iDreamPost

Eagle: ఈగల్ సెన్సార్ రిపోర్ట్

  • Published Feb 08, 2024 | 3:31 PMUpdated Feb 08, 2024 | 3:31 PM

మాస్ మహారాజా ఈగల్ సినిమా ఎట్టకేలకు ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి సెన్సార్ రిపోర్ట్ కూడా వచ్చింది. అదేమిటంటే..

మాస్ మహారాజా ఈగల్ సినిమా ఎట్టకేలకు ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి సెన్సార్ రిపోర్ట్ కూడా వచ్చింది. అదేమిటంటే..

  • Published Feb 08, 2024 | 3:31 PMUpdated Feb 08, 2024 | 3:31 PM
Eagle: ఈగల్ సెన్సార్ రిపోర్ట్

సంక్రాంతికి విడుదల కావాల్సిన రవితేజ తాజా చిత్రం ఈగల్ ఎట్టకేలకు ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మాస్ మహారాజ్ రవితేజ నటించిన ఈగల్ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే చివరి నిమిషంలో స్క్రీన్ల కేటాయింపులో సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఈ సినిమా పోటీ నుంచి తప్పుకుంది. రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈగల్ సినిమాకి సెన్సార్ రిపోర్ట్ పాజిటివ్ గా వచ్చిందట.

ఈ మధ్యనే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికేట్ లభించింది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా నిడివి 158 నిమిషాల 37 సెకన్లు. సినిమా చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా సుమారు 23 కోట్లకి జరిగింది.రెండు రోజుల ముందు ఈ సినిమా ఫైనల్ కట్ చూసిన హీరో రవితేజ అవుట్ పుట్ చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యారు. మొదటి నుంచి ఈ సినిమా పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్న ఆయన రీసెంట్ స్క్రీనింగ్ తర్వాత అవుట్ పుట్ పై చాలా సంతోషం వ్యక్తం చేశారు.

అదే విషయాన్ని తన అభిమానులతో సోషల్ మీడియాలో పంచుకున్నారు. యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకి హైలైట్ గా ఉంటాయని గట్టి టాక్ ఏ వినిపిస్తుంది. తాజాగా విడుదలైన రిలీజ్ ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. గతంలో నిఖిల్ తో సూర్య వర్సెస్ సూర్య సినిమా తీసిన కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈగల్ ఈ వారం యాత్ర 2, రజినీకాంత్ లాల్ సలాం సినిమాలతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడనుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ సినిమాని నిర్మించారు. అనుపమ పరమేశ్వరన్, నవదీప్, మధూ, శ్రీనివాస్ అవసరాల, కావ్య థాపర్ కీలక పాత్రలు పోషించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి