iDreamPost

రూ.2000 నోటుపై మరోసారి కేంద్రం కీలక నిర్ణయం.. ఏంటంటే!

రూ.2000 నోటుపై మరోసారి కేంద్రం కీలక నిర్ణయం.. ఏంటంటే!

2016 నవంబర్ లో రూ.500, రూ.1,000 నోట్లను మోదీ ప్రభుత్వంరద్దు చేసిన విషయం తెలిసిందే. నల్లధనాన్ని నియంత్రించడం, నకిలీ కరెన్సీకి, ఉగ్రవాదులకు నిధుల సరఫరాకు చెక్ పెట్టడం కోసం అలా చేసినట్లు చెప్పుకొచ్చింది. అనంతరం రూ.500, రూ.2,000, రూ.200 నోట్లను ప్రవేశపెట్టిన సంగతి కూడా తెలిసింది.  ఇలా జరుగుతున్న క్రమంలో రూ.2వేల నోటుపై ఇటీవలే కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.2 వేల నోట్లను తిరిగి బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలంటూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా రూ.2000 నోటుపై కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

 రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా కీలక ప్రకట చేసంది. గతంలో రూ.2 వేల నోటుపై తీసుకున్న నిర్ణయంపై మరోసారి ఆప్ డేట్ ఇచ్చింది. రూ.2000 నోటు బ్యాంకులు డిపాడిట్ చేయాలని చెప్పిన తరువాత  దాదాపు చాలా వరకు నోట్లు తిరిగి వచ్చేశాయని ఆర్బీఐ వెల్లడించింది. అంతేకాక పలు కీలక విషయాలను ఆర్బీఐ వెల్లడించింది. రూ.2.72 లక్షల కోట్ల విలువైన బ్యాంక్ నోట్లు తిరిగి బ్యాంకుల్లో వచ్చాయని ఆర్బీఐ వెల్లడించింది. జూన్ 30 నాటికి ఈ మేరకు రూ. 2 వేల నోట్లు వెనక్కి వచ్చాయని తెలిపింది.

ఇకపోతే ప్రజల వద్ద ఇంకా రూ.84 వేల కోట్ల విలువైన రూ.2000 నోట్లు చలామణిలో ఉన్నాయని ఆర్బీఐ వివరణ ఇచ్చింది. ఇక చలామణిలో ఉన్న దాదాపు 76 శాతం వరకు రూ.2 వేల నోట్లు వెనక్కి వచ్చాయని ఆర్బీఐ తెలిపింది.  ప్రజలు వివిధ రూపాల్లో  రూ.2 వేల నోట్లున వినియోగించారని, బ్యాంకులో డిపాజిట్, ఎక్స్చైంజ్ చేసుకోవడం చేశారని వివరించింది. అలానే మరో కీలక అంశాన్ని కూడా ఆర్భీఐ తెలిపింది. ప్రజలు ఇంకా  వారి వద్ద ఉన్న రూ.2 వేల నోట్లను బ్యాంకులకు వచ్చి మార్చుకోవాలని కోరింది. సెప్టెంబర్ 30 తేదీ లోపు పూర్తి చేసుకోవాలని సూచించింది.

ఆర్బీఐ ప్రకారంచూస్తే.. మార్చి నెల చివరకి నాటికి చూస్తే.. వ్యవస్థలో చలామణిలో ఉన్న రూ.2 వేల నోట్ల విలువ రూ.3.62 లక్షల కోట్లుగా ఉంది. అయితే అదే  మే 19 నాటికి చూస్తే..  వీటి విలువ రూ.3.56 లక్షల కోట్లకు తగ్గింది. ఇప్పుడు రూ.2 వేల నోట్లు రూ.84 వేల కోట్లకు దిగింది.  రానున్న రోజుల్లో మిగిలిన రూ.2 వేల నోట్లు కూడా బ్యాంకుల్లో జమ కానున్నాయి. బ్యాంకుల్లోకి వచ్చిన రూ.2 వేల నోట్లను గమనిస్తే.. వీటిల్లో 87 శాతం బ్యాంకు ఖాతాల్లో జమ  అయ్యాయి. ఇక 13 శాతం మాత్రం రూ.2 వేల నోట్లను మార్చుకున్నట్లు ఆర్భీఐ వెల్లడించింది. మరి.. ఆర్బీఐ వెల్లడించిన ఈ సమచారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో  తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి