iDreamPost

ఏపీ CM జగన్ బాటలో టీపీసీసీ రేవంత్ రెడ్డి!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి.. ప్రజల్లో మంచి గుర్తింపు సంపాదించారు. ఇక సీఎం జగన్ పాలనపై తెలంగాణ నేతలు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా జగన్ బాటలో రేవంత్ రెడ్డి వెళ్తున్నారు.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి.. ప్రజల్లో మంచి గుర్తింపు సంపాదించారు. ఇక సీఎం జగన్ పాలనపై తెలంగాణ నేతలు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా జగన్ బాటలో రేవంత్ రెడ్డి వెళ్తున్నారు.

ఏపీ CM జగన్ బాటలో టీపీసీసీ రేవంత్ రెడ్డి!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. ఏళ్ల తరబడి ముఖ్యమంత్రులుగా పని చేసిన వారికి రాని గుర్తింపు జగన్ మోహన్ రెడ్డికి వచ్చింది. అందుకు కారణం.. విలక్షణమైన నిర్ణయాలు, అద్భుతమైన పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లడమే. ఇక జగన్ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది వాలంటీర్ వ్యవస్థ. ఈ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పథకాలనే ప్రజల వద్దకు తీసుకెళ్తున్నారు. పథకాలకు అర్హలైన ఏ ఒక్కరు నష్టపోకూడదనే ఉద్దేశంతో ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. సీఎం జగన్ పరిపాలనపై ఇతర రాష్ట్రాల సీఎంలు సైతం ప్రశంసలు గురిపించారు. తాజాగా తెలంగాణ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జగన్ బాట పట్టారు. మరి..  ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ప్రస్తుతం తెలంగాణలో ఎన్నిక వాతావరణం కొనసాగుతోంది. అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఎన్నిక బరిలో నిలిచిన అభ్యర్థులు ఎవరనేది ఫైనల్ కావడంతో ప్రచారాలు ముమ్మరం చేశారు. ఇదే సమయంలో ప్రధాన పార్టీల నేతలు ఏపీ పరిపాలను అనుసరిస్తున్నారు. గతంలో గులాబీ బాస్ కేసీఆర్..పెన్షన్ విషయంలో ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు గురిపించారు.

అంతేకాక అదే మాదిరి.. తాము అధికారంలోకి వస్తే.. 5వేల వరకు పెన్షన్లు ఇస్తామని హామీ ఇచ్చారు.  అంతేకాక సీఎం జగన్ పరిపాల పలు రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంటుంది. తాజాగా టీపీసీసీ రేవంత్ రెడ్డి కూడా ఏపీ సీఎం జగన్ ను ఫాలో అయ్యారు. ఏపీలో అమలు అవుతున్న వాలంటీర్ వ్యవస్థను కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఇక్కడ అమలు చేస్తామని హామి ఇచ్చారు. ప్రచారంలో దూసుకెళ్తున్న రేవంత్ రెడ్డి..సుడిగాలి పర్యటనలతో బిజీబిజీగా ఉన్నారు.

బుధవారం జనగామలో కాంగ్రెస్ అభ్యర్థి తరపున తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆ పార్టీ అభ్యర్థి కొమ్మూరు ప్రతాప్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఏపీలో మాదిరిగానే వాలంటీర్ వ్యవస్థను తెలంగాణలో కూడా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. వాలంటీర్ వ్యవస్థను ప్రారంభించి..ప్రజల వద్దకే ప్రభుత్వ పథకాలను తీసుకొస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. అంతేకాక ప్రతాప్ రెడ్డిని గెలిపిస్తే.. జనగామను డివిజన్  గా ఏర్పాటు చేస్తామని, ఆ బాధ్యతను కాంగ్రెస్ తీసుకుంటుందని తెలిపారు.

అంతేకాక బీఆర్ఎస్ పార్టీపై ఓ రేంజ్ లో విరుచకపడ్డారు. వాలంటీర్ వ్యవస్థ అనేది ఏపీలో ప్రత్యేకమైనది. ఇదే విషయాన్ని దేశంలోని అనేక రాష్ట్ర ముఖ్యమంత్రులు సైతం ఒప్పుకున్నారు. తాజాగా రేవంత్ రెడ్డి సైతం సీఎం జగన్ బాటలోనే ఈ వ్యవస్థను తీసుకొస్తామని హామీ ఇచ్చారు. మరి.. తెలంగాణ నేతలు సీఎం జగన్ బాటలో వెళ్తున్నారంటూ వైసీపీ నేతలు, కార్యకర్తలు అంటున్నారు. మరి.. వాలంటీర్ వ్యవస్థపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి