iDreamPost

ఊహించని కాంబో.. ప్రయోగాల డైరెక్టర్ కు చరణ్ ఛాన్స్? థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే!

ప్రయోగాలు చేసే డైరెక్టర్ తో ఓ సినిమా చేయబోతున్నాడట టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్. ఈ ఊహించని కాంబో పడితే.. థియేటర్లు తగలడిపోవాల్సిందే అంటున్నారు అభిమానులు. ఆ వివరాల్లోకి వెళితే..

ప్రయోగాలు చేసే డైరెక్టర్ తో ఓ సినిమా చేయబోతున్నాడట టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్. ఈ ఊహించని కాంబో పడితే.. థియేటర్లు తగలడిపోవాల్సిందే అంటున్నారు అభిమానులు. ఆ వివరాల్లోకి వెళితే..

ఊహించని కాంబో.. ప్రయోగాల డైరెక్టర్ కు చరణ్ ఛాన్స్? థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే!

ఇండస్ట్రీలో ప్రయోగాలు చేసే డైరెక్టర్లు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారికి హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ఫ్యాన్ బేస్ ఉంటుంది. కథా బలమున్న చిత్రాలే ఈ డైరెక్టర్ల పని. తాజాగా ఇలాంటి ఓ ప్రయోగాలు చేసే డైరెక్టర్ తో ఓ సినిమా చేయబోతున్నాడట టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్. ఈ ఊహించని కాంబో పడితే.. థియేటర్లు తగలడిపోవాల్సిందే అంటున్నారు అభిమానులు. మరి ప్రయోగాలు చేసే ఆ దర్శకుడు ఎవరు? తెలుసుకుందాం పదండి.

రామ్ చరణ్.. RRR మూవీ తర్వాత గ్లోబర్ రేంజ్ కు చేరుకుంది అతడి ఫ్యాన్ బేస్. దీంతో తన నెక్ట్స్ మూవీలకు కూడా అదే రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేసుకుంటూ ముందుకువెళ్తున్నాడు. అందులో భాగంగా ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ లో నటిస్తున్నాడు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ చిత్రం.. షూటింగ్ చివరి దశలో ఉంది. మరోవైపు బుచ్చిబాబు డైరెక్షన్ లో కూడా చరణ్ ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లో రా అండ్ రస్టిక్ గా వస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

ఈ నేపథ్యంలో రామ్ చరణ్ మరో క్రేజీ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పినట్లు ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఈ కాంబినేషన్ అసలు ఎవరూ ఊహించలేరు. తమిళ స్టార్ డైరెక్టర్, విలక్షణ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న వెట్రిమారన్ తో చరణ్ మూవీ చేయబోతున్నాడట.  ఈమధ్యే చరణ్ కు ఓ లైన్ వినిపించాడట వెట్రిమారన్. ఆ లైన్ చరణ్ కు కూడా విపరీతంగా నచ్చి, ఒకే చెప్పేశాడట. ఈ వార్త ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. కమర్షియల్ చిత్రాలకు దూరంగా ఉంటూ..

కథా బలం ఉన్న మూవీలను తీస్తూ.. ప్రత్యేక ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నాడు వెట్రిమారన్. విసారణై, విడుదలై, వడచెన్నై, అసురన్ లాంటి కథా బలమున్న చిత్రాలను తీసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. దాంతో చరణ్ కోసం కూడా ఇలాంటి రా అండ్ రస్టిక్ కథనే రాసి ఉంటాడని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. రామ్ చరణ్-వెట్రిమారన్ కాంబోలో సినిమా పడితే.. మరో రంగస్థలం అవ్వడం ఖాయం అని, థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందేనని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి తన ప్రయోగాలతో సపరేట్ ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్న వెట్రిమాన్ డైరెక్షన్ లో చరణ్ సినిమా చేస్తే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి