iDreamPost

కప్పు కొట్టిన RCB.. నమ్మకుంటే ఈ వీడియో చూడండి!

  • Published Jul 19, 2023 | 1:32 PMUpdated Jul 19, 2023 | 1:32 PM
  • Published Jul 19, 2023 | 1:32 PMUpdated Jul 19, 2023 | 1:32 PM
కప్పు కొట్టిన RCB.. నమ్మకుంటే ఈ వీడియో చూడండి!

ఐపీఎల్‌లో అత్యధిక ఫ్యాన్‌ బేస్‌ ఉన్న టీమ్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు. ఆ జట్టుకు ఉండే ఫాలోయింగ్‌ చూస్తే.. కొన్నిసార్లు షాకింగ్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే ఐపీఎల్‌లో భారీ క్రేజ్‌ ఉండి, స్టార్‌ ఆటగాళ్లతో నిండిన జట్టు.. 16 ఏళ్లుగా ఒక్కసారి కూడా ఐపీఎల్‌ టైటిల్‌ గెలవలేదు. కానీ, ప్రతి ఏడాది ఆ టీమ్‌ ఫ్యాన్స్‌ మాత్రం ‘ఈ సాలా కప్‌ నమ్‌దే’ అంటూ సోషల్‌ మీడియాలో రచ్చరచ్చ చేస్తుంటారు. చివరికి ఆర్సీబీ టోర్నీ నుంచి నిష్క్రమిస్తే.. మళ్లీ వచ్చే ఏడాది చూసుకుందాం అంటూ.. సరిపెట్టుకుంటారు.. 16 ఏళ్లుగా ఇదే సాగుతోంది.

‘కనీసం కోహ్లీ కోసమైనా ఒక్కసారి కప్పు గెలవండి’ అంటూ ప్రత్యర్థి జట్ల అభిమానులు సైతం ఆర్సీబీ టీమ్‌కు సోషల్‌ మీడియా వేదికగా మొరపెట్టుకున్న సంఘటనలు ఉన్నాయి. విరాట్‌ కోహ్లీ వల్లే ఆర్సీబీకి అంతటి క్రేజ్‌ వచ్చినా.. ఆ టీమ్‌ వల్ల కోహ్లీకి మాత్రం నష్టం జరుగుతుందని కోహ్లీ ఫ్యాన్స్‌ బాధపడిపోతుంటారు. కానీ, ఆర్సీబీ అంటే కోహ్లీ, కోహ్లీ అంటే ఆర్సీబీ అనే ఫీలింగ్‌ బలంగా నాటుకుపోయింది. ఐపీఎల్‌ ఆడినంత కాలం ఆర్సీబీకి తప్ప మరో టీమ్‌కు ఆడేది లేదని కోహ్లీ కూడా ఎప్పుడో తేల్చేశాడు. అయితే.. కోహ్లీ ఐపీఎల్‌ కప్పు ఎత్తాలని కోరుకోని క్రికెట్‌ అభిమాని లేడు.

వారందరి కోరిక ఎప్పుడు తీరుతుందో తెలియదు కానీ, కొంతమంది ఆర్సీబీ అభిమానులు మాత్రం యానిమేటెడ్‌గా కోహ్లీ, ఆర్సీబీ అభిమానుల కలను నిజం చేశారు. ఐపీఎల్‌ ట్రోఫీతో కోహ్లీ అండ్‌ టీమ్‌ సంబురాలు చేసుకుంటున్న ఒక యానిమేటెడ్‌ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. నిజంగా ఎలాగో ఆర్సీబీ కప్పు కొట్టలేకపోతుంది. కనీసం ఇలాగైనా సంతోష పడదాం అంటూ క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఆ వీడియోకు లైక్‌ కొడుతూ.. తెగ షేర్‌ చేస్తున్నారు. కిందున్న ఆ వీడియోను మీరూ చూసి, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: బంతితో పరిగెత్తిన బ్యాటర్.. వెంటపడ్డ కీపర్! వైరలవుతున్న వీడియో

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి