iDreamPost

Ravi Basrur KGF సంగీత దర్శకుడు – కన్నీళ్ల నుంచి కోట్ల దాకా

Ravi Basrur KGF సంగీత దర్శకుడు – కన్నీళ్ల నుంచి కోట్ల దాకా

కెజిఎఫ్ సక్సెస్ లో హీరో యష్గ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కు ఎంత షేర్ ఉంటుందో అంతే సమానంగా అందులో హీరోయిజం, యాక్షన్ ఎపిసోడ్స్ ఎలివేట్ కావడానికి కారణమైన సంగీత దర్శకుడు రవి బస్రూర్ కు అంతకు మించిన క్రెడిట్ దక్కుతుంది. అయితే ఆయన నిజ జీవిత కథ వింటే మాత్రం ఆశ్చర్యంతో పాటు ఉద్వేగం కూడా కలుగుతుంది. అదేంటో చూద్దాం. రవి పుట్టింది 1984లో.కర్ణాటక రాష్ట్రం ఉడిపి జిల్లా బస్రూర్ అనే ఊరిలో. పేద కుటుంబం. అసలు పేరు కిరణ్. ఇద్దరు అన్నయ్యలు ఒక అక్కయ్య తర్వాత కలిగిన సంతానం. వీళ్ళ కుటుంబ వృత్తి కమ్మరి. విశ్వబ్రాహ్మణులు. ఇంట్లో సంగీత పరికరాలు ఉండేవి. వాటితోనే దోస్తీ.

చిన్న ఆర్కెస్ట్రా సెట్ చేసుకుని కచ్చేరిలు ఇచ్చేవాడు కానీ వచ్చే ఆదాయం దేనికీ సరిపోయేది కాదు. దీంతో ఉపాధి కోసం 200 రూపాయలు జేబులో పెట్టుకుని బెంగళూర్ వెళ్ళాడు. బిడదిలో ఉండే శిల్పాలు చెక్కే కంపెనీలో పనికి కుదిరాడు. వీలున్నప్పుడంతా ఇండస్ట్రీ వాళ్ళను కలిసే ప్రయత్నం చేసేవాడు. ఓ రెండు మూడు భక్తి గీతాల పని దొరికింది. స్వంతంగా ఒక ప్రైవేట్ ఆల్బమ్ చేశాడు. ఫలితం దక్కలేదు. ఇలా లాభం లేదని ఇంటికి వచ్చేసి చిన్న కంప్యూటర్ సెట్ చేసుకుని లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించిన మ్యూజిక్ మీద పని చేయడం మొదలుపెట్టాడు. తర్వాత ఎవరో పని ఇస్తామంటే ముంబై చేరుకున్నాడు. ఇక్కడ ఇంకో ట్విస్టు.

ముంబైకి వెళ్లిన రోజే ట్రైన్ బాంబు పేలి నగరమంతా ఉద్రిక్తతలు. ఓ పోలీస్ వల్ల చేతిలో ఉన్న వాద్య పరికరాలు నాశనం అయ్యాయి. తిరిగి బస్రూర్ వచ్చేశాడు. ఏవేవో ఆలోచనలు. రెండు లక్షలు అప్పు మిగిలింది కానీ ఇంకా ఏమి సాధించలేదు. ఒకదశలో కిడ్నీ అమ్మడానికి సిద్ధపడ్డాడు. అదే సమయంలో ఓ మిత్రుడు ఇచ్చిన చేయూతతో రవిగా పేరు మార్చుకుని ఒక ఎఫ్ఎం రేడియోలో 15 వేల జీతానికి కుదిరాడు. తర్వాత శాండల్ వుడ్ లో ప్రోగ్రామర్ గా అవకాశాలు. అప్పుడు కలిశాడు ప్రశాంత్ నీల్. రవిలో కసి నచ్చి ఉగ్రం ఆఫర్ ఇచ్చాడు. అంతే ఇద్దరి జాతకాలు మారిపోయాయి. కెజిఎఫ్ 2 వచ్చేదాకా రవి ప్రస్థానం కన్నీళ్ల నుంచి కోట్ల దాకా ఎదిగింది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి