iDreamPost

పరిపాలనలో విప్లవాత్మక మార్పులు.. వెను వెంటనే అమలు..

పరిపాలనలో విప్లవాత్మక మార్పులు.. వెను వెంటనే అమలు..

ఆంధ్రప్రదేశ్ లో యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ సర్కార్ పరిపాలనలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుడుతూ వాటిని జెట్ స్పీడ్ తో అమలు చేస్తోంది. ఇప్పటివరకు ప్రతి జిల్లాకు ఇద్దరూ జాయింట్ కలెక్టర్ లు ఉండగా వారి సంఖ్య మూడుకు పెంచుతూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. అంతే కాకుండా వారికి స్పష్టంగా పని విభజన, బాధ్యతలు అప్పగించింది. రోజుల వ్యవధిలో తీసుకున్న ఈ నిర్ణయాన్ని తాజాగా ఈ రోజు అమలు చేసింది. రాష్ట్రంలో 13 జిల్లాల్లోనూ అదనపు చేసిన నియామకం కోసం భారీగా ఐఏఎస్ ల బదిలీలు చేపట్టింది.

జిల్లాకు ముగ్గురు జాయింట్ కలెక్టర్ల తో రాష్ట్రంలో పరిపాలన, సంక్షేమం పరుగులు పెట్టనుంది. రైతు భరోసా కేంద్రాలు (ఆర్.బి.కె), రెవెన్యూ శాఖల పర్యవేక్షణకు ఒక జాయింట్ కలెక్టర్, వాలంటీర్లు, గ్రామ వార్డు సచివాలయాల పర్యవేక్షణకు మరొక జాయింట్ కలెక్టర్ ను, సంక్షేమ పథకాల అమలు పర్యవేక్షణ కు మరో అదనపు జాయింట్ కలెక్టర్ ప్రభుత్వం తాజాగా నియమించింది.

జిల్లాల వారీగా ఆర్ బి కే లు రెవిన్యూ శాఖ… గ్రామ వార్డు సచివాలయాలకు జాయింట్ కలెక్టర్ లుగా వరుసగా.. శ్రీకాకుళం జిల్లాకు సుమిత్ కుమార్, కే శ్రీనివాసులు., విజయనగరం జిల్లాకు క్రైస్ట్ కిషోర్ కుమార్, మహేష్ కుమార్., విశాఖపట్నం జిల్లాకు వేణుగోపాల్ రెడ్డి, అరుణ్ బాబు., తూర్పుగోదావరి జిల్లాకు జి లక్ష్మి షా, చేకూరి కీర్తి., పశ్చిమగోదావరి జిల్లాకు వెంకటరమణారెడ్డి, హిమాంశు శుక్లా., కృష్ణా జిల్లాకు మాధవి లత, శివశంకర్., గుంటూరు జిల్లాకు దినేష్ కుమార్, పి ప్రశాంతి., ప్రకాశం జిల్లాకు వెంకట మురళి, టి.ఎస్. చేతన్., నెల్లూరు జిల్లాకు వినోద్ కుమార్, ప్రభాకర్ రెడ్డి., చిత్తూరు జిల్లాకు మార్కండేయులు, వీరబ్రహ్మయ్య., కడప జిల్లాకు ఎం. గౌతమి, శ్రీకాంత్ వర్మ., అనంతపురం జిల్లాకు నిశాంత్ కుమార్, లావణ్య వేణి., కర్నూలు జిల్లాకు పి.రవి సుభాష్, రామసుందర్ రెడ్డి లను నియమించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి