iDreamPost

వ్యూహం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు ఆర్జీవీ ఆహ్వానం

ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ ఏదీ చేసినా సెన్సేషనల్లే. మందు, మగువ అంటూ స్టేట్ మెంట్స్ ఇవ్వడమే కాదూ.. ఎవరూ టచ్ చేయని సబ్జెక్టులతో మూవీ చేస్తూ ఉంటారు. తాజాగా ఆయన ఏపీ రాజకీయాలకు సంబంధించి వ్యూహం అనే మూవీని తెరకెక్కించారు.

ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ ఏదీ చేసినా సెన్సేషనల్లే. మందు, మగువ అంటూ స్టేట్ మెంట్స్ ఇవ్వడమే కాదూ.. ఎవరూ టచ్ చేయని సబ్జెక్టులతో మూవీ చేస్తూ ఉంటారు. తాజాగా ఆయన ఏపీ రాజకీయాలకు సంబంధించి వ్యూహం అనే మూవీని తెరకెక్కించారు.

వ్యూహం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చంద్రబాబు,  పవన్ కళ్యాణ్‌కు ఆర్జీవీ ఆహ్వానం

వివాదాస్పద డైరెక్టర్‌గా ముద్ర పడ్డ రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య కాలంలో ఏ ట్వీట్ చేసినా, ఏ మూవీ తీసినా సెన్సేషనల్ అవుతోంది. నిజ జీవిత గాధలను సినిమాలుగా తెరపైకి ఎక్కిస్తున్నారు. తనకు నచ్చిందే చేస్తూ, నచ్చినట్లుగా జీవించే ఏకైక వ్యక్తి బహుశా ఆర్జీవీనే కావొచ్చు. ఇప్పుడు వ్యూహం మూవీతో ముందుకు రాబోతున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చోటుచేసుకున్న కీలక సంఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు ఆర్జీవీ. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. రాజకీయ కథాంశం వ్యూహం, శపథం పేర్లతో రెండు పార్టులుగా తెరకెక్కుతున్న సంగతి విదితమే. గతంలోనే వీటికి సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు దర్శకుడు.

వ్యూహం నవంబర్‌లోనే రిలీజ్ అవ్వాల్సి ఉండగా.. వాయిదా పడింది. డిసెంబర్ 29న విడుదలౌతున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను డైరెక్టర్ ఆర్జీవీ పరిశీలించారు. ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వైసీపీ, టీడీపీ నేతలకు ఆహ్వానాలు పంపినట్లు వెల్లడించారు. అలాగే ఈ వ్యూహంలో ఎలాంటి వ్యూహం లేదని, సీఎం జగన్‌కు ఈ వ్యూహానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టతనిచ్చారు. శనివారం సాయంత్రం జరిగే ఈ వేడుకకు రావాలని టీడీపీ అధినేత నారా చంద్ర బాబు నాయుడు, లోకేష్, జన సేన అధినేత, నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను కూడా ట్విట్టర్ (ప్రస్తుతం ఎక్స్) ద్వారా ఇన్వైట్ చేశారు.

ఒక నిజాన్ని ఈ సినిమా రూపంలో చెప్పబోతున్నామని, ఈ సినిమా ఆపడానికి ఏ వ్యూహాలు ఉన్నాయో తెలియదని, ఈ మూవీలో భాగమైన పార్ట్ 2 శపథం జనవరిలో రిలీజ్ చేస్తున్నామని తెలిపారు ఆర్జీవీ. అలాగే రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన మాత్రమే కాదూ.. ప్రజలకు సేవ చేసే ఉద్దేశం ఏ మాత్రం లేదన్నారు. అలాగే కాలేజీ విద్యార్థులు, యువతీ యువకులను కూడా ఈ వేడుకకు రావాలని ఎక్స్ ద్వారా ఆహ్వానించారు.  ఈ మూవీని రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. డిసెంబర్ 29న థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ మూవీ ఎలా ఉండబోతుందని అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి