iDreamPost

ది లైఫ్ అఫ్ ముత్తు రిపోర్ట్

ది లైఫ్ అఫ్ ముత్తు రిపోర్ట్

2004 వెంకటేష్ ఘర్షణతో మనకు పరిచయమై ఏ మాయ చేశావేతో ఇక్కడా మంచి ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న గౌతమ్ మీనన్ కొత్త సినిమా ది లైఫ్ అఫ్ ముత్తు మొన్న సాయంత్రం ఆలస్యంగా థియేటర్లలో అడుగు పెట్టింది. సెన్సార్ సమస్యలు రావడంతో ఆ రోజు మార్నింగ్ షోలు రద్దు చేయడం ప్రేక్షకులను ఇబ్బంది పెట్టింది. శింబుకి ఇక్కడ ఇమేజ్ లేకపోయినా రామ్ తో భవిష్యత్తులో గౌతమ్ మూవీ తీసే ప్లానింగ్ ఉండటంతో స్రవంతి రవి కిషోర్ ఆఘమేఘాల మీద రిలీజ్ కు అయిదు రోజుల ముందు నిర్ణయం తీసుకుని శరవేగంగా పనులు పూర్తి చేయించారు. అయినా ఇబ్బందులు తప్పలేదు. ఇంతకీ ఈ ముత్తు జీవితం నచ్చేలా ఉందో లేదో రిపోర్ట్ లో చూద్దాం

ఇది మూడు గంటల నిడివికి దగ్గరగా సుదీర్ఘంగా సాగుతుంది కాబట్టి దానికి తగ్గట్టు ముందే ప్రిపేరవ్వాలి. చిన్న కుగ్రామంలో అడవిని నమ్ముకుని దాని వల్ల జీవితంలో ముందుకెళ్లలేమని గుర్తించిన ముత్తు(శింబు)తల్లితో సహా బ్రతుకుతెరువు కోసం ముంబై వెళ్తాడు. పరోటాలు చేసే దుకాణంలో పనికి కుదురుతాడు. అయితే అక్కడ కేవలం వ్యాపారం మాత్రమే జరగదని ప్రాణాలు తీయడానికి వెనుకాడని మాఫియా గ్యాంగ్ లు తన చుట్టూ ఉన్నాయని తెలుసుకోవడానికి అట్టే టైం పట్టదు. ఈలోగా తుపాకీ పట్టడం, మనుషులను చంపడం మొదలువుతుంది. తనకు ఇష్టం లేకపోయినా ఈ ఉచ్చులో దిగిన ముత్తు డాన్ స్థాయికి ఎదుగుతాడు. ఆ తర్వాత జరిగేదే స్టోరీ

ఇలాంటి లైన్ తో గతంలో ఎన్ని సినిమాలు వచ్చాయో లెక్కబెట్టడం కష్టం. ఆ కోణంలో చూస్తే ముత్తులో ఎలాంటి ప్రత్యేకత లేదు. అయితే డిటైల్డ్ గా చెప్పాలన్న గౌతమ్ ఉద్దేశం ముత్తుని ల్యాగ్ కి గురి చేసింది. టేకింగ్ పరంగా టెక్నికల్ గా ఏఆర్ రెహమాన్ సంగీతంలో పలు సీన్లలో ఇంటెన్సిటీ బాగానే పండింది కానీ ఒక గ్యాంగ్ స్టార్ డ్రామాకు కావాల్సిన రేసీ స్క్రీన్ ప్లే కొరవడింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ చాలా నెమ్మదిగా సాగుతుంది. ఎమోషనల్ గా కనెక్ట్ చేయడంలో కూడా గౌతమ్ తడబడ్డారు. శింబుతో సహా మిగిలిన క్యాస్టింగ్ పెర్ఫార్మన్స్ అన్నీ బాగానే కుదిరాయి కానీ సత్య, సర్కార్, నాయకుడు స్థాయిలో ఏదేదో ఊహించుకుంటే మాత్రం ముత్తు నిరాశపరుస్తాడు. లేదూ ఎంత స్లో ఉన్నా ఈ జానర్ ని ఇష్టపడేవాళ్ళు ఓసారి ట్రై చేయొచ్చు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి