు – పౌర సరఫరాల శాఖ

12. కొట్టు సత్యనారాయణ – దేవాదాయ శాఖ

13. జోగి రమేష్‌ – గృహనిర్మాణ శాఖ.

14. మేరుగ నాగార్జున – సాంఘిక సంక్షేమ శాఖ

15. విడుదల రజని – వైద్య, ఆరోగ్య శాఖ, వైద్య విద్యా శాఖ

16. అంబటి రాంబాబు – జలవనరుల శాఖ

17. ఆదిమూలపు సురేష్‌ – పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ

18. కాకాని గోవర్థన్‌ రెడ్డి – వ్యవసాయం, సహకార, మార్కెటింగ్‌ శాఖలు

19. ఆర్కే రోజా – పర్యాటకం, యువజన శాఖలు

20. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి – విద్యుత్, గనుల శాఖలు

21. కళత్తూరు నారాయణ స్వామి (ఉప ముఖ్యమంత్రి–ఎస్సీ) – ఎక్సైజ్‌ శాఖ

22. అంజాద్‌ భాషా (ఉప ముఖ్యమంత్రి – మైనారిటీ) – మైనారిటీ వ్యవహారాల శాఖ

23. బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి – ఆర్థిక శాఖ

24. గుమ్మనూరు జయరాం – కార్మిక శాఖ

25. కేవీ ఉషశ్రీ చరణ్‌ – మహిళల సంక్షేమ శాఖ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి