iDreamPost

Bangalore Hotels: బెంగళూరులోని హోటళ్లలో సాంబార్, రసం నిషేధం..ఎందుకంటే.?

టిఫిన్స్ లో ఇడ్లీ సాంబార్, వడ సాంబార్ వంటివి ఎంతో ప్రత్యేకం. వాటిని చాలా మంది ఎంతో ఇష్టంగా ఆరగిస్తుంటారు. కొందరికి అయితే సాంబార్ లేనిదే ముద్ద దిగదు. అలాంటిది బెంగళూరు నగరంలోని హోటల్స్ సాంబార్, రసాన్ని నిషేధించాయి. మరి.. ఆ వివరాలు ఏమిటో

టిఫిన్స్ లో ఇడ్లీ సాంబార్, వడ సాంబార్ వంటివి ఎంతో ప్రత్యేకం. వాటిని చాలా మంది ఎంతో ఇష్టంగా ఆరగిస్తుంటారు. కొందరికి అయితే సాంబార్ లేనిదే ముద్ద దిగదు. అలాంటిది బెంగళూరు నగరంలోని హోటల్స్ సాంబార్, రసాన్ని నిషేధించాయి. మరి.. ఆ వివరాలు ఏమిటో

Bangalore Hotels: బెంగళూరులోని హోటళ్లలో సాంబార్, రసం నిషేధం..ఎందుకంటే.?

నిత్యం అనేక రకాల వార్తలు మనకు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతుంటాయి. అయితే కొన్ని న్యూస్ లు చాలా సాధారణంగా ఉన్నప్పటికీ.. మరికొన్ని మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటాయి. తాజాగా బెంగుళూరు నగరానికి సంబంధించిన ఓ వార్త అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అక్కడ ఉండే హోటళ్లలో  మెనూ నుంచి ఇడ్లీ సాంబార్, వడ సాంబార్ అనేవి మాయమైపోయాయి. మరి.. బెంగళూరు నగరంలోని ఆ హోటళ్లలో ఎందుకు సాంబార్ ను నిషేధించారు, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

సాధారణంగా టిఫిన్ ఐటెమ్స్ లో ఎన్నో రకాలు ఉంటాయి.  ఎక్కువ మంది మాత్రం ఇడ్లీ సాబార్, వడ సాంబార్ వంటి టిఫిన్లు చేస్తుంటారు. ఇక ఇడ్లీ సాంబార్ అంటే  పడి చచ్చే వాళ్లు ఎంతో మంది ఉంటారు. సాంబార్ లేని ఇడ్లీని, వడను ముట్టుకోవడానికి ఎవరు ఇష్టపడరు. అందుకే కస్టమర్ల కోసం తప్పనిసరిగా సాంబార్ ను హోటళ్ల యాజమానులు ఉంచారు. సాంబార్ ను తమ మెను లో నుంచి తీస్తే.. కస్టమర్ల తగ్గిపోతారు. అయినా బెంగళూరు నగరంలోని చాలా హోటళ్లు మాత్రం ఇడ్లీ సాంబార్, వడ సాంబార్ వంటి వాటిని తమ మెను లో నుంచి తీసేశారని తెలుస్తోంది. అదే విధంగా భోజనంలో కూడా రసం వేయట్లేదు. అయితే అన్నీ హోటల్స్ లో మాత్రం కాదని, నీటి కొరతను ఎదుర్కొంటున్న వాటిల్లో మాత్రమే అని సమాచారం.

ఇలాంటి ద్రవ రూపంలో ఉండే చాలా ఆహార పదార్థల విషయంలో అనేక మార్పులు ఉన్నాయి.  ఇలాంటి మార్పులకు హోటళ్లు శ్రీకారం చుట్టడానికి ప్రధాన కారణం…నీటి కొరత. కర్ణాటక రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేనంతగా నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా కర్నాటక రాజధాని బెంగళూరు నగరంలో నీటి మట్టం పూర్తి స్థాయిలో పడిపోయింది. అక్కడ బోర్లు ఎండిపోయాయి. దీంతో నగర వాసులు బయట నుంచి ట్యాంకర్లతో నీటని సరఫరా చేసుకుంటున్నారు. ఇలా ఈ  గ్రీన్ సిటీకి ఎన్ని ట్యాంకర్లు వచ్చినా సరిపోవడంలేదు. దీంతో అక్కడి ప్రజల జీవన శైలిలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి.

అనే నీటి వినియోగం ఎక్కువగా ఉండే హోటళ్లు, రెస్టారెంట్ల వంటి వ్యాపార సంస్థలు చాలా కఠిన నిర్ణయాలు తీసుకున్నాయి. నీరు ఎక్కువగా ఉపయోగించే సాంబార్, రసం వంటివి మెనూ నుంచి తీసేసినట్లు తెలుస్తోంది. అలానే హోటళ్లలో తాగేందుకు విడిగా నీళ్లు ఇవ్వడంలేదు. హోటల్ కి వెళ్లి నీళ్లు తాగాలంటే.. బాటిల్స్ కొనాల్సిందే. చిన్న, పెద్ద అన్ని హోటళ్లలో ఒక్కసారి వినియోగించే ప్లేట్లను మాత్రమే వాడుతున్నారు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో వినియోదారులకు ఏర్పాటు చేసే టాయిలెట్స్ కి తాళాలు వేస్తున్నారు. మాల్స్ కి వచ్చే వారు మరీ గొడవ చేస్తే టోకెన్ సిస్టమ్ అమలు చేస్తున్నారు.

కొన్ని రోజుల క్రితం వరకు ఆఫీస్ కి రావాలని ఉద్యోగులపై ఒత్తిడి చేసిన ఐటీ కంపెనీలు ఇప్పుడు రూటు మార్చాయి. వర్క్‌ఫ్రమ్‌హోమ్‌ అవకాశాన్ని పొడిగిస్తూ ఆదేశాలు ఇస్తున్నాయి. ఇక వాటర్ ట్యాంకర్లు, వాటర్ క్యాన్ల ధరలు ఆకాశం వైపు పరుగులు తీస్తున్నాయి. వాహనాల సర్వీసింగ్ పాయింట్లకు నిర్వాహకలు తాళాలు వేశారు. బెంగళూరు వేసవి పర్యాటకంపై కూడా ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి