iDreamPost

ఆచార్య ఆర్ఆర్ఆర్ తర్వాత ఇదే

ఆచార్య ఆర్ఆర్ఆర్ తర్వాత ఇదే

ఇండియన్ 2 తో రేగిన వివాదం వల్ల దర్శకుడు శంకర్ రామ్ చరణ్ తో చేయాల్సిన సినిమా ఆలస్యమవుతుందేమో అని టెన్షన్ పడ్డ అభిమానులకు మొత్తానికి ఒక గుడ్ న్యూస్ అందింది. లేట్ లేకుండానే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. నిన్న ఈ ప్రాజెక్ట్ గురించే చెన్నై లో నిర్మాత దిల్ రాజుతో పాటు హీరో రామ్ చరణ్ తో కలిసి శంకర్ ప్రత్యేకంగా చర్చల్లో పాల్గొన్నట్టు సమాచారం. మొత్తం నిర్మాణానికి సుమారు ఇరవై నెలల దాకా శంకర్ టైం అడిగారని దానికి తగ్గట్టే రామ్ చరణ్ ఇతర సినిమాలు ఏవి కమిట్ కావాలో నిర్ణయించుకునే విధంగా ప్లానింగ్ చేసుకోవాలని ఇందులో సూచించినట్టు తెలిసింది.

ఎప్పుడూ లేని విధంగా చరణ్ వి ఈ ఏడాది రెండు సినిమాలు రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆచార్య కేవలం ఇంకో రెండు వారాల వర్క్ మాత్రమే పెండింగ్ ఉంది. ఆర్ఆర్ఆర్ కూడా ఇంచుమించు ఇదే స్థితిలో మహా అయితే వచ్చే నెలలోగా పూర్తి చేసుకునే టార్గెట్ తో పనిచేస్తోంది . ఒకవేళ అంతా అనుకూలమై థియేటర్లు కనక వంద శాతం ఆక్యుపెన్సీతో నడిస్తే ఈజీగా ఆచార్య ఆర్ఆర్ఆర్ రెండూ ప్రేక్షకులను పలకరిస్తాయి. ఇప్పటికైతే ఆర్ఆర్ఆర్ డేట్ లో ఎలాంటి మార్పు లేదు. పోస్టర్లు ఏవి వదిలినా అందులో టైటిల్ కింద అక్టోబర్ 13 అనే పెడుతున్నారు. సో పోస్ట్ పోన్ చేసే ఆలోచనలు లేనట్టే.

ఇప్పుడు శంకర్ ప్రాజెక్ట్ ఎంత కాలం పడుతుందనేది చరణ్ కు చాలా కీలకం. ఇప్పటికే వినయ విధేయ రామ తర్వాత పెద్ద గ్యాప్ వచ్చేసింది. కావాలని చేసింది కాకపోయినా భారీ మార్కెట్ ఉన్న తను ఇంత ఆలస్యంగా సినిమాలు చేయడం అభిమానులకే కాదు థియేటర్ వర్గాలకు కూడా ఇబ్బంది కలిగించే అంశమే. పెద్ద హీరోల చిత్రాలు ఎన్ని ఎక్కువ వస్తే బాక్సాఫీస్ అంత ఎక్కువగా కళకళలాడే ఛాన్స్ ఉంటుంది.అలా కాకుండా ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, చరణ్, మహేష్, బన్నీ లాంటి ఇప్పటి జెనరేషన్ హీరోలు సైతం గ్యాప్ మైంటైన్ చేయడం కరెక్ట్ కాదు. శంకర్ సినిమాకు మరో కొత్త ప్రకటన త్వరలోనే రావొచ్చని టాక్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి