iDreamPost

రాకేష్‌ మాస్టర్‌ కుటుంబం గొప్ప నిర్ణయం.. ఇంత విషాదంలోనూ!

  • Published Jun 19, 2023 | 5:26 PMUpdated Jun 19, 2023 | 5:26 PM
  • Published Jun 19, 2023 | 5:26 PMUpdated Jun 19, 2023 | 5:26 PM
రాకేష్‌ మాస్టర్‌ కుటుంబం గొప్ప నిర్ణయం.. ఇంత విషాదంలోనూ!

టాలీవుడ్‌ ప్రముఖ కొరియోగ్రాఫర్‌ రాకేష్‌ మాస్టర్‌ మృతి చెందిన సంగతి తెలిసిందే. గత వారం రోజులుగా ఆస్పత్రిలో చేరిన రాకేష్‌ మాస్టర్‌.. చికి​త్స పొందుతూ.. ఆదివారం సాయంత్రం మృతి చెందారు. టాలీవుడ్‌లో సీనియర్‌ కొరియోగ్రాఫర్‌ రాకేష్‌ మాస్టర్‌. ప్రస్తుతం ఇండస్ట్రలో టాప్‌ కొరియోగ్రఫర్‌లుగా రాణిస్తోన్న శేఖర్‌ మాస్టర్‌, జానీ మాస్టర్‌ వంటి వారు.. రాకేష్‌ మాస్టర్‌ దగ్గరే శిష్యరికం చేశారు. తన శిష్యులు జీవితంలో ఉన్నత శిఖిరాలకు చేరుకున్నారు. కానీ రాకేష్‌ మాస్టర్‌ మాత్రం.. తన ముక్కుసూటితనం కారణంగా ఇండస్ట్రీలో అవకాశాలు పొగొట్టుకున్నారని సమాచారం. కొరియోగ్రాఫర్‌ కన్నా కూడా యూట్యూబ్‌లో ఫన్ని ఇంటర్వ్యూలు, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. నిత్యం వార్తల్లో నిలస్తుండేవాడు రాకేష్‌ మాస్టర్‌. ఆయన మృతి పట్ల కొరియోగ్రాఫర్లు, డ్యాన్సర్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

రాకేష్‌ మాస్టర్‌ మృతితో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. అయితే ఇంతటి విషాదంలోనూ రాకేష్‌ కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాకేష్‌ మాస్టర్‌ మృతి చెందనిప్పటికి.. అవయవ దానం ద్వారా.. మరి కొందరికి జీవితాన్ని ఇచ్చి.. వారి నవ్వుల్లో ఆయన బతికి ఉండేలా చేశారు. అవయవదానం చేయాలని రాకేష్‌ మాస్టర్‌ కొన్ని నెలల క్రితమే నిర్ణయం తీసుకున్నారట. తనకున్న అనారోగ్య సమస్యల వల్ల.. త్వరలోనే తాను చనిపోతానని రాకేష్ మాస్టర్ ముంచే ఊహించారట. దాంతో ఆయన ఓ అనూహ్య నిర్ణయం తీసుకున్నారంట. తాను మృతి చెందిన తర్వాత తన శరీరంలో పనికి వచ్చే అవయవాలు దానం చేయాలని నిర్ణయించుకున్నారని.. ఈ మేరకు ప్రాసెస్‌ పూర్తి చేశారని.. రాకేష్ మాస్టర్ అసిస్టెంట్ సాజిద్ తెలిపారు.

రాకేష్‌ మాస్టర్‌ మృతి నేపథ్యంలో సాజిద్‌ ఇదే విషయాన్ని డాక్టర్లకు చెప్పారట. రాకేష్ మాస్టర్ మృతదేహానికి పోస్టుమార్టం చేసి, బాడీ పార్ట్స్ తీసుకున్న అనంతరం.. తమకు ఆయన మృతదేహాన్ని అప్పజెప్పాలని, ఆ తర్వాత తాము అంత్యక్రియలు నిర్వహిస్తామని కోరారట. ఇక రాకేష్ మాస్టర్ కళ్లను దానం చేసేందుకు ఆయన కుటుంబసభ్యులు కూడా అంగీకరించారని సాజిద్ స్పష్టం చేశారు. ఒకప్పుడు మంచి కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకుని.. ప్రస్తుతం ఏదో ఒకటి మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వైరల్ అయిన రాకేష్ మాస్టర్ మనసు ఇంత మంచిదా కామెంట్స్‌ చేస్తున్నారు నెటిజనులు. అంతే కాదు ఆయన చనిపోయినా అవతలి వారికి ఏదో ఒక విధంగా ఉపయోగపడాలనే ఆయన గొప్ప మనసును అంతా ప్రశంసిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి