iDreamPost

ఎయిర్ పోర్టులో ఉద్యోగాలు.. నెలకు రూ. 34 వేల వరకు జీతం!

నిరుద్యోగులకు శుభవార్త. ఎయిర్ పోర్టులో పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు నెలకు రూ. 34 వేల వరకు వేతనం అందుకోవచ్చు.

నిరుద్యోగులకు శుభవార్త. ఎయిర్ పోర్టులో పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు నెలకు రూ. 34 వేల వరకు వేతనం అందుకోవచ్చు.

ఎయిర్ పోర్టులో ఉద్యోగాలు.. నెలకు రూ. 34 వేల వరకు జీతం!

ఉద్యోగాల కోసం ఎదురు చూసే నిరుద్యోగులకు శుభవార్త. ఎయిర్ పోర్టుల్లో ఉద్యోగాలు పొందే అవకాశం వచ్చింది. ఎయిర్ పోర్టులో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ దేశవ్యాప్తంగా ఏఏఐసీఎల్‌ఏఎస్‌ కేంద్రాల్లో సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టుల భర్తీ చేపట్టనుంది. మూడేళ్ల కాలవ్యవధికి ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ నియామకాలు జరుగనున్నాయి. మొత్తం 906 ఖాళీలను భర్తీ చేయనున్నారు. డిగ్రీ అర్హతతో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరింది. పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ https://aaiclas.aero/ ను సంప్రదించాలని కోరింది.

ముఖ్యమైన సమాచారం:

పోస్టుల వివరాలు:

  • సెక్యూరిటీ స్క్రీనర్

మొత్తం పోస్టులు:

  • 906

అర్హత:

  • ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ/ సంస్థ నుంచి కనీసం జనరల్ అభ్యర్థులకు 60శాతం, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 55శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి:

  • అభ్యర్థుల వయసు 27 సంవత్సరాలు మించకూడదు.

అప్లికేషన్ ఫీజు:

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.750. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌, మహిళా అభ్యర్థులకు రూ.100 గా నిర్ణయించారు.

అప్లికేషన్ విధానం:

  • ఆన్‌లైన్

ఎంపిక విధానం:

  • డిగ్రీ మార్కులు, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక ఉంటుంది.

జీతం :

  • ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు మొదట స్టైపెండ్‌గా రూ.15,000 చెల్లిస్తారు. ట్రైనింగ్ తర్వాత మొదటి సంవత్సరం నెలకు రూ.30,000; రెండో సంవత్సరం రూ.32,000; మూడో సంవత్సరం రూ.34,000 జీతంగా చెల్లిస్తారు.

దరఖాస్తుల ప్రారంభ తేదీ:

  • 17-11-2023

దరఖాస్తుకు చివరితేది:

  • 08-12-2023

అధికారిక వెబ్ సైట్ :

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి