iDreamPost

బాద్షా‌పై రెబల్‌ స్టార్‌ స్పష్టమైన ఆధిపత్యం.. ఇదే సాక్ష్యం

ప్రభాస్‌, ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందిన సలార్‌ మరియు షారుఖ్‌ ఖాన్‌, రాజ్ కుమార్‌ హిరానీ కాంబోలో రూపొందిన డంకీ సినిమాలు క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఒక్క రోజు తేడాతో విడుదల అవ్వబోతున్న ఈ సినిమాల అడ్వాన్స్ బుకింగ్‌ విషయంలో ఓవర్సీస్‌‍లో సలార్‌ పై చేయి సాధించింది. 

ప్రభాస్‌, ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందిన సలార్‌ మరియు షారుఖ్‌ ఖాన్‌, రాజ్ కుమార్‌ హిరానీ కాంబోలో రూపొందిన డంకీ సినిమాలు క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఒక్క రోజు తేడాతో విడుదల అవ్వబోతున్న ఈ సినిమాల అడ్వాన్స్ బుకింగ్‌ విషయంలో ఓవర్సీస్‌‍లో సలార్‌ పై చేయి సాధించింది. 

బాద్షా‌పై రెబల్‌ స్టార్‌ స్పష్టమైన ఆధిపత్యం.. ఇదే సాక్ష్యం

బాలీవుడ్‌ బాద్‌ షా షారుఖ్‌ ఖాన్ దాదాపు దశాబ్ద కాలం తర్వాత హిట్‌ ను అందుకున్నాడు. అది కూడా ఒకే ఏడాది బ్యాక్ టు బ్యాక్‌ పఠాన్ మరియు జవాన్ సినిమాలతో ఏకంగా వెయ్యి కోట్ల వసూళ్లు నమోదు చేయడం జరిగింది. ఇక ఇదే ఏడాది డంకీ సినిమాతో మూడోసారి వెయ్యి కోట్ల వసూళ్లు నమోదు చేయడం ద్వారా అరుదైన ఘనత దక్కించుకోవాలని షారుఖ్‌ ఖాన్‌ ఉవ్విల్లూరుతూ ఉన్నాడు. ఇలాంటి సమయంలో డంకీ సినిమాకు రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా నటించిన సలార్‌ సినిమా గట్టి పోటీని ఇవ్వబోతుంది. ఓవర్సీస్‌‍తో పాటు సౌత్‌ ఇండియాలో ఇంకా నార్త్‌ ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో కచ్చితంగా డంకీపై సలార్‌ స్పష్టమైన ఆధిపత్యం కనబర్చబోతుంది. తాజాగా ఓవర్సీస్‌ లో నమోదు అయిన అడ్వాన్స్ బుకింగ్‌ ఆ విషయాన్ని చెప్పకనే చెబుతోంది. షారుఖ్ ఖాన్ డంకీ సినిమా తో పోల్చితే సలార్‌ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌ విషయంలో మూడు నాలుగు రెట్లు అధికంగా నమోదు అయినట్లు యూఎస్ బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

2023 సంవత్సరంలో విడుదల అయిన సినిమాల్లో అత్యంత స్పీడ్‌ గా మిలియన్ డాలర్లను అడ్వాన్స్ బుకింగ్‌ రూపంలో నమోదు చేసిన చిత్రంగా కూడా సలార్ నిలిచింది. విడుదల సమయంకు అడ్వాన్స్ బుకింగ్‌ ద్వారానే మూడు మిలియన్ డాలర్లను సలార్‌ దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక డంకీ అడ్వాన్స్ బుకింగ్‌ చాలా డల్ గా ఉండటంతో విడుదల సమయంకు 1.5 మిలియన్ డాలర్ల అడ్వాన్స్ బుకింగ్‌ అయ్యేనా అంటే అనుమానమే అన్నట్లుగా యూఎస్‌ బాక్సాఫీస్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సలార్‌ లేకుండా ఉంటే కచ్చితంగా డంకీకి మంచి అడ్వాన్స్ బుకింగ్‌ జరిగి ఉండేది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. షారుఖ్ గత చిత్రాలు రెండు వెయ్యి కోట్లు వసూళ్లు చేసి, ఓవర్సీస్‌‍లో భారీగా వసూళ్లు నమోదు చేసినా కూడా సలార్ కారణంగా అక్కడ అడ్వాన్స్ బుకింగ్‌ చాలా డల్‌ గా ఉంది. విడుదల తర్వాత కూడా ఇలాంటి పరిస్థితి కొనసాగే అవకాశాలు ఉన్నాయి అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

యూఎస్‌ బాక్సాఫీస్ తో పాటు ఇతర దేశాల్లో నమోదు అయ్యే కలెక్షన్స్‌ వెయ్యి కోట్ల మార్క్‌ దాటడంలో అత్యంత కీలకం అనడంలో సందేహం లేదు. అందుకే ఓవర్సీస్‌ కలెక్షన్స్‌ పై ఈ మధ్య కాలంలో మేకర్స్‌ ఎక్కువ దృష్టి పెడుతున్నారు. డంకీ సినిమా అక్కడ సలార్‌ సినిమా కారణంగా నేల చూపులు చూస్తోంది. దాంతో సలార్‌ కారణంగా డంకీ సినిమాకి హిట్ టాక్‌ వచ్చినా కూడా వెయ్యి కోట్ల వసూళ్లు నమోదు అవ్వడం కష్టం అన్నట్టుగా చాలా మంది మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి షారుఖ్ మరియు ప్రభాస్ మధ్య క్రిస్మస్ సందర్భంగా జరుగబోతున్న అతి పెద్ద బాక్సాఫీస్‌ వార్‌ లో విజయం ఎవరిది అంటూ సినీ ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రీ రిలీజ్ లో మాత్రం బాద్‌ షా పై రెబల్‌ స్టార్‌ స్పష్టమైన ఆధిపత్యం కనబర్చుతున్నాడు. మరి పోస్ట్ రిలీజ్ లోనూ రెబల్‌ స్టార్‌ ఇదే తరహా లో ఆధిపత్యం కనబర్చుతాడు అని మీరు భావిస్తున్నారా?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి