iDreamPost

Ravichandran Ashwin: 500 వికెట్ల క్లబ్ లో అశ్విన్.. ఈ రికార్డు ఎవరికి అంకితం ఇచ్చాడో తెలుసా?

ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ లో రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. ఇక ఈ రికార్డును ఓ వ్యక్తికి అంకితం ఇచ్చాడు ఈ స్టార్ స్పిన్నర్.

ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ లో రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. ఇక ఈ రికార్డును ఓ వ్యక్తికి అంకితం ఇచ్చాడు ఈ స్టార్ స్పిన్నర్.

Ravichandran Ashwin: 500 వికెట్ల క్లబ్ లో అశ్విన్.. ఈ రికార్డు ఎవరికి అంకితం ఇచ్చాడో తెలుసా?

రాజ్ కోట్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ లో అరుదైన ఘనత సాధించాడు టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఓపెనర్ జాక్ క్రాలే వికెట్ తీయడం ద్వారా టెస్ట్ కెరీర్ లో 500 వికెట్ల క్లబ్ లో చేరాడు. 98వ టెస్ట్ లో ఈ ఘనత సాధించాడు ఈ స్టార్ స్పిన్నర్. ఇదిలా ఉండగా.. మ్యాచ్ ముగిసిన అనంతరం మాట్లాడిన అతడు ఈ రికార్డును ఒకరికి అంకితం ఇస్తున్నట్లుగా చెప్పాడు. మరి అశ్విన్ ఈ ఘనతను ఎవరికి అంకితం ఇచ్చాడో చూద్దాం.

రవిచంద్రన్ అశ్విన్.. టీమిండియా వెటరన్ స్పిన్నర్ గా జట్టుకు తిరుగులేని విజయాలను అందించాడు. ఈ క్రమంలోనే ఎన్నో గనతలను తన పేరిట లిఖించుకున్నాడు. తాజాగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ లో కూడా ఓ అరుదైన ఫీట్ ను సాధించాడు అశ్విన్. ఇంగ్లాండ్ ఓపెనర్ జాక్ క్రాలే వికెట్ పడగొట్టడంతో టెస్ట్ ల్లో 500 వికెట్ల మార్క్ ను చేరుకున్నాడు. 98వ టెస్ట్ మ్యాచ్ లో ఈ ఘనతను నెలకొల్పాడు. ఇక రెండో రోజు ఆటముగిసిన తర్వాత మాట్లాడిన అశ్విన్ ఎమోషనల్ అయ్యాడు. “నేను సాధించిన ఈ 500వ వికెట్ ను మా నాన్నకు అంకితం ఇస్తున్నాను. ఆయన నా ఎదుగుదలలో ఎంతో తోడ్పడ్డాడు. ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని, నా కలను నెరవేర్చారు. అందుకే ఈ రికార్డును మా నాన్నకి అంకితం ఇస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు అశ్విన్.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 445 వికెట్లకు ఆలౌట్ కాగా.. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ బజ్ బాల్ ఆటతీరుతో ధీటైన జవాబు ఇస్తోంది. రెండో రోజు ఆటముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. క్రీజ్ లో సెంచరీ హీరో బెన్ డకెట్ (133*), జో రూట్(9) బ్యాటింగ్ చేస్తున్నారు. ఇంగ్లాండ్ ఇంకా 238 పరుగుల వెనకబడి ఉంది. మరి తాను సాధించిన రికార్డును తండ్రికి అంకితం ఇచ్చిన రవిచంద్రన్ అశ్విన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: Ranji Trophy 2024: శార్ధూల్ ఠాకూర్ సంచలనం.. బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి