iDreamPost

వీడియో: మరో BRS ఎమ్మెల్యేపై ప్రత్యర్థుల రాళ్ల దాడి.. ఆస్పత్రికి తరలింపు!

అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాల్ రాజ్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్ధి వంశీకృష్ణ అనుచరులతో దాడికి దిగినట్లు తెలుస్తుంది. దీంతో ఎమ్మెల్యేకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాల్ రాజ్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్ధి వంశీకృష్ణ అనుచరులతో దాడికి దిగినట్లు తెలుస్తుంది. దీంతో ఎమ్మెల్యేకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

వీడియో: మరో BRS ఎమ్మెల్యేపై ప్రత్యర్థుల రాళ్ల దాడి.. ఆస్పత్రికి తరలింపు!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తేదీ రోజు రోజుకు దగ్గర పడుతుండడంతో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతున్నాయి. దీంతో ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రచారంలో జోరును పెంచుతూ ప్రజలను కలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రత్యర్థి పార్టీలు పరస్పరం దాడులకు దిగుతున్నాయి. మొన్న ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్ల దాడికి దిగారు. ఈ ఘటనలో ఇరువర్గాల్లోని కొందరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు వెంటనే అప్రమత్తమై వారిని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారిన విషయం తెలిసిందే.

అయితే, ఈ ఘటన మరువక ముందే ఇలాంటి ఘటనలో మరోకటి వెలుగు చూసింది. శనివారం రాత్రం అచ్చంపేటలో కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాల్ రాజ్ వాహనంపై రాళ్ల దాడికి దిగినట్లుగా తెలుస్తుంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కాగా, ఈ దాడిలో ఎమ్మెల్యే గువ్వల బాల్ రాజ్ కు స్వల్ప గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం వెంటనే ఆయనను హైదరాబాద్ కు తరలించారు. అసలు విషయం ఏంటంటే? శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఎమ్మెల్యే గువ్వల బాల్ కు చెందిన వాహనంలో డబ్బులు పంచుతున్నారన్న అనుమానంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఎంపీడీవో ఆఫీసు మందు ఆ వాహనాన్ని అడ్డుకున్నారు.

ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గువ్వల బాల్ రాజ్, కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణతో పాటు వారి అనుచరులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఇదే విషయంపై ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. ఇక పరిస్థితి చేయి దాటి పోవడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఇరు వర్గాలు పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే గువ్వల బాల్ రాజ్ వాహనంపై కూడా దాడికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకోవడంతో పోలీసులు అప్రమత్తమై వారిని చెదరగొట్టారు. అయితే ఈ దాడిలో ఎమ్మెల్యే గువ్వల బాల్ రాజ్ పై తీవ్ర గాయాలు అయ్యాయి.

మెరుగైన చికిత్స కోసం వెంటనే ఆయనను హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యే గువ్వల బాల్ రాజ్ అనుచరులు స్పందించి.. ఎమ్మెల్యపై దాడికి దిగిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మెడకు గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణపై దాడికి దిగిన బాల్ రాజ్ అనుచరులను అరెస్ట్ చేయాలని వారి కూడా డిమాండ్ చేశారు.  ఈ ఘటనకు ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి