iDreamPost

రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై రిజర్వేషన్ టికెట్ ను బదిలీ చేసుకోవచ్చు!

రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై రిజర్వేషన్ టికెట్ ను బదిలీ చేసుకోవచ్చు!

ప్రజా రవాణాలో ఇండియన్ రైల్వేస్ ది ప్రత్యేకమైన స్థానం. నిత్యం వేలాది మంది ప్రయాణికులను తమ గమ్య స్థానాలకు సురక్షితంగా చేరుస్తూ విశేషమైన ఆధరణ పొందింది. ప్రయాణికుల సౌకర్యార్థం ఎప్పటికప్పుడు సంస్కరణలు చేపడుతుంది. సమయం ఆదా, టికెట్ ఛార్జీలు తక్కువగా ఉండడంతో ఎక్కువ మంది రైలు ప్రయాణానికే మొగ్గు చూపుతారు. కాగా ట్రైన్ లు ఎప్పుడూ ప్రయాణికులతో రద్దీగా ఉంటాయి. ఈ క్రమంలో ట్రైన్ టికెట్ బుక్ చేసుకోక పోతే కూర్చోడానిక, నిల్చోడానికి కూడా ప్లేస్ లేక ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది.

ఈ కారణంగానే టికెట్ రిజర్వేషన్ చేసుకుంటారు. అయితే ఇండియన్ రైల్వేస్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఏదైన కారణం వల్ల తమ ప్రయాణం క్యాన్సిల్ అయితే వారికి కన్ఫర్మ్ అయిన టికెట్ ను ఇతరులకు ట్రాన్స్ ఫర్ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది భారతీయ రైల్వే. రిజర్వేషన్ చేసుకొని ఎమర్జెన్సీ కారణంగా లేదా చివరి నిమిషంలో ప్రయాణం రద్దు చేసుకునే వారికోసం ఆ టికెట్ వృథా అవకుండా కుటుంబ సభ్యుల్లో ఒకరికి బదిలీ చేసుకోవచ్చు. రిజర్వేషన్ ను మరొకరికి షేర్ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది రైల్వే శాఖ.

టికెట్ కన్ఫర్మ్ అయిన ప్రయాణికులు రైలు బయలు దేరే సమయానికి 24 గంటల ముందు రిజర్వేషన్ ట్రాన్స్ ఫర్ రిక్వెస్ట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎంప్లాయీస్ అయితే పండుగలు, పెళ్లిళ్లు, వ్యక్తిగత కారణాలతో డిపార్చర్ కు 48 గంటలకు ముందు రిక్వెస్ట్ పెట్టుకోవాలి. ఎన్ సీసీ క్యాడెట్లకు కూడా వర్తిస్తుంది. టిక్కెట్ తన పేరు మీద బదిలీ కావాల్సిన ప్రయాణికుడు వెరిఫికేషన్ కోసం తప్పని సరిగా ఐడీ కార్డు ను కలిగి ఉండాలి. కన్ఫర్మ్ అయిన టికెట్ ను తీసుకుని దగ్గర్లోని రైల్వే స్టేషన్ కు వెళ్లి రిజర్వేషన్ కౌంటర్ లో టికెట్ బదిలీ కోసం అప్లికేషన్ పెట్టుకోవచ్చు. వెరిఫికేషన్ అనంతరం టికెట్ ను కొత్త ప్రయాణికుడికి ట్రాన్స్ ఫర్ చేస్తారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి