iDreamPost

యాచించిన సొమ్ముతోనే శ్రీమంతుడిగా.. ఈ బిచ్చగాడు భలే రిచ్!

యాచక వృత్తితో ఓ బిచ్చగాడు ధనవంతుడిగా మారిపోయాడు. చేతిలో చిల్లి గవ్వ లేని పరిస్థితి నుంచి నేడు విలువైన భూములు కొనుగోలు చేసే స్థాయికి చేరుకున్నాడు. అతడు బిచ్చగాడిగా ఎలా మారాడు. ఆ వివరాలు మీకోసం..

యాచక వృత్తితో ఓ బిచ్చగాడు ధనవంతుడిగా మారిపోయాడు. చేతిలో చిల్లి గవ్వ లేని పరిస్థితి నుంచి నేడు విలువైన భూములు కొనుగోలు చేసే స్థాయికి చేరుకున్నాడు. అతడు బిచ్చగాడిగా ఎలా మారాడు. ఆ వివరాలు మీకోసం..

యాచించిన సొమ్ముతోనే శ్రీమంతుడిగా.. ఈ బిచ్చగాడు భలే రిచ్!

జీవితం అందరికీ ఒకేలా ఉండదు. కొందరు పుట్టుకతోనే సంపన్నులుగా మారుతారు. మరికొందరు కటిక దరిద్రంలో మగ్గుతుంటారు. బతుకు బండిని లాగడానికి నానా కష్టాలు పడుతుంటారు. ఈ క్రమంలో యాచక వృత్తిని ఆశ్రయిస్తుంటారు కొంత మంది. దేవాలయాల ముందు, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్స్, జనాలతో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో యాచిస్తూ వచ్చిన సొమ్ముతో వారి అవసరాలను తీర్చుకుంటుంటారు. కాగా ఓ వ్యక్తి ఇలా యాచించిగా వచ్చిన సొమ్ముతోనే శ్రీమంతుడయ్యాడు. భారత్ లోనే రిచెస్ట్ బెగ్గర్ గా వార్తల్లో నిలిచాడు. అతడే బిహార్ కు చెందిన పప్పు అనే వ్యక్తి.

పట్నాకు చెందిన పప్పు అనే బిచ్చగాడు బిచ్చమెత్తుకుంటూ నేడు విలువైన భూములను కొనుగోలు చేశాడు. తన ఇద్దరు పిల్లలను సైతం ప్రముఖ పాఠశాలలో చదివిస్తున్నాడు. బిచ్చగాడు సినిమాలో సంపన్నుడైన హీరో బిచ్చగాడిగా మారి బిచ్చమెత్తుకుంటుంటారు. అయితే ఇక్కడ పప్పు అనే బెగ్గర్ మాత్రం పైసాకు గతిలేకున్నా పైసా పైసా కూడబెట్టి శ్రీమంతుడిగా మారిపోయాడు. ఇప్పుడు సొంతింట్లోనే ఉంటూ యాచక వృత్తిని కొనసాగిస్తున్నాడు. కాగా బిచ్చగాడు పప్పు తను యాచక వృత్తిలోకి వచ్చిన తీరును ఇలా చెప్పుకొచ్చాడు.. చిన్నప్పుడు బాగా చదవడం లేదని కుటుంబసభ్యులు నన్ను కొట్టేవారు. దీంతో ఇంట్లోనుంచి పారిపోయి ముంబయికి చేరుకున్నానని తెలిపాడు.

ముంబై రైల్వే స్టేషన్‌లో నిల్చున్న నన్ను చూసి బిచ్చగాడిగా భావించి ప్రజలు డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టారు. అలా కేవలం రెండు గంటల్లోనే చేతికి రూ.3,400 వచ్చింది అని తెలిపాడు. ఇలా ప్రతిరోజు మంచి సంపాదన ఉండేదని పప్పు తెలిపాడు. అనుకోకుండానే యాచించానని ఆ తర్వాత అదే అలవాటుగా మారిందని వెల్లడించాడు. కొంతకాలం తర్వాత ముంబయి నుంచి పట్నాకు తిరిగి వచ్చి భిక్షాటన చేయడం ప్రారంభించాను అని పప్పు చెప్పాడు. యాచించిన సొమ్ముతోనే నా పిల్లలను ఉన్నతంగా చదివించి అధికారులుగా తీర్చిదిద్దుతాను అని పప్పు వెల్లడించాడు. మరి యచక వృత్తి ద్వారా శ్రీమంతుడిగా మారిన పప్పు అనే వ్యక్తిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి