iDreamPost

RRR for Oscars 2023: బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీ పోటీలో రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్!

RRR for Oscars 2023:  బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీ పోటీలో రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్!

ఆస్కార్ 2023లో ఇండియాకు ఒక అవార్డు గ్యారంటీయేన‌ని, ఒక హాలీవుడ్ ఫిల్మ్ పోర్టల్ అంచ‌నావేసింది., SS రాజమౌళి సినిమా, ఆర్ఆర్ఆర్( RRR)ను ఇండియా త‌రుపున‌, అధికారిక ఎంట్రీగా పంపితే, ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగం (Best International Feature Film) లో గెలవడానికి మంచి అవ‌కాశం ఉంద‌ని అంటోంది.

ఎస్ఎస్ రాజమౌళి RRR సినిమా హాలీవుడ్ ను గ‌ట్టిగా ఆకర్షించింది. మార్వెల్ ఫిల్మ్స్‌కు హార్డ్ ఫ్యాన్స్ కూడా, RRRని న‌మ్మ‌ద‌గ‌ని సినిమా అనుభ‌వంగా వ‌ర్ణింనించారు. ఇప్పుడు, www.indiewire.com RRR 2023లో ఆస్కార్ అవార్డును గెలుచుకోవచ్చని అంచావేస్తోంది. ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో పోటీప‌డితే , ఫైన‌ల్స్ వ‌ర‌కు తిరుగులేకుండా ఆర్ఆర్ఆర్ వ‌స్తుంద‌ని అంటోంది. కొన్ని వారాలుగా హాలీవుడ్ నిర్మాత‌లు, డైరెక్ట‌ర్లు RRR మెచ్చుకొంటున్నారు. అంతెందుకు డాక్టర్ స్ట్రేంజ్ (Doctor Strange) డైరెక్టర్ స్కాట్ డెరిక్సన్, తన పుట్టినరోజున RRR చూశానని, బాగా న‌చ్చింద‌ని ట్వీట్ చేశాడు.

అలాగే, గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ(guardian of the galaxy) సృష్టిక‌ర్త‌ జేమ్స్ గన్ కూడా ఈ చిత్రాన్ని పొగ‌డ‌కుండా ఉండ‌లేక‌పోయాడు. సినిమా చూశానని, పూర్తిగా నచ్చిందని చెప్పాడు. హాలీవుడ్ క్రిటిక్స్ కూడా ఎస్ఎస్ రాజమౌళిపై ప్రశంసలు కురిపించారు.

అంద‌రూ చెప్పేది ఒక్క‌టే ఈసారి ఆస్కార్ అవార్డ్ బ‌రిలో, ఆర్ఆర్ఆర్ కు పోటీ త‌క్కువ‌. ఆస్కార్ కొట్టే ఛాన్స్ ఉంది. అత్తమ అంతర్జాతీయ చలనచిత్రం కోసం ఆర్ఆర్ఆర్ తో పోటీప‌డుతున్న ఇతర సినిమాలు ‘హోలీ స్పైడర్’ (డెన్మార్క్)(Holy Spider), ‘ వన్ ఫైన్ మార్నింగ్’ (ఫ్రాన్స్)(One Fine Morning), ‘బోత్ సైడ్ ఆఫ్ ది బ్లేడ్’ (ఫ్రాన్స్)(‘Both Sides of the Blade), ‘కోర్సేజ్’ (ఆస్ట్రియా)(Corsage), ‘డిసిషన్ టు లీవ్’ (కొరియా)(Decision to Leave), ‘టోరి అండ్ లోకితా’ (బెల్జియం)(ori and Lokita), ‘ఉతమా’ (బొలీవియా)(Utama).

ఇంకో సంగ‌తి, ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ను స్ల‌మ్ డాగ్ మిలియ‌నీర్(Slumdog Millionaire) తో పోలుస్తున్నారు. అన్నీ క‌ల‌సి వ‌స్తే, ఎనిమిది ఆస్కార్‌లను గెలుచుకున్న డానీ బోయిల్ యొక్క స్లమ్‌డాగ్ మిలియనీర్ లాగ‌, RRR కూడా సాంకేతిక విభాగాలలో ఆస్కార్స్ గెల్చుకోవ‌చ్చ‌ని IndieWire అంటోంది.

కాక‌పోతే, అస్కార్ అవార్డు సాధించాలంటే ఆర్ఆర్ఆర్ ను ఆస్కార్‌కి పంపేలా జ్యూరీని ప్రభావితం చేయాలి. అక్క‌డ నుంచి హాలీవుడ్ లో లాబీయింగ్ చేయాలి. అంటే, ఆర్ఆర్ఆర్ ను చూసేలా వాళ్ల‌ను ఒప్పించాలి. చూస్తేనే క‌దా వాళ్ల‌కు న‌చ్చేది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి