iDreamPost

వీడియో: జడేజా ఇన్​స్టా పోస్ట్ వైరల్.. ‘రజాకార్’ మూవీ సాంగ్​​తో..!

  • Published Mar 16, 2024 | 7:46 PMUpdated Mar 16, 2024 | 7:46 PM

డాషింగ్ ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా చెన్నై సూపర్ కింగ్స్​ టీమ్​తో కలిశాడు. ప్రాక్టీస్​లో మునిగిపోయిన జడ్డూ రీసెంట్​గా ఇన్​స్టాలో పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది.

డాషింగ్ ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా చెన్నై సూపర్ కింగ్స్​ టీమ్​తో కలిశాడు. ప్రాక్టీస్​లో మునిగిపోయిన జడ్డూ రీసెంట్​గా ఇన్​స్టాలో పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది.

  • Published Mar 16, 2024 | 7:46 PMUpdated Mar 16, 2024 | 7:46 PM
వీడియో: జడేజా ఇన్​స్టా పోస్ట్ వైరల్.. ‘రజాకార్’ మూవీ సాంగ్​​తో..!

ఐపీఎల్​-2024కు టైమ్ దగ్గర పడుతుండటంతో ఫ్రాంచైజీలన్నీ ప్రాక్టీస్​లో మునిగిపోయాయి. ఆటగాళ్లు జోరుగా సాధన చేస్తుండగా.. టీమ్ మేనేజ్​మెంట్స్ ప్లానింగ్​లో తలమునకలు అయ్యాయి. ఏయే జట్లు ఎలా ఉన్నాయి, ఎవరి మీద గెలవాలంటే ఎలా ఆడాలి? పిచెస్ ఎలా రియాక్ట్ అవుతాయి? టీమ్ కాంబినేషన్ ఎలా ఉంటే బెటర్? అనేది ఆలోచిస్తున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఐపీఎల్ ప్రిపరేషన్స్​ను స్టార్ట్ చేసింది. ఆ టీమ్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గత కొన్ని వారాలుగా ప్రాక్టీస్ చేస్తూ కనిపిస్తున్నాడు. క్రికెట్​కు దూరంగా ఉండటంతో మాహీ టచ్​లోకి రావడానికి టైమ్ తీసుకుంటున్నాడు. మిగతా ఆటగాళ్లంతా ఆల్రెడీ యాక్టివ్ ప్లేయర్స్ కావడంతో ఇప్పుడు జట్టుతో కలిశారు. స్టార్ ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా కూడా తాజాగా సీఎస్​కేతో కలిశాడు.

చెన్నై క్యాంప్​లో జాయిన్ అయిన జడేజా రావడంతోనే ప్రాక్టీస్​కు వెళ్లిపోయాడు. కాళ్లకు ప్యాడ్ కట్టి, చేతులకు గ్లవ్స్ వేసుకొని, బ్యాట్ చేతపట్టి సాధనలో మునిగిపోయాడు. సీఎస్​కే జెర్సీలో తాను ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోను ఇన్​స్టాగ్రామ్​లో అభిమానులతో పంచుకున్నాడు జడ్డూ. అయితే ఈ ఇన్​స్టా స్టోరీలో ఓ తెలుగు పాటను అతడు చేర్చడం విశేషం. రీసెంట్​గా రిలీజై మంచి టాక్​తో దూసుకెళ్తున్న ‘రజాకార్’ సినిమాలోని ‘పోతుగడ్డ మీద భూమి బిడ్డలారా నిద్దరబోతున్నరా’ అనే సాంగ్​ను వాడాడు జడ్డూ. అతడి ఇన్​స్టా పోస్ట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీన్ని చూసిన నెటిజన్స్ జడ్డూ తెలుగు సినిమాలు ఎక్కువగా చూస్తాడని అంటున్నారు. ఈ పాట గురించి తెలియని ఇతర భాషల వాళ్లు ఏ మూవీ సాంగ్ అనేది తెలుసుకునేందుకు సెర్చ్ చేస్తున్నారు. వాళ్లకు ‘రజాకార్’లోని సాంగ్ అని తెలుగు ఫ్యాన్స్ చెబుతున్నారు.

ఇక, తెలంగాణ విముక్తి పోరాటం నేపథ్యంలో సాగే స్టోరీతో ‘రజాకార్’ సినిమా తెరకెక్కింది. ఈ మూవీ రిలీజ్​కు ముందు పొలిటికల్​గా కాంట్రవర్సీ నెలకొంది. అయితే ఎట్టకేలకు మార్చి 15న థియేటర్లలోకి వచ్చేసింది ‘రజాకార్’. తెలంగాణ సాయుధ పోరాటం, నిజాం పాలనలో హైదరాబాద్ సంస్థానంలో ఎలాంటి అరాచకాలు, అకృత్యాలు జరిగాయి లాంటి అంశాలు ఇందులో హైలైట్ చేశారు. నాటి పోరాటానికి అద్భుత తెరరూపంగా ‘రజాకార్​’ను డైరెక్టర్ యాట సత్యనారాయణ రూపొందించారనే ప్రశంసలు అందుకున్నారు. గ్రాఫిక్ వర్క్​కు కూడా మంచి అప్లాజ్ లభించింది. ఈ నేపథ్యంలో ‘రజాకార్’లోని పాటను జడేజా ఇన్​స్టాలో షేర్ చేయడం వైరల్​గా మారింది. ఈ మూవీ రీచ్ పెరగడానికి ఇది దోహదం చేస్తుందని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. మరి.. జడ్డూ ఇన్​స్టా పోస్ట్​ మీద మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: గుజరాత్ టీమ్​లో ఇదీ హార్దిక్ పరిస్థితి.. నెహ్రా కామెంట్​తో అసలు నిజం బయటపడింది!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి