iDreamPost

RaviTeja: కారంపూడిలో వృద్ధ మహిళలను కలిసిన రవితేజ

  • Published Feb 02, 2024 | 1:03 PMUpdated Feb 02, 2024 | 1:03 PM

ప్రతి పబ్లిక్ ఈవెంట్ లో వారి గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంటారు. తన సినిమాల విడుదలకు ముందు తరచూ వారిని కలుస్తుంటారు. ఇటీవలే అలాంటి ప్రత్యేకమైన అభిమానాన్ని మరోసారి పొందారు రవితేజ.

మాస్ మహారాజా రవితేజ తనను ఆరాధించే వారికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. తన అభిమానులను ఆయన ఒక కుటుంబంలా చూసుకుంటూ ప్రతి పబ్లిక్ ఈవెంట్ లో వారి గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంటారు. తన సినిమాల విడుదలకు ముందు తరచూ వారిని కలుస్తుంటారు. ఇటీవలే అలాంటి ప్రత్యేకమైన అభిమానాన్ని మరోసారి పొందారు రవితేజ.

మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో హరీష్ శంకర్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నటిస్తున్న తాజా చిత్రం మిస్టర్ బచ్చన్ షూటింగ్ కారంపూడిలో జరుగుతున్న సంగతి తెలిసిందే.

కాగా అక్కడికి విహారయాత్రకు వచ్చిన 70+ వృద్ధ మహిళలు రవితేజను కలిసే అవకాశం ఉందా అని చిత్ర బృందాన్ని అడిగారు. ఈ విషయం తెలుసుకున్న రవితేజ నిన్న షూటింగ్ ముగించుకుని వారి ఇంటికి వెళ్లారు. డిన్నర్ పూర్తయ్యే వరకు వేచి చూసిన ఆయన ఆ తర్వాత వారితో ఫొటోకు ఫోజులిచ్చారు. డిన్నర్ ముగించుకుని ఫొటోకు ఫోజులిచ్చే వరకు ఎందుకు వెయిట్ చేశారని ప్రశ్నించగా.. వారంతా సీనియర్ సిటిజన్స్ అని, జీవితాంతం ఇది మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుందని సమాధానమిచ్చారు. రవితేజ బంగారు మనసున్న వ్యక్తి అని ఈ సంఘటన రుజువు చేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి