iDreamPost

ఐటి అధికారుల ఎదుట ఆ హీరోయిన్ హాజరు

ఐటి అధికారుల ఎదుట ఆ హీరోయిన్ హాజరు

హీరోయిన్ రష్మిక మందాన ఆదాయపు పన్ను శాఖ అధికారుల ముందు హాజరై తన ఆస్తులకు సంబంధించి వారు అడిగిన వివరాలు సమర్పించారు. ఇటీవల ఆమె నివాసం మీద అధికారులు దాడులు చేసిన సంగతి తెలిసిందే.ఆ తరువాత వారు నోటీసులు జారీ చేయగా మైసూరులోని నజర్ బాద్ లో ఉన్న ఆదాయపు పన్నుశాఖ ప్రిన్సిపల్ కార్యాలయానికి వచ్చిన రష్మిక, అధికారులకు పూర్తి సమాచారాన్ని అందించారు. రష్మికతో పాటు ఆమె తండ్రి మదన్, మరో తొమ్మిది మంది సిబ్బంది హాజరయ్యారు. గతంలో దాడుల సందర్భంగా ఐటి అధికారులు ఆమె బ్యాంక్ ఖాతాలతో పాటు నిర్మించడానికి సిద్ధంగా ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్ కు చెందిన డాక్యుమెంట్లు, పెట్రోల్ బంక్ లావాదేవీలు, కొత్తగా కొన్న టీ ఎస్టేట్ లావాదేవీల్ని పరిశీలించారు. ఇందులో భాగంగా రూ.3.94 కోట్ల ఆస్తుల్ని సీజ్ చేశారు. వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు సమర్పించాల్సిందిగా సమన్లు ఇచ్చారు.

Read Also: రష్మీక ఇంటి పై ఐటి దాడులు

25 లక్షల రూపాయల నగదుతో పాటు కోటిన్నర విలువు కలిగిన ఆస్తికి సంబంధించి రష్మిక.. ఆదాయపు పన్ను చెల్లించలేదని చెబుతున్నారు ఐటీ అధికారులు. అయితే కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం ఆ 25 లక్షల్ని ఇచ్చామని రష్మిక తండ్రి మదన్ వెల్లడించారు. ఐటీ అధికారులు గుర్తించిన 2 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తిపై మాత్రం ఆయన స్పందించలేదు.

రష్మికకు 2 పాన్ కార్డులు ఉన్నట్టు గుర్తించారు అధికారులు. వాటిలో ఒక పాన్-కార్డ్ కు సంబంధించి 2017 వరకు పన్నులు చెల్లించినట్టు చెబుతున్నారు. మరో పాన్ కార్డుకు సంబంధించిన వివరాలు మాత్రం బయటకురాలేదు. వరుస హిట్ల తో మంచి ఫామ్ లో ఉన్న హీరోయిన్ కు ఇలాంటి తలనొప్పులు చిక్కులు సాధారణమే అని అంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి