iDreamPost

Lal Salaam Twitter Review: రజినీకాంత్ నటించిన లాల్ సలామ్ ట్విట్టర్ రివ్యూ!

లాల్ సలామ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సూపర్ స్టార్ రజినీకాంత్. ఆ చిత్రం చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా తెలియజేస్తున్నారు. మరి లాల్ సలామ్ ఎలా ఉందో ట్విట్టర్ రివ్యూలో చూద్దాం.

లాల్ సలామ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సూపర్ స్టార్ రజినీకాంత్. ఆ చిత్రం చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా తెలియజేస్తున్నారు. మరి లాల్ సలామ్ ఎలా ఉందో ట్విట్టర్ రివ్యూలో చూద్దాం.

Lal Salaam Twitter Review: రజినీకాంత్ నటించిన లాల్ సలామ్ ట్విట్టర్ రివ్యూ!

గతేడాది ‘జైలర్’ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన సూపర్ స్టార్ రజినీకాంత్ మరోసారి ప్రేక్షకులను అలరించడానికి వచ్చాడు. ‘లాల్ సలామ్’ సినిమాతో ఫిబ్రవరి 9న థియేటర్లలోకి అడుగుపెట్టాడు తలైవా. ఐశ్వర్య రజినికాంత్ దర్శకత్వం వహించిన ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ లో సుభాస్కరణ్ నిర్మించారు. ఇక ఈ చిత్రంతో జీవితా రాజశేఖర్ రీ ఎంట్రీ ఇచ్చారు. టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ గెస్ట్ రోల్ లో కనిపించిన ఈ మూవీని చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ వేదికగా సినిమా ఎలా ఉందో తమ అభిప్రాయాలను పంచుకుంటూ ఉన్నారు.

లాల్ సలామ్ అంటూ థియేటర్లలోకి అడుగుపెట్టాడు సూపర్ స్టార్ రజినీకాంత్. ఇప్పటికే ఓవర్సిస్ తో పాటుగా తమిళనాడులో ఫస్ట్ షోలు పడిపోయాయి. మతాన్ని నమ్మితే మనసులో ఉంచుకో.. మానవత్వాన్ని అందరితో పంచుకో అన్న సందేశంతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పిస్తుందని కొందరు కామెంట్లు చేస్తున్నారు. రజినీ ఎంట్రీ సీన్స్ థియేటర్లలో అరుపులు పుట్టిస్తాయని, భాషా సినిమాను గుర్తుకు చేస్తాడని చాలా మంది నెటిజన్లు రాసుకొస్తున్నారు. సూపర్ స్టార్ గెస్ట్ రోల్ చేసినప్పటికీ.. సినిమా మెుత్తాన్ని ఆయన ఆక్రమించాడని కొందరు అంటున్నారు.

ఇక ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవల్ అని అవి సినిమాకు మరింత ప్లస్ పాయింట్స్ అని తెలుపుతున్నారు. అయితే ఇలాంటి పవర్ ఫుల్ కథను చెప్పడంలో దర్శకురాలు ఐశ్వర్య కొంత మేరకు విఫలం అయ్యారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రధాన పాత్రల్లో నటించిన విష్ణు-విక్రాంత్ ల మధ్య వచ్చే సీన్లు ఒకదానితో ఒకటి సంబంధం లేదని అవి సాధారణ ప్రేక్షకులకు నిరాశను కలిగిస్తాయని కొందరు పేర్కొంటున్నారు. క్లైమాక్స్ టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తుందని, స్ట్రాంగ్ స్టోరీ అని కొందరు రాసుకొచ్చారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి