iDreamPost

పాకిస్థాన్ పరువు తీసిన రికీ పాంటింగ్! ఏమన్నాడంటే?

  • Author Soma Sekhar Published - 09:26 PM, Fri - 24 November 23

త్వరలోనే టెస్టు సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించబోతోంది పాక్. ఈ క్రమంలో పాక్ టీమ్ పరువు తీశాడు ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్.

త్వరలోనే టెస్టు సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించబోతోంది పాక్. ఈ క్రమంలో పాక్ టీమ్ పరువు తీశాడు ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్.

  • Author Soma Sekhar Published - 09:26 PM, Fri - 24 November 23
పాకిస్థాన్ పరువు తీసిన రికీ పాంటింగ్! ఏమన్నాడంటే?

వరల్డ్ కప్ లో దారుణ ప్రదర్శనతో టోర్నీ మధ్యలోనే ఇంటి దారి పట్టింది పాకిస్థాన్. ఆ జట్టు ఈ మెగా ఈవెంట్ లో మూకుమ్మడిగా విఫం అయ్యింది. దీంతో పాక్ పై సర్వత్రా విమర్శలు వెళ్లువెత్తాయి. ఇక వరల్డ్ కప్ లో పాక్ ఓటమికి బాధ్యత వహిస్తూ.. కెప్టెన్సీ నుంచి బాబర్ అజాం తప్పుకున్న సంగతి తెలిసిందే. ఇక పాక్ కొత్త కెప్టెన్ (టెస్టులకు) గా షాన్ మసూద్ ను నియమించింది పీసీబీ. అలాగే టీ20లకు స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిదిని ఎంపిక చేసింది. వన్డే ఫార్మాట్ కు మాత్రం కెప్టెన్ ను ఎంపిక చేయలేదు. ఈ నేపథ్యంలోనే త్వరలోనే టెస్టు సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించబోతోంది పాక్. ఈ క్రమంలో పాక్ టీమ్ పరువు తీశాడు ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్. ఇంతకీ పాంటింగ్ ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం.

ఆస్ట్రేలియాతో జరగబోయే 3 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కోసం పాక్ జట్టు ఆసీస్ వెళ్లనుంది. ఈ సిరీస్ కు సారథిగా షాన్ మసూద్ ను ఎంపిక చేసింది పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్. ఈ టోర్నీలో భాగంగా డిసెంబర్ 14న పెర్త్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పాక్ జట్టును ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశాడు ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్. ఫొక్స్ క్రికెట్ తో మాట్లాడుతూ.. “పాకిస్థాన్ టీమ్ గతంలో ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చినప్పుడు నేను జర్నలిస్టులతో ఒక మాట అన్నాను. అదేంటంటే? పాకిస్థాన్ అత్యంత చెత్త బౌలర్లతో మా దేశానికి వచ్చిందని. ఇప్పుడు ఆ మాటలను అన్నందుకు నేను ఫీల్ అవుతున్నాను. త్వరలో మా దేశానికి రాబోయే పాక్ బౌలింగ్ టీమ్ అప్పటి కంటే మరింత అధ్వాన్నంగా ఉంది”అంటూ పాక్ పరువు తీశాడు ఈ లెజెండ్.

వరల్డ్ కప్ కు ముందు వరల్డ్ క్లాస్ బౌలర్లు మా జట్టులో ఉన్నారని గొప్పలు చెప్పుకొచ్చిన పాక్.. ప్రపంచ కప్ లో దారుణంగా విఫలం అయ్యింది. హారిస్ రౌఫ్, షాహీన్ షా అఫ్రిది, వసీమ్ జూనియర్ లతో పాటు మరికొందరు బౌలర్లు దారళంగా పరుగులు సమర్పించుకున్నారు. మరి పాక్ జట్టుపై పాంటింగ్ చేసిన విమర్శలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి