iDreamPost

SSMB29: మహేష్ మూవీ నుంచి క్రేజీ అప్​డేట్.. ఆయనతో​ డైలాగ్స్ రాయిస్తున్న రాజమౌళి!

ఎస్ఎస్ రాజమౌళి-సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో హాలీవుడ్ రేంజ్ లో ఓ చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కథ ఇప్పటికే పూర్తికాగా.. ఇప్పుడు డైలాగ్ రైటర్ కూడా ఎవరో తెలిసిపోయింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ఎస్ఎస్ రాజమౌళి-సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో హాలీవుడ్ రేంజ్ లో ఓ చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కథ ఇప్పటికే పూర్తికాగా.. ఇప్పుడు డైలాగ్ రైటర్ కూడా ఎవరో తెలిసిపోయింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

SSMB29: మహేష్ మూవీ నుంచి క్రేజీ అప్​డేట్.. ఆయనతో​ డైలాగ్స్ రాయిస్తున్న రాజమౌళి!

SS రాజమౌళి.. భారతీయ అగ్రదర్శకులలో ఒకడిగా ఎనలేని గుర్తింపు సంపాదించుకున్నాడు. గుండు పిన్ను సీన్ అయినా గుండెలకు హత్తుకునేలా తీస్తాడు ఈ స్టార్ డైరెక్టర్. అందుకే రాజమౌళిని ముద్దుగా జక్కన్న అని పిలుచుకుంటారు అభిమానులు. ప్రతీ ఫ్రేమ్ పక్కాగా ఉండాలని, ప్రేక్షకులను మెస్మరైజ్ చేయాలని ఆయన తపన. ఇక లేటెస్ట్ గా జక్కన్న నుంచి రాబోయే చిత్రం SSMB29. సూపర్ స్టార్ మహేష్ తో అమెజాన్ అడవుల్లో అడ్వెంచరల్ మూవీని తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. స్క్రిప్ట్ పనులు ఇప్పటికే పూర్తి కాగా.. ఇక ఇప్పుడు డైలాగ్ వెర్షన్ పై దృష్టిపెట్టారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు డైలాగ్ రైటర్ ఎవరో తెలిసిపోయింది.

SSMB29.. టాలీవుడ్ తో పాటుగా ఇండియన్ సినీ అభిమానులు ఎంతో ఆసక్తికగా ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. ఇద్దరు బిగ్ స్టార్స్ ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నారు. డైరెక్టర్ రాజమౌళి-మహేష్ బాబు కాంబోలో రాబోతున్న ఈ మూవీ నుంచి తాజాగా మరో అప్డేట్ వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే కథ పూర్తి అయ్యిందని స్వయంగా జక్కన్నే చెప్పుకొచ్చాడు. ఇక మిగిలిన డైలాగ్ వెర్షన్ కోసం డైలాగ్ రైటర్ ను వెతికే పనిలో పడిపోయారు రాజమౌళి. తాజాగా ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్న విషయం ఏంటంటే?

Crazy update from Mahesh movie

ఈ మూవీకి డైలాగ్ రైటర్ దొరికేశాడట. ప్రముఖ మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా ఈ చిత్రానికి మాటలు రాయబోతున్నట్లు సమాచారం. పదునైన మాటలను షార్ప్ గా రాయడంలో దిట్ట సాయి మాధవ్ బుర్రా. ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఈ స్టార్ రైటర్ మాటలు రాశారు. దీంతో మరోసారి తమ కాంబినేషన్ ను సూపర్ స్టార్ మూవీ కోసం రిపీట్ చేయనున్నాడట జక్కన్న. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక సమాచారం రావాల్సి ఉంది. గుండెల్ని పిండేసే సంభాషణలు అలవోకగా రాయగలడు సాయి మాధవ్. ఈ విషయం ఇప్పటికే ఎన్నో సినిమాల ద్వారా నిరూపితం అయ్యింది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: పులి పిల్లతో ఆడుతున్న ఆ పిల్లాడు.. ఇప్పుడు ఇండస్ట్రీని ఊపేస్తునాడు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి