iDreamPost

ఆస్పత్రిలో చేరిన రాఖీ సావంత్.. అపస్మారక స్థితిలో?

  • Published May 15, 2024 | 11:14 AMUpdated May 15, 2024 | 11:14 AM

Rakhi Sawant Hospitalized: సోషల్ మీడియాలో రాఖీ సావంత్ తన అందాలు, వింత వింత డ్రెస్సులు అవుట్ ఫీట్స్ లో ప్రదర్శిస్తూ ట్రెండింగ్ లో ఉంటుంది.

Rakhi Sawant Hospitalized: సోషల్ మీడియాలో రాఖీ సావంత్ తన అందాలు, వింత వింత డ్రెస్సులు అవుట్ ఫీట్స్ లో ప్రదర్శిస్తూ ట్రెండింగ్ లో ఉంటుంది.

  • Published May 15, 2024 | 11:14 AMUpdated May 15, 2024 | 11:14 AM
ఆస్పత్రిలో చేరిన రాఖీ సావంత్.. అపస్మారక స్థితిలో?

ఇటీవల సినీ ఇండస్ట్రీలో సెలబ్రెటీలు పలు అనారోగ్య సమస్యలతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఇందులో చాలా వరకు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నవారు.. క్యాన్సర్ ఇతర కారణాల వల్ల హాస్పిటల్ పాలవుతున్నారు. మరికొంతమంది ఇతర అనారోగ్య సమస్యల వల్ల హాస్పిటల్స్ లో చేరి చికిత్స పొందుతున్నారు. బాలీవుడ్ హాట్ బ్యూటీ రాకీ సావంత్ గురించి తెలియని వారు ఉండరు. ఎప్పుడూ ఏదో ఒక వివాదాలతో వార్తల్లో నిలిచే ఆమె మరోసారి వార్తల్లో నిలిచారు. కాకపోతే ఈ సారి ఏ వివాదంలో కాదు.. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి. ప్రస్తుతం రాఖీ సావంత్ తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమెకు ఏం జరిగిందన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్ లో మోడల్ గా ఎంట్రీ ఇచ్చిన రాఖీ సావంత్ తర్వాత బుల్లితెరపై పలు షోలతో బాగా పాపులర్ అయ్యింది. హాట్ లుక్ తో కుర్రాళ్ల మనసు దోచిన రాఖీ సావంత్ పలు ప్రైవేల్ ఆల్బామ్స్ లో నటించింది. అంతేకాదు సినిమాల్లో ఐటమ్స్ సాంగ్స్ తో ఉర్రూతలూగించింది. బాలీవుడ్ బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి తెగ హల్ చల్ చేసింది. సెలబ్రెటీల విషయంలో ఎప్పుడూ ఏదో ఒక కామెంట్ చేసి సోషల్ మీడియాలో హడావుడి సృష్టిస్తుంది. ఇటీవల ఆమె పెళ్లి విషయం సోషల్ మీడియాలో పెను సంచలనాలు సృష్టించింది. ఎప్పుడూ ఏదో ఒక వివాదాలపై వార్తల్లో నిలిచే రాఖీ సావంత్ తాజాగా హాస్పిటల్ లో చేరడం హాట్ టాపిక్ గా మారింది.

రాఖీ సావంత్ తీవ్ర గుండె జబ్బుతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇవి చూసి అభిమానులు షాక్ కి గురయ్యారు. ఆమె ఆరోగ్యంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. హిందా పాపారాజి వైరల్ భయానీ తన ఇన్‌స్టాగ్రామ్ లో ప్రస్తుతం రాఖీ సావంత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.. ఆమె ఆపస్మారక స్థితిలో ఉన్నట్లు కనిస్తుందని ఫోటోలు షేర్ చేశారు. ఒక వేలికి ఆక్సీమీటర్, మరొకర చేతికి వైగో జోడించబడి ఉంది.. ఆమెకు గ్లూకోజ్ ఎక్కిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి క్రిటికట్ గానే ఉన్నట్లో కనిపిస్తుందని కామెంట్ చేశారు. ఇదిలా ఉంటే రాఖీ సావంత్ ఆరోగ్యం బాగానే ఉందని.. ప్రమాదం ఏమీ లేదని వైద్యులు చెప్పినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.ఇదిలా రాఖీ సావంత్ అప్పడప్పుడు ఇలాంటి ఫ్రాంక్స్ చేస్తుంది.. ఒకవేళ ఇది ఏమైనా ఫ్రాంకా? అని కొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి