iDreamPost

Eagle Trailer: విధ్వంసం నేను.. గూస్‌బమ్స్‌ తెప్పిస్తున్న ‘ఈగల్‌’ డైలాగులు!

ఈగల్‌ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల మందుకు రానుంది. జనవరి 13న థియేటర్లలో సందడి చేయనుంది. ఇక, బుధవారం ఈగల్‌ మూవీ ట్రైలర్‌ విడుదల అయింది.

ఈగల్‌ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల మందుకు రానుంది. జనవరి 13న థియేటర్లలో సందడి చేయనుంది. ఇక, బుధవారం ఈగల్‌ మూవీ ట్రైలర్‌ విడుదల అయింది.

Eagle Trailer: విధ్వంసం నేను.. గూస్‌బమ్స్‌ తెప్పిస్తున్న ‘ఈగల్‌’ డైలాగులు!

మాస్‌ మహారాజా రవితేజ మోస్ట్‌ అవేటెడ్‌ మూవీ ‘ ఈగల్‌’ విడుదలకు సిద్ధంగా ఉంది. సంక్రాంతి కానుకగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరి 13వ తేదీన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. వాయిదా పడుతూ వచ్చిన ఈగల్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ కావటంతో రవితేజ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొద్దిరోజుల క్రితం విడుదలైన ఈగల్‌ టీజర్‌ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇప్పుడు ఈగల్‌ నుంచి మరో అప్‌డేట్‌ వచ్చింది. బుధవారం సాయంత్రం ట్రైలర్‌ విడుదల అయింది.

ట్రైలర్‌ ఎలా ఉందంటే.. 

‘‘తుపాకీ నుంచి వచ్చే బుల్లెట్లు ఆగేది ఎప్పుడో తెలుసా?.. దాన్ని పట్టుకున్న వాడిని బుల్లెట్‌ తాకినపుడు’’ అన్న డైలాగ్‌తో ట్రైలర్‌ మొదలవుతుంది. రెండు నిమిషాల పదకొండు సెకన్ల ట్రైలర్‌ మొత్తం గూస్‌బమ్స్‌ తెప్పించే డైలాగులే ఎక్కువగా ఉన్నాయి. ట్రైలర్‌ మొదటినుంచి చివరి వరకు యాక్షన్‌ సీక్వెన్స్‌లే ఉన్నాయి. గన్నులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కనికరం లేని హంతకుడి పాత్రలో రవితేజ కనిపించనున్నారు. ట్రైలర్‌లో కథ ఏంటో చెప్పకపోయినా.. కాస్త రివేంజ్‌ డ్రామాకు స్కోప్‌ ఉన్న స్టోరీగా కనిపిస్తోంది.

ట్రైలర్‌లోని అద్బుతమైన డైలాగులు.. 

  • విషం మింగుతాను.. విశ్వం తిరుగుతాను.. ఊపిరి ఆపుతాను.. కాపలా అవుతాను.. విధ్వంసం నేను.. విధ్వంసాన్ని ఆపే వినాశనం నేను..
  • మేమ్‌ లాస్ట్‌ టెన్‌ ఇయర్స్‌లో ఇలాంటి ఫాంటసీ యాక్షన్‌ స్టోరీస్‌ ఎప్పుడూ వినలేదు.
  • ఏమిరా వీడు దేశం మొత్తం ఖయ్యం పెట్టుకున్నాడా? ఏమి?
  • వీళ్లను కంగారుపెట్టింది. మొత్తం ప్రాంతం కాదు.. ఆ ప్రాంతాన్ని పండించిన వాడు.

కాగా, ఈగల్‌ సినిమాలో రవితేజకు జంటగా కావ్య థపర్‌ నటించారు. అనుపమా పరమేశ్వరన్‌, నవదీప్‌, శ్రీనివాస్‌ అవసరాల, మధుబాల కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. దేవ్‌జాద్‌ సంగీతం అందించారు. ప్రముఖ నిర్మాత సంస్థ పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ ఈగల్‌ను తెరకెక్కించింది. అయితే, ఈగల్‌ సినిమాకు సంక్రాంతికి గట్టి పోటీ ఉంది. వరుసలో తెలుగు స్టార్‌ హీరోల సినిమాలు ఉన్నాయి. మహేష్‌ బాబు గుంటూరు కారం, వెంకటేష్‌ సైంధవ్ సినిమాలు సంక్రాంతికే విడుదల కానున్నాయి.

వీటితో పాటు ప్యాన్‌ ఇండియా చిత్రం ‘హనుమాన్‌’ కూడా అప్పుడే విడుదల కానుంది. వీటన్నటి పోటీ తట్టుకుని రవితేజ కలెక్షన్లు రాబట్టడం కష్టమేనని సినిమా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఫస్ట్‌ డే కలెక్షన్లపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. మరి, ఈగల్‌ సినిమా ట్రైలర్‌పై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి