iDreamPost

ప్రో కబడ్డీలో రికార్డు వేలం.. ఎవరూ ఊహించని ధరకు వేలం పాడిన ఫ్రాంచైజీలు

ప్రో కబడ్డీలో రికార్డు వేలం.. ఎవరూ ఊహించని ధరకు వేలం పాడిన ఫ్రాంచైజీలు

దేశంలో క్రికెట్ తరువాత అంతే క్రేజ్ దక్కించుకుంటున్న క్రీడ కబడ్డీ. ముఖ్యంగా ఐపీఎల్ క్రికెట్ ఫీవర్ ను ఎక్కిస్తుంటే… ప్రో కబడ్డీ సైతం క్రీడాభిమానులకు అంతే స్థాయిలో అకట్టుకుంటోంది. అందుకే ఇప్పటివరకు 8 సీజన్లు పూర్తి చేసుకోగలిగింది. ఇక 9వ సీజన్ ను మరికొద్ది రోజుల్లో ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి కూడా ఆటగాళ్ళ వేలం అంతే భారీ ఎత్తున జరిగింది.

ముంబై వేదికగా జరిగిన ఈ వేలంలో ఇప్పటివరకు ఊహించని ధర పలకడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రికార్డు ధరకు ఆయా ఆటగాళ్ళను ఫ్రాంచైజీలు దక్కించుకోవడంతో ఇప్పటినుంచే ప్రో కబడ్డి హీట్ మొదలైందనే చెప్పాలి.

మొత్తం 500 మంది ఆటగాళ్ళను కొనుగోలు చేసేందుకు 12 జట్లు పోటీపడటం విశేషం. అయితే ఈ వేలంలో పవన్ షెరావత్ ను రూ.2.65కోట్లకు దక్కించుకుంది తమిళ్‌ తలైవాస్. తరువాత స్థానంలో రూ.1.70కోట్లకు వికాస్‌ ఖండోలాను బెంగళూరు బుల్స్ దక్కించుకుంది. ఇక రూ.1. 38కోట్లకు ఫజల్‌ అట్రాసలీ ని పుణేరీ పల్టాన్స్ సొంతం చేసుకుంది. ఇన్నేళ్ళ ప్రో కబడ్డీ వేలం చరిత్రలో పవన్ షెరావత్ రికార్జు ధర పలికాడు.

మన తెలుగు టైటాన్స్ జట్టులోకి కొత్తగా అభిషేక్‌ సింగ్‌, పర్వేష్‌ భైంస్వాల్‌, మోను గోయల్‌,  సిద్దార్ధ్‌ దేశాయ్, సుర్జీత్ సింగ్, విశాల్ భరద్వాజ్ లు వచ్చి చేరారు. రజనీశ్, అంకిత్ లను రీటైన్ చేసుకుంది తెలగు టైటాన్స్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి