iDreamPost

Jasprit Bumrah: విధ్వంసం సృష్టించిన బుమ్రా! ఇంగ్లండ్‌పై ఇంత కసికి కారణం?

  • Published Feb 03, 2024 | 5:52 PMUpdated Feb 03, 2024 | 5:52 PM

ఇండియా-ఇంగ్లండ్‌ రెండో టెస్టు మ్యాచ్‌లో భారత స్పీడ్‌స్టర్‌ జస్ప్రీత్‌ బుమ్రా చెలరేగిపోయాడు. ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటర్లను వణికిస్తూ.. ఏకంగా 6 వికెట్లతో అద్భుతంగా రాణించాడు. అయితే.. బుమ్రా బౌలింగ్‌లో ఒక కసి కనిపించింది. ఇంగ్లండ్‌పై బుమ్రాకు ఇంత కసి ఎందుకో ఇప్పుడు చూద్దాం..

ఇండియా-ఇంగ్లండ్‌ రెండో టెస్టు మ్యాచ్‌లో భారత స్పీడ్‌స్టర్‌ జస్ప్రీత్‌ బుమ్రా చెలరేగిపోయాడు. ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటర్లను వణికిస్తూ.. ఏకంగా 6 వికెట్లతో అద్భుతంగా రాణించాడు. అయితే.. బుమ్రా బౌలింగ్‌లో ఒక కసి కనిపించింది. ఇంగ్లండ్‌పై బుమ్రాకు ఇంత కసి ఎందుకో ఇప్పుడు చూద్దాం..

  • Published Feb 03, 2024 | 5:52 PMUpdated Feb 03, 2024 | 5:52 PM
Jasprit Bumrah: విధ్వంసం సృష్టించిన బుమ్రా! ఇంగ్లండ్‌పై ఇంత కసికి కారణం?

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా స్టార్‌ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా నిప్పులు చెరిగారు. ఒక్కో బాల్‌ ఆడేందుకు ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటర్లు మూడు చెరువుల నీళ్లు తాగారు. ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స​ అయితే.. బుమ్రా బౌలింగ్‌ను ఆడలేక బ్యాట్‌ కిందపడేసి.. ఇలా ఎలా వేస్తే ఎలా ఆడాలంటూ గ్రౌండ్‌లోనే తన అసహనం​ వ్యక్తం చేశాడు. ముఖ్యంగా ఓలీ పోప్‌, బెన్‌ స్టోక్స్‌లను అవుట్‌ చేసిన విధానం అయితే.. మ్యాచ్‌కే హైలెట్‌గా మారింది. ఇలాంటి బంతులేస్తే ఎలా ఆడతారు అని సగటు క్రికెట్‌ అభిమానికి కూడా అనిపించిందంటే.. బుమ్రా విధ్వంసం ఏ రేంజ్‌లో సాగిందో అర్థం చేసుకోవచ్చు. మొత్తం ఇంగ్లండ్‌తో రెండో టెస్టు రెండో రోజు బుమ్రా బీభత్సం కొనసాగింది. ఏకంగా ఆరు వికెట్లతో చెలరేగాడు. అయితే.. ఇంగ్లండ్‌పై బుమ్రా ఎందుకింత కసిగా చెలరేగుతున్నాడు? ఆ కసి వెనుక కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఐదు టెస్టుల సిరీస్‌ కోసం భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లండ్‌.. ఇండియాపై బజ్‌బాల్‌ స్ట్రాటజీ ప్రయోగిస్తామని ముందు ప్రకటించిన ఇంగ్లండ్‌.. తొలి టెస్టులో అందుకు తగ్గట్లు ఆడకపోయినా.. మ్యాచ్‌ గెలిచింది. తొలి రెండున్నర రోజులు మ్యాచ్‌పై పట్టు సాధించిన టీమిండియా.. ఓలీ పోప్‌ను ఒక్కడిని అవుట్‌ చేయలేక మ్యాచ్‌ను చేజార్చకుంది. జట్టు మొత్తం విఫలమైనా.. పోప్‌ ఒక్కటే 196 పరుగులతో చెలరేగి ఇండియా ముందుకు మంచి ఫైటింగ్‌ టార్గెట్‌ పెట్టాడు. ఇక్కడే బుమ్రా ఇగో హార్ట్‌ అయింది. కేవలం 40 టెస్టులు మాత్రమే ఆడిన యువ క్రికెటర్‌.. అవుట్‌ కాకుండా ఆడటం బుమ్రాకు అస్సలు నచ్చలేదు. ఆ తర్వాత మన బ్యాటర్లు 231 పరుగుల టార్గెట్‌ను ఛేజ్‌ చేసి ఉన్నా బాగుండేది.

కానీ, మన బ్యాటర్లు చేతులెత్తేయడంతో ఇంగ్లండ్‌ అనూహ్య విజయం సాధించింది. దాంతో బుమ్రా కోపం చల్లారలేదు. రెండో టెస్టులో ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ కోసం ఎదురుచూసిన బుమ్రా.. తనలోని బెస్ట్‌ను బయటపెడుతూ.. టర్నింగ్‌ పిచ్‌పై కూడా నిప్పులు చెరిగాడు. ముఖ్యంగా ఓలీ పోప్‌, జో రూట్‌, బెన్‌ స్టోక్స్‌ను టార్గెట్‌గా చేసుకున్నాడు బుమ్రా. తొలి టెస్టులో ఇంగ్లండ్‌కు హీరోగా మారిన పోప్‌ను.. అద్భుతమైన యార్కర్‌తో బొక్కబోర్లా పడగొట్టాడు. బుమ్రా దెబ్బకు వికెట్లు ఎగిరిపడ్డాయి. ఆ అవుట్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. ఇలాంటి బౌలింగ్‌ కదా బుమ్రా నుంచి ఆశించేది అంటూ క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. బుమ్రా ఇలా చెలరేగుతుంటే.. ఇంకా టర్నింగ్‌ ట్రాక్స్‌ ఎందుకు ప్రశ్నలు కూడా వస్తున్నాయి. మరి తొలి మ్యాచ్‌ ఓడిన కసితో బుమ్రా బౌలింగ్‌లో చెలరేగుతుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి