iDreamPost

Eagle: హింట్ కూడా లేదు.. ఏంటా పాయింట్? ‘ఈగల్’ సస్పెన్స్!

మాస్ మహారాజ్ రవితేజ మరోమారు బాక్సాఫీస్ మీదకు దండెత్తేందుకు సిద్ధమయ్యారు. ఆయన యాక్ట్ చేసిన ‘ఈగల్’ మూవీ ఈ శుక్రవారం బిగ్ స్క్రీన్స్​లోకి వచ్చేస్తోంది.

మాస్ మహారాజ్ రవితేజ మరోమారు బాక్సాఫీస్ మీదకు దండెత్తేందుకు సిద్ధమయ్యారు. ఆయన యాక్ట్ చేసిన ‘ఈగల్’ మూవీ ఈ శుక్రవారం బిగ్ స్క్రీన్స్​లోకి వచ్చేస్తోంది.

Eagle: హింట్ కూడా లేదు.. ఏంటా పాయింట్? ‘ఈగల్’ సస్పెన్స్!

అదిరిపోయే ఎలివేషన్స్.. మైండ్ బ్లోయింగ్ డైలాగ్స్.. ఇప్పటి వరకూ చూడని గెటప్.. కళ్లు చెదిరిపోయే విజువల్స్.. ఎక్కడా రాజీపడని హయ్యెస్ట్ బడ్జెట్.. ఈ ఉపోద్ఘాతం దేని గురించని అనుకుంటున్నారా? రేపు అంటే ఫిబ్రవరి 9న విడుదల కాబోతున్న మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ స్టారర్ ‘ఈగల్’ గురించి. కొన్ని సూపర్ హిట్స్ విషయంలో సాధారణంగా కనిపించే కామన్ ఫీచర్స్.. ఎవరిమట్టుకు వాళ్లు చాలా కాన్ఫిడెంట్​గా ఉండడం, మాట్లాడడం. అలాగే నిజాయితీగా అందులో మెరిట్స్​ను ఫ్రీగా, జంకూబొంకూ లేకుండా డిస్కస్ చేయడం. వాటికి సరిపోయేట్టు ట్రైలర్స్, టీజర్స్.. ప్రీ రిలీజ్ ఈవెంట్​లో కంప్లీట్ సెలబ్రేషన్స్.. సంబురాల వాతావరణం.

ఇలాంటివి ప్రతీ సినిమాకి నిర్మాత లక్షలు వెచ్చించి చేసేవే అనుకోండి. కానీ ఎక్కడో ఓవర్ డోసో, ఓవర్ బిల్డప్పో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. కానీ ‘ఈగల్’ మూవీ విషయంలో మాత్రం అన్నీ మోస్ట్ నేచురల్​గా కనిపించాయి. చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద తిరుగులేని బడ్జెట్​తో నిర్మించిన ‘ఈగల్’ సినిమా సెటప్ అండ్ గెటప్ చూస్తే మాత్రం ఫిల్మ్​లో పాటలా ‘వచ్చాడంటే మోతరా.. విధ్వంసాల మోతరా’ అనేలా ఉంది. ఇదేదో బాక్సాఫీసును విధ్వంసం చేయడం గ్యారెంటీ అనిపిస్తోంది. ఇందులో సస్పెన్స్ పాయింట్ ఏంటంటే.. ‘ఈగల్’ స్టోరీలో మెయిన్ ఎలిమెంట్ ప్రపంచం అంతటికీ సరిపోతుందని, ఆయుధం కరెక్ట్ పర్సన్ చేతిలో ఉంటే తప్ప రాంగ్ పర్సన్ చేతిలో ఉంటే అది వినాశనానికి దారి తీస్తుందని రచయిత మణిబాబు చెప్పారు. డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని కూడా అదే చెప్పుకొచ్చారు.

raviteja eagle movie

‘ఈగల్’ రిలీజ్ ముందు ఇంతకన్నా చెప్పలేరు కదా.. అదేంటన్నది ప్రస్తుతానికి రివీల్ కానిది. హింట్ కూడా లేదు. కానీ ట్రైలర్, టీజర్ చూస్తుంటే మాత్రం గూస్​బంప్స్ వస్తున్నాయి. టోటల్ వైలెన్స్.. యాక్షన్.. వాళ్లూ, వీళ్లూ కాదు, దేశం మొత్తం వచ్చినా అపుతాను అనే రవితేజ డైలాగ్.. ఇవన్నీ చూస్తుంటే మాత్రం ఇదేదో ఇంటర్నేషనల్ పాయింట్ మీద తీసిందని కొంతవరకూ అర్థమవుతోంది. అందుకే రచయిత మణిబాబు ఐ డ్రీమ్ ఇంటర్వూలో ఓ ప్రశ్నకు సమాధానంగా పాన్ ఇండియా రిజల్ట్ బట్టి ప్రపంచ భాషల్లోకి కూడా ‘ఈగల్’ను డబ్ చేసి విడుదల చేయడానికి అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డాడు.

వ్యక్తిగతంగా హీరో రవితేజ మొన్నీ మధ్యన జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్​లో ముందస్తుగానే దర్శకుడికి, సంగీత దర్శకుడికి కంగ్రాట్స్ చెప్పారు. ఈ సందర్భంగా తన పాత్రపై టెరిఫిక్ కాన్ఫిడెన్స్ ఎక్స్​ప్రెస్ చేశారు. తన మేకోవర్ మీద కూడా ఎంతో సంతృప్తి వ్యక్తం చేశారు. ఇది చాలా అరుదుగా కనిపించే సంగతి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి టీజీ విశ్వప్రసాద్ బాక్సాఫీసును పేల్చడానికి తయారు చేసిన న్యూక్లియర్ బాంబులా ‘ఈగల్’ కనిపిస్తోంది.. అనిపిస్తోంది.. వినిపిస్తోంది. మరి.. ‘ఈగల్’ మూవీ చూసేందుకు మీరెంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి